Site icon Desha Disha

Indian cricket : గౌతమ్ గంభీర్ కాదు.. టీమిండియా కు .. రవి శాస్త్రి, అనిల్ కుంబ్లే లాంటి వాళ్లే కావాలిప్పుడు!

Indian cricket : గౌతమ్ గంభీర్ కాదు.. టీమిండియా కు .. రవి శాస్త్రి, అనిల్ కుంబ్లే లాంటి వాళ్లే కావాలిప్పుడు!

Indian cricket : టి20 అనేది వేగానికి కొలమానం. వన్డే అనేది దూకుడుకు పర్యాయపదం. వాస్తవానికి అసలు సిసలైన క్రికెట్ చూడాలంటే సుదీర్ఘ ఫార్మాట్ లోనే సాధ్యమవుతుంది. సుదీర్ఘ ఫార్మాట్ లో ఎన్ని అద్భుతాలయినా చేయొచ్చు. ఎన్ని సంచలనాలైనా సృష్టించవచ్చు.. అందుకే ఒక ఆటగాడి పరిపూర్ణత టెస్ట్ క్రికెట్ లోనే బయటపడుతుంది.

టెస్ట్ క్రికెట్ లో టీమిండియా ఎన్నో అద్భుతాలు చేసింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లోకి రెండుసార్లు ప్రవేశించింది. విజేతగా నిలవలేకపోయినప్పటికీ.. తన వంతు ఆట తీరు ప్రదర్శించింది. అయితే అలాంటి చరిత్ర ఉన్న టీమ్ ఇండియా ప్రస్తుతం టెస్ట్ సిరీస్లలో దారుణమైన ఆటతీరు ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా స్వదేశంలో కివీస్ తో మూడు టెస్టులు ప
ఓడిపోయిన తర్వాత.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఓడిపోయింది.. ఇప్పుడు తాజాగా ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన ఐదు టెస్టుల సిరీస్ ను సొంతం చేసుకోలేకపోయింది. ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శన బాగానే ఉన్నప్పటికీ.. జట్టుగా మాత్రం విఫలమవుతుండడం ఇబ్బంది కలిగిస్తోంది. గౌతమ్ గంభీర్ నాయకత్వం వహించిన తర్వాత టీమ్ ఇండియా చెప్పుకోదగ్గ విజయాలు సాధించలేకపోతోంది. దీంతో గౌతమ్ గంభీర్ ను కోచ్ గా తప్పించాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.

గత ఆరుగురు హెడ్ కోచ్ ల ఆధ్వర్యంలో టీమిండియా తొలి 15 టెస్టులలో సాధించిన విజయాలను ఒకసారి పరిశీలిస్తే..

2008 నుంచి 2011 గ్యారీ కిర్ స్టెన్ టీం మీడియాకు కోచ్ గా వ్యవహరించాడు. ఆ సమయంలో టీమిండియా 15 టెస్టులు ఆడింది. ఇందులో ఆరు గెలిచింది. మూడు ఓడిపోయింది. ఆరు మ్యాచ్లను డ్రా చేసుకుంది. విజయాల శాతం 40 గా ఉంది.

2011 నుంచి 2015 వరకు టీమిండియాకు ప్లెచర్ కోచ్ గా వ్యవహరించాడు. ఇందులో నాలుగు మ్యాచులు టీమ్ ఇండియా గెలిచింది. ఎనిమిది మ్యాచ్లలో ఓడిపోయింది. మూడు మ్యాచ్ లను డ్రా చేసుకుంది. విజయాల శాతం 26.6 గా నమోదయింది.

2016- 17 కాలంలో అనిల్ కుంబ్లే కోచ్ గా వ్యవహరించాడు. ఈ సమయంలో టీమిండియా 11 టెస్ట్ మ్యాచ్లు గెలిచింది. కేవలం ఒకదాంట్లో ఓడిపోయింది. మూడు మ్యాచులు డ్రా అయ్యాయి. విజయాల శాతం 73.3 గా నమోదయింది..

2017 నుంచి 2021 వరకు రవి శాస్త్రి టీమిండియా కు కోచ్ గా వ్యవహరించాడు. ఇందులో టీమిండియా ఏడు మ్యాచ్లు గెలిచింది. ఆరింట్లో ఓడిపోయింది. రెండు డ్రా చేసుకుంది. విజయాల శాతం 46.6 గా నమోదయింది.

2021 నుంచి 24 వరకు ద్రావిడ్ ప్రధాన శిక్షకుడిగా వ్యవహరించాడు. ఇందులో ఎనిమిది టెస్ట్ మ్యాచ్లను టీమ్ ఇండియా గెలిచింది. ఐదింట్లో ఓడిపోయింది. రెండు మ్యాచ్లను డ్రా చేసుకుంది. విజయాల శాతం 53.3 గా నమోదయింది.

గంభీర్ శిక్షణలో టీమిండియా 2024 నుంచి 25 లో ఇప్పటివరకు 4 టెస్ట్ మ్యాచ్లు గెలిచింది. 8 ఓడిపోయింది. ఇందులో రెండు డ్రా అయ్యాయి. విజయాల శాతం 28.6 గా నమోదయింది.

[

Exit mobile version