Site icon Desha Disha

Gold Price Today: వామ్మో.. ఒక్క రోజులోనే 1500 పెరిగిన బంగారం ధర.. తులం ధర ఎంతో తెలిస్తే.. – Telugu News | Today Gold Price: Gold and Silver Rate in Hyderabad, Mumbai, Delhi, Chennai and other cities on August 3rd

Gold Price Today: వామ్మో.. ఒక్క రోజులోనే 1500 పెరిగిన బంగారం ధర.. తులం ధర ఎంతో తెలిస్తే.. – Telugu News | Today Gold Price: Gold and Silver Rate in Hyderabad, Mumbai, Delhi, Chennai and other cities on August 3rd

బంగారం ధరలు నమ్మించి దెబ్బకొడుతోంది. తగ్గుతూ వస్తున్న పసిడి ధర.. ఒక్కసారిగా ఎగబాకుతోంది. ధరల విషయంలో స్వల్పంగా తగ్గుతున్న బంగారం ధర.. పెరిగేటప్పుడు మాత్రం భారీగా ఉంటుంది. గత నాలుగైదు రోజులుగా స్వల్పంగానే తగ్గుతూ వస్తోంది. కానీ నిన్నటి నుంచి ఇప్పటి వరకు ఒక్క రోజులోనే భారీగా పెరిగింది. అంటే తులం బంగారం ధరపై ఏకంగా 1500 రూపాయల వరకు దూసుకుపోయింది. శనివారం 24 క్యారెట్ల తులం బంగారం ధర 99,810 ఉండగా, ఆదివారం ఉదయం 6 గంటల సమాయానికి రూ.1,01,350 ఉంది. అంటే లక్ష దాటేసింది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై కూడా అదే రీతిలో పెరిగి ప్రస్తుతం రూ.92,900 వద్ద ఉంది. ఇక వెండి ధర విషయానికొస్తే ఇది పెద్దగా పెరగలేదు. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1,13,000 వద్ద ఉంది. మరిన్ని ప్రాంతాల్లో రూ.1,23,000 ఉంది.

ఇది కూడా చదవండి: Traffic Challans: గుడ్‌న్యూస్‌.. మీ వాహనంపై చలాన్లు ఉన్నాయా? సగం డబ్బులు మాఫీ!

ఇది కూడా చదవండి: Viral Video: దారుణం.. ఇంట్లో దూరిన వీధి కుక్కులు.. పెంపుడు కుక్కను ఎలా చంపాయో చూడండి.. షాకింగ్‌

ఇవి కూడా చదవండి

దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:

  1. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,01,350 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,900 వద్ద ఉంది.
  2. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,01,350 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,900 వద్ద ఉంది.
  3. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,01,500 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.93,050 వద్ద ఉంది.
  4. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,01,350 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,900 వద్ద ఉంది.
  5. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,01,350 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,900 వద్ద ఉంది.
  6. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,01,350 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,900 వద్ద ఉంది.
  7. కేరళలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,01,350 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,900 వద్ద ఉంది.
  8. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు.

ఇది కూడా చదవండి: Hero Vida: సింగిల్ ఛార్జింగ్‌తో 142కి.మీ మైలేజ్‌.. ధర కేవలం రూ.45,000 మాత్రమే.. రికార్డ్‌ స్థాయిలో అమ్మకాలు!

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Exit mobile version