Site icon Desha Disha

EPFO: ఈపీఎఫ్‌వో మీ పీఎఫ్ డబ్బును ఎక్కడ పెట్టుబడి పెడుతుందో తెలుసా..? – Telugu News | Do you know where EPFO invests your PF money? Check Full Details

EPFO: ఈపీఎఫ్‌వో మీ పీఎఫ్ డబ్బును ఎక్కడ పెట్టుబడి పెడుతుందో తెలుసా..? – Telugu News | Do you know where EPFO invests your PF money? Check Full Details

ఏదైన సంస్థలో పనిచేస్తే జీతం నుంచి ప్రతి నెలా పీఎఫ్ కట్ అవుతుంది. ఉద్యోగి జీతం నుంచి కట్ చేసిన డబ్బుకు సమానంగా కంపెనీ కూడా పీఎఫ్‌ కడుతుంది. కష్టకాలంలో పీఎఫ్ ఎంతో ఉపయోగపడుతుంది. రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ వంటి సౌకర్యాలను అందిస్తుంది. అకౌంట్ ఓపెన్ చేసిన 6నెలల తర్వాత నుంచి ఎప్పుడు కావాలంటే అప్పుడు పీఎఫ్ విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే పీఎఫ్ డబ్బు ఎప్పటికీ అకౌంట్‌లోనే ఉంటుందా..? లేదా సంస్థ ఎక్కడైనా పెట్టుబడి పెడుతుందా అనే డౌట్లు చాలా మందిలో ఉంటాయి. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈ డబ్బును స్థిర ఆదాయ మార్గాల్లో  పెట్టుబడి పెడుతుంది.

మూడు భాగాలుగా పీఎఫ్ డబ్బు

పీఎఫ్ పథకం కింద.. ఉద్యోగులు, యజమానులు ఇద్దరూ ప్రతి నెలా ప్రాథమిక జీతంలో 12శాతం కంట్రిబ్యూషన్ చేస్తారు.
ఉద్యోగి జీతం నుండి కట్ అయిన 12శాతం పూర్తిగా మీ EPF ఖాతాలోకి వెళుతుంది. మీరు ప్రతి ఏడాది దానిపై వడ్డీని కూడా పొందుతారు.
యజమాని నుంచి జమ చేసింది మాత్రం మూడు భాగాలుగా విభజించారు.
8.33శాతం ఈపీఎస్ (పెన్షన్ పథకం) కు వెళుతుంది.
3.67శాతం ఈపీఎఫ్ ఖాతాకు వెళుతుంది.
దీనితో పాటు EDLI (బీమా పథకం) కు కూడా విడిగా ఉంటుంది.

ఉదాహరణకు.. మీ ప్రాథమిక జీతం రూ.16,000 అయితే.. రెండు వైపులా రూ.1,920 – రూ.1,920 ఖాతాలో యాడ్ అవుతాయి. ఇందులో యజమాని వైపు నుండి రూ.587 మాత్రమే EPF లో కనిపిస్తుంది. మిగిలినది పెన్షన్, బీమా పథకానికి వెళుతుంది.

ఈపీఎఫ్‌వో డబ్బును ఎక్కడ పెట్టుబడి పెడుతుంది?

ఈపీఎఫ్‌వో మీ ఖాతాలో జమ చేసిన మొత్తాన్ని నేరుగా తన వద్దే నగదు రూపంలో ఉంచుకోదు. సురక్షితమైన, స్థిరమైన రాబడికి అవకాశం ఉన్న పథకాలలో పెట్టుబడి పెడుతుంది.

ప్రభుత్వ బాండ్లు – సెక్యూరిటీలు:

గత కొన్ని సంవత్సరాలుగా.. ఈపీఎఫ్‌వో తన నిధులలో 15శాతం స్టాక్ మార్కెట్‌తో అనుసంధానించబడిన ETFలలో పెట్టుబడి పెడుతుంది. పెన్షన్, బీమా ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. యజమాని EPSలో జమ చేసిన 8.33శాతం మీ పదవీ విరమణ తర్వాత నెలవారీ పెన్షన్‌కు ఆధారం అవుతుంది. మీరు 10 ఏళ్లు EPF పథకానికి నిరంతరం డబ్బు కడుతుంటే, మీరు 58ఏళ్ల తర్వాత పెన్షన్ పొందుతారు. దీనితో పాటు EDLI పథకం కింద, ఉద్యోగి అకాల మరణంపై కుటుంబానికి బీమా ప్రయోజనం కూడా లభిస్తుంది.

పెన్షన్ మొత్తాన్ని ఎప్పుడు తీసుకోవచ్చు..?

మీరు 10 ఏళ్ల కంటే తక్కువ కాలం పనిచేసి.. మీ పీఎఫ్ ఖాతాను మూసివేస్తే.. ఫామ్ 10C ని ఫిల్ చేసి పెన్షన్ డబ్బును తీసుకోవచ్చు. కానీ 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉంటే మీరు పెన్షన్ డబ్బును ఉపసంహరించుకోలేరు. కానీ భవిష్యత్తులో పెన్షన్‌కు అర్హులు అవుతారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Exit mobile version