Site icon Desha Disha

372 టార్గెట్ విధించినా.. ఇంత దారుణమా.. గౌతమ్ గంభీర్ వల్లే ఈ అనర్థాలు

372 టార్గెట్ విధించినా.. ఇంత దారుణమా.. గౌతమ్ గంభీర్ వల్లే ఈ అనర్థాలు

Gautam Gambhir

India Vs England Test: సుదీర్ఘ ఫార్మాట్లో 372 పరుగుల టార్గెట్ అంటే మామూలు విషయం కాదు. గొప్ప గొప్ప జట్లు కూడా ఈ పరుగులను చేదించలేక చేతులెత్తేస్తాయి. వాస్తవానికి ఇన్ని పరుగులు చేసినప్పటికీ టీమిండియా ప్రతికూల ఫలితాన్ని అందుకోవడం సగటు అభిమానికి ఏమాత్రం మింగుడు పడడం లేదు. అసలు ఇంగ్లాండ్ పిచ్ లు వైవిధ్యంగా ఉంటాయి. ఏమాత్రం ఒక అంచనాకు అందవు. అలాంటి పిచ్ లపై ఫాస్ట్ బౌలర్లు మాత్రమే ప్రభావం చూపించగలరు. ఆ విషయం తెలిసి కూడా గౌతమ్ గంభీర్ ముగ్గురు బౌలర్లను మాత్రమే జట్టులోకి తీసుకోవడం విశేషం..

కేవలం ముగ్గురు బౌలర్లతో రంగంలోకి దిగడం టీమిండియా కు ఐదో టెస్టులో ప్రతికూల ఫలితాన్ని అందించింది. వెంటనే మూడు వికెట్లు తీసినప్పటికీ.. ఆ తదుపరి ఆతిథ్య జట్టు మీద ఒత్తిడి తీసుకురావడంలో టీమిండియా బౌలర్లు విఫలమయ్యారు. ముఖ్యంగా సిరాజ్ బౌలింగ్ భారాన్ని మోయాల్సి వచ్చింది. అతను కూడా బంతులు వేసి అలసిపోయాడు. మరోవైపు ప్రసిధ్ కృష్ణ ధారాళంగా పరుగులు ఇచ్చాడు. ఆకాష్ దీప్ బ్యాట్ తో హాఫ్ సెంచరీ చేసినప్పటికీ.. బంతితో ఆకట్టుకోలేకపోయాడు. దీనికి తోడు సిరాజ్ బ్రూక్ ఇచ్చిన విలువైన క్యాచ్ ను నేలపాలు చేయడం మ్యాచు మొత్తాన్ని ఇంగ్లాండ్ వైపు వెళ్లేలా చేసింది.. రూట్, బ్రూక్ నాలుగో వికెట్ కు ఏకంగా డబుల్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో ఇంగ్లాండ్ జట్టుకు ఎదురు అనేది లేకుండా పోయింది. వాస్తవానికి కొంతకాలంగా బజ్ బాల్ గేమ్ ఇంగ్లాండ్ జట్టుకు ప్రతికూల ఫలితాన్ని అందిస్తోంది. కానీ లండన్ ఓవల్ టెస్ట్ లో మాత్రం అనుకూలమైన ఫలితాన్ని అందించింది. ఒక రకంగా ఇంగ్లాండ్ దూకుడుగా ఆడింది అనేదానికంటే.. టీమిండియా బౌలింగ్ అత్యంత దారుణంగా ఉంది అనడం సబబు.

ఇంగ్లాండ్ పిచ్ లు విభిన్నంగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా నలుగురు బౌలర్లు అవసరం. ఈ మాత్రం సోయి లేకుండా టీమిండియా కోచ్ ముగ్గురు బౌలర్లతో రంగంలోకి దిగడం అత్యంత విషాదం. వాస్తవానికి నలుగురు బౌలర్లు అయితేనే వర్క్ లోడ్ నుంచి తప్పించుకుంటారు. ఒకరు విఫలమైన సరే మిగతావారు ఆదుకుంటారు. కానీ ఈ ప్రాథమిక సూత్రాన్ని మర్చిపోయిన గౌతమ్ గంభీర్ కేవలం ముగ్గురు బౌలర్లతో రంగంలోకి దిగడం విశేషం.. ముగ్గురు బౌలర్లు తొలి ఇన్నింగ్స్ లో పర్వాలేదు అనిపించినప్పటికీ.. రెండవ ఇన్నింగ్స్ నాటికి చేతులెత్తేశారు. వాస్తవానికి నలుగురు బోధర్లతో రంగంలోకి దిగి ఉంటే మ్యాచ్ పరిస్థితి మరో విధంగా ఉండేది.

బౌలింగ్ కోచ్ మోర్ని మోర్కల్ వల్ల ఉపయోగం లేదని.. అతనిపై వేటువేయాలని ఇప్పటికే మేనేజ్మెంట్ నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి. బౌలింగ్ కోచ్ సక్రమంగా లేడు కాబట్టి అతనిపై వేటువేయాలని డిసైడ్ అయ్యారు. అలాంటప్పుడు గౌతమ్ గంభీర్ మీద కూడా వేటు వేయాల్సిందే కదా. అనవసరమైన ప్రయోగాలతో జట్టును దారుణంగా ఇబ్బంది పెడుతున్నాడు. కీలకమైన ఆటగాళ్లను రిజర్వ్ బెంచ్ కు పరిమితం చేసి ప్రయోగాలు చేస్తున్నాడు. ఐదో టెస్టుకు ఆర్ష్ దీప్ సింగ్ ను జట్టులోకి తీసుకుంటారని వార్తలు వచ్చాయి. కానీ అతడిని రిజర్వ్ బెంచ్ కు పరిమితం చేశారు.. ఇలా చెప్పుకుంటూ పోతే గంభీర్ తీసుకున్న చెత్త నిర్ణయాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా జట్టు విజయావకాశాలను తీవ్రంగా ప్రభావితం చేశాయి.

[

Exit mobile version