హమ్మయ్య.. దయ్యాల జాబితాలో కేటీఆర్ మాత్రం లేరు..?

Kavitha Comments: “కేసీఆర్ దేవుడు.. ఆయన చుట్టూ దయ్యాలు వచ్చి చేరాయని” అని కవిత వేసిన బాంబు ప్రభావం ఇప్పటికీ ఇంకా తగ్గలేదు. ఆయన చుట్టూ ఉన్న వారెవరూ, వారిలో దయ్యాలు ఎవరు అని తేలుకునేందుకు మీడియా ఇప్పటికీ ఆపసోపాలు పడుతోంది. ఆ దయ్యాలెవరై ఉంటారనే విషయమై మీడియాలోని కాదు అన్ని పార్టీలలో ప్రముఖంగా చర్చకు వస్తూనే ఉంది. కొన్ని చానల్స్ కేసీఆర్ కు దగ్గరగా వ్యవహరించేవారిలో కేటీఆర్ ఒకరు కనుక ఆయన అయుండవచ్చని కథనాలు వచ్చాయి. అలాగే హరీష్ రావు, సంతోష్ కుమార్, జీవన్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి ఇలా చాలామంది నాయకుల పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కూడా కొడుతున్నాయి. అయితే ఆ జాబితాలో కేటీఆర్ ఉండవచ్చని భావిస్తూ, వీరి మధ్య అంతర్యుద్ధం, ఆధిపత్య పోరు జరుగుతోందని కూడా ఎవరికివారే వ్యాఖ్యలు చేయడం, అవి చిలువలు పలువలుగా మీడియా కథనాలు కూడా రాసింది. కానీ ఇప్పటికీ ఆ దయ్యాలు ఎవరో కవిత బహిర్గతం చేయడం లేదు. పార్టీ పెద్ద మనుషులు కూడా ఆ ప్రశ్నలకు జవాబు చెప్పడం లేదు.

రాజకీయం వేరు.. రక్త సంబంధం వేరు
అయితే ఒక చానల్ ఇంటర్వ్యూలో యాంకర్ ఏదో విధంగా ఆ దయ్యాలు ఎవరై ఉంటారని తెలుసుకునేందుకు విశ్వ ప్రయత్నం చేసినా ఆమె జవాబు చెప్పకుండా దాటవేశారు. తాను తన తండ్రి కేసీఆర్ కు రాసిన లేఖను మీడియాకు బహిర్గతం చేసిన వారెవరో పార్టీ నాయకులే గుర్తించాలని, వారిపై చర్యలు తీసుకునే వరకు బిఆర్ఎస్ కు దూరంగా ఉంటానని తేల్చి చెప్పారు. కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యాలు ఎవరో కవిత తేల్చాలని చాలా మంది కోరుకుంటున్నారు. అని అడిగిన ప్రశ్నకు కూడా ఆమె దాటవేశారు. చివరికి తెలివిగా సెంటిమెంట్ ప్రశ్న వేసిన యాంకర్, ఆమె చెప్పిన జవాబుతో తన అనుమానాన్ని నివృత్తి చేసుకున్నాడు. ఈ సంవత్సరం కేటీఆర్ కు రాఖీ కట్టబోతున్నారా.? అని యాంకర్ అడగ్గా, గత సంవత్సరం జైళ్లో ఉండడంతో రాఖీ కట్టలేకపోయానని, ఈ సంవత్సరం తప్పకుండా రాఖీ కడుతానని ఆమె చెప్పారు. రాజకీయం వేరు రక్తసంబంధం వేరు అని
అని ఆమె దొరికిపోయారు. రాజకీయాలు వేరు అంటున్నారు అంటే ఆ దయ్యాల్లో కేటీఆర్ కూడా ఒకరా అని వెంటవెంటనే అడుగగా, ఆమె కాదని జవాబు చెప్పగా, దయ్యాల జాబితా నుంచి ఒకరిని తొలగించవచ్చు అనడంతో ఆమె నవ్వుతూ అన్నతో తనకేమి ఇబ్బంది లేదని, ఒకటికి రెండుసార్లు చెప్పారు. అన్నయ్య అలాంటి వాడు కాడు అని, ఆ జాబితాలో అన్నయ్య లేడని తేల్చి చెప్పారు. అంటే ఇంకా కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యాల జాబితాలో ఎవరెవరు ఉన్నారో తెలుసుకునే పనిలో మీడియా తలమునకలయ్యింది. అయితే ఈ లేఖ బయటికి రావడం, దానిపై కవిత సీరియస్ గా స్పందించడం, అనంతరం పరిణామాలు అన్ని పార్టీ ప్రక్షాళనలో భాగంగా పెద్ద మనిషి వేసిన భారీ స్కెచ్ లో భాగమని తెలుస్తోంది. అసలు పార్టీని నట్టేట ముంచిన వారెవరో తెలుసుకొని, వారిని దూరం పెట్టే ప్రయత్నంలో భాగమని విశ్లేషిస్తున్నారు.

[

Leave a Comment