Best Time to Walk: వెదర్ పొల్యూషన్.. పాయిజన్ ఫుడ్.. వెరసి ప్రతి ఒక్కరూ ఏదో ఒక జబ్బుతో బాధపడుతున్నారు. అయితే వీటిలో భాగంగా బరువు కూడా ప్రధాన సమస్యగా మారింది. చిన్నా.. పెద్ద.. అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిలో కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. దీనిని తగ్గించుకునేందుకు కొందరు మెడిసిన్స్ వైపు వెళుతుండగా.. మరికొందరు వర్క్ అవుట్ చేస్తూ తీవ్రంగా కష్టపడుతున్నారు. ఇంకొందరు మాత్రం వాకింగ్ చేస్తూ కొవ్వును కరిగించుకుంటున్నారు. అయితే వైద్య నిపుణులు తెలుపుతున్న ప్రకారం వాకింగ్ తో ఎక్కువ శాతం బరువు తగ్గుతారని అంటున్నారు. కానీ వర్క్ అవుట్ చేయకుండా అదెలా సాధ్యం అని అంటుంటారు. అంతేకాకుండా మార్నింగ్ వాక్ చేయడం వల్ల బరువు తగ్గుతారా? లేక ఈవినింగ్ వాక్ చేయడం మంచిదా? అనే సందేహం చాలా మందిలో ఉంది. అసలు విషయం ఏంటంటే?
Also Read: కొత్త రీసెర్చ్: 7 గంటలు.. 9 గంటలు.. అసలే ఎన్ని గంటలు నిద్రపోతే మంచిదంటే?
చాలామంది మార్నింగ్ వాక్ చేయడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఉదయం కాస్త సమయం ఉండడంతో సమీపంలోని మైదానం లేదా ఇంటి పరిసర ప్రాంతాల్లో నడుస్తూ ఉంటారు. అంతేకాకుండా ఉదయం ఎలాంటి ట్రాఫిక్ ఉండదు. స్వచ్ఛమైన వాతావరణం ఉంటుంది. ఉదయం ఎలాంటి ఫుడ్ తీసుకోకుండా నడవడం వల్ల శరీరంలో ఉండే అదనపు కొవ్వు కరిగిపోయి జీర్ణ క్రియ శక్తిని పెంచుతుంది. దీంతో రోజంతా ఎలాంటి ఫుడ్ తీసుకున్నా.. సమస్యలు ఉండవు. అందువల్ల మార్నింగ్ వాక్ చేయడం మంచిది అని కొందరు అంటుంటారు.
అయితే ఈవినింగ్ వాక్ చేసే వారు కూడా చాలామంది ఉన్నారు. మార్నింగ్ వివిధ కారణాలవల్ల నిద్ర లేవకపోవడం.. ఇతర పనులు ఉండడంతో బిజీగా మారిపోతూ ఉంటారు. దీంతో వాకింగ్ చేయడానికి సమయం ఉండదు. ముఖ్యంగా మహిళలు ఉదయం అనేక పనులు చేస్తుంటారు. ఇలాంటివారు సాయంత్రం నడవడం ఎంచుకోవడమే ఉత్తమ మార్గం అని అంటున్నారు. సాయంత్రం స్నేహితులు, కుటుంబ సభ్యులతో వాకింగ్ చేయడం వల్ల ఉల్లాసంగా ఉంటుంది. ఈ సమయంలో నడిస్తే శరీరం ఆక్టివ్ గా మారి.. నాణ్యమైన నిద్ర వస్తుంది. అంతేకాకుండా సాయంత్రం తినే ఆహారం కూడా పెద్ద సమస్యగా మారదు.
Also Read: ఉదయం లేవగానే ఈ పనులను అస్సలు చేయొద్దు..
మార్నింగ్, ఈవినింగ్ వాక్ రెండు మంచివే. కానీ ఏ వాక్ చేసినా 30 నిమిషాల కంటే తక్కువగా ఉండకుండా చూడాలి. వాకింగ్ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని అనుకోవద్దు. ఎందుకంటే నడక వల్ల శరీరంలో అనేక అవయవాలు కదులుతూ ఉంటాయి. దీంతో రక్తప్రసరణ మెరుగ్గా ఉండేలా చేస్తాయి. కండరాలు గట్టి పడతాయి. మనసు ఉల్లాసంగా మారుతుంది. మార్నింగ్ వాక్ చేయడం వల్ల రోజంతా ఉల్లాసంగా ఉంటే… ఈవినింగ్ వర్క్ చేయడం వల్ల రాత్రి హాయిగా నిద్రపోతారు. అందువల్ల ఎప్పుడూ కుదిరితే అప్పుడు వాకింగ్ చేయడమే ఉత్తమం. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కూడా సమయం ఉంటే కాస్త అటు ఇటు తిరగడం మరింత మేలు అని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
[