Meghalaya Women Rights: మనదేశమే కాదు ప్రపంచంలో ఎక్కడ చూసినా సరే పితృ స్వామ్య వ్యవస్థ కొనసాగుతోంది. అమ్మాయికి పెళ్లి చేస్తే చాలు అబ్బాయి ఇంటికి వెళ్ళిపోతుంది.. చివరికి ఆమె ఇంటి పేరు కూడా మారిపోతుంది. ఆమెకు పుట్టిన పిల్లలకు భర్త ఇంటిపేరు వస్తుంది. పుట్టింటికి చుట్టపు చూపుగా వస్తుంది. మనదేశమే కాదు ఇలాంటి వ్యవస్థ ప్రపంచం మొత్తం కొనసాగుతోంది. అయితే మన దేశంలో ఒక ప్రాంతంలో మాత్రం ఇందుకు విరుద్ధంగా సాగుతోంది.
Also Read: ఎంత పని చేసావ్ సిరాజ్ భయ్యా.. బంగారం లాంటి క్యాచ్.. ప్చ్..
మన దేశంలోని ఈశాన్య రాష్ట్రంలో ఒకటైన మేఘాలయలో ఎన్నో గిరిజన తెగలు నివసిస్తుంటాయి. ఈ తెగలో ఖాసీ అనే తెగ ప్రజల జీవనశైలి విభిన్నంగా ఉంటుంది.. వీరు మహిళలకు విపరీతమైన ప్రాధాన్యమిస్తుంటారు. వాస్తవానికి గతంలో వీరి కుటుంబాలలో పితృస్వామ్య వ్యవస్థ కొనసాగేది. కానీ యుద్ధాలలో పురుషులు పాల్గొన్నారు చాలామంది మహిళలు వితంతువులయ్యారు. యుక్త వయసులోనే వితంతువులుగా మారడంతో వారికి మళ్లీ పెళ్లి చేసేందుకు ప్రయత్నించేవారు. వారిలో కొంతమందికి పెళ్లిళ్లు చేసేవారు. అలా రెండవ సంబంధం ద్వారా పుట్టిన పిల్లలకు స్థానికులు అక్రమసంతానం అనే ముద్ర వేసేవారు. అయితే ఈ వివక్షను తట్టుకోలేక అక్కడి తల్లులు తమ పిల్లలకు తమ ఇంటి పేరు పెట్టాలని నిర్ణయించుకున్నారు. అది క్రమేపి ఒక సంప్రదాయం లాగా మారిపోయింది. అదే కాదు సమాజంలో మహిళలకు ఒక గౌరవాన్ని, రక్షణను అది కల్పించడం ప్రారంభమైంది. వీరి తెగ ప్రకారం చిన్న కుమార్తెను వారసురాలిగా భావిస్తుంటారు. సంపదని మొత్తం ఆమెకే ఇస్తుంటారు.. అంతేకాదు వివాహాల సమయంలో వధువు ఇంటికి వరుడు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ ఆమెతో సంసారం చేయాల్సి ఉంటుంది. పుట్టిన పిల్లలకు వధువు తరఫున ఇంటి పేరే పెట్టాల్సి ఉంటుంది.
Also Read: శాకాహారులుగా ఉండాల్సిన ఈ ఉడతలు మాంసాహారులుగా మారిపోయాయి.. తలలు పట్టుకుంటున్న శాస్త్రవేత్తలు
మేఘాలయలో విపరీతంగా వర్షాలు కురిసే ప్రాంతాలలో ఖాసీ తెగ ప్రజలు జీవిస్తున్నారు. విపరీతంగా వర్షాలు కురవడం వల్ల ఈ ప్రాంతంలో పంటలు మెండుగా పండుతుంటాయి. పైగా దట్టమైన కొండలు కావడంతో పండ్లు, ఇతర కాయగూరలను ఇక్కడ రైతులు సాగు చేస్తుంటారు. రైతుల్లో కూడా ఎక్కువగా మహిళలే ఉంటారు. వీరిలో సహజంగానే స్వతంత్ర భావజాలం అధికంగా ఉంటుంది. వివిధ వ్యాపారాలు చేయడంలో ఇక్కడి మహిళలు ఆరి తేరి ఉంటారు. కుటుంబ ఆర్థిక వ్యవహారాలను ఇక్కడి మహిళలే పర్యవేక్షిస్తుంటారు. అందువల్లే ఇక్కడ మహిళలను ఆర్థిక సమృద్ధికి ప్రత్యేకంగా భావిస్తుంటారు.
[