Owning a Farmhouse: జీవితాంతం కష్టపడి చివరి రోజుల్లో హాయిగా గడపాలని చాలామందికి ఉంటుంది. అందుకే నగరాల్లో, పట్టణాల్లో జీవితాంతం పనిచేసిన వారు చివరికి పల్లెటూర్లో.. లేదా ఫామ్ హౌస్ లో గడపాలని అనుకుంటూ ఉంటారు. ఇందులో భాగంగా ఇటీవల చాలామంది ఫామ్ హౌస్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. చాలామంది డబ్బున్నవారే ఫామ్ హౌస్ కొనుగోలు చేస్తుంటారు. అయితే వీరు ఇక్కడ హాయిగా గడపడానికి అని కొందరు అనుకుంటే.. మరికొందరు మాత్రం స్నేహితులతో సరదాగా ఉండేందుకు దీనిని కొనుగోలు చేస్తారని భావిస్తారు. కానీ ఫామ్హౌస్ కొ నడం వెనక వేరే అర్థం ఉంది. దీనిని కొనుగోలు నుగోలు చేయడం వల్ల ఎంతో డబ్బును సేవ్ చేసుకోగలుగుతారు.. అదెలా అంటే?
Also Read: ఫోటో కొట్టు.. డబ్బులు పట్టు..
వయసు పైబడిన కొంతమంది ఫామ్ హౌస్ లోనే ఎక్కువగా గడిపేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే వీరు ఇక్కడ జీవించడం ద్వారా ఎంతో విలాసంగా ఉంటారు. మనసు ప్రశాంతంగా ఉండడంతో పాటు.. ఎలాంటి బాధలు లేకుండా జీవించగలుగుతారు. కుటుంబ సభ్యులు సైతం వీకెండ్ లేదా సెలవుల్లో ఇక్కడికి వచ్చి సరదాగా గడిపేందుకు ఇలా ముందుగానే ఫామ్ హౌస్ను కొనుగోలు చేస్తారు.
అయితే ఫార్మ్ హౌస్ ఉండడంవల్ల ఎన్నో రకాల ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి. డబ్బు ఎక్కువగా ఉన్నవారు టాక్స్ రిటర్న్స్ పొందడానికి ఈ ఫార్మ్ హౌస్ ఎన్నో రకాలుగా ఉపయోగంగా ఉంటుంది. తమ వ్యాపారాల్లో వచ్చే లాభాలను.. వ్యవసాయం చేయడం ద్వారా వచ్చినట్లు చూపిస్తారు. సాధారణంగా వ్యాపారం ద్వారా వచ్చే లాభాలపై 18% జిఎస్టిని చెల్లించాల్సి ఉంటుంది. కానీ వ్యవసాయ ఉత్పత్తులపై 5% మాత్రమే జీఎస్టీ ని చెల్లిస్తారు. అందువల్ల తమకు వచ్చిన లాభాలను వ్యవసాయం ద్వారా వచ్చినట్లు బ్లాక్ మనీని వైట్ మనీగా తయారు చేస్తారు. దీంతో టాక్స్ నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఫామ్ హౌస్ను సాధారణంగా విక్రయించి వచ్చిన డబ్బును బ్యాంకులో వేస్తే క్యాపిటల్ గెయిన్ చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఈ డబ్బుతో వెంటనే వ్యవసాయం భూములను కొనుగోలు చేస్తే సెక్షన్ 54 బి హలో ఎలాంటి టాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఇలా ఫామ్ హౌస్ ను కొని విక్రయించినా ప్రయోజనాలే ఉంటాయి.
Also Read: ఫోన్ పే లో కొత్త ఆప్షన్.. ఇక అవసరం ఉన్న డబ్బులకు మాత్రమే వడ్డీ చెల్లించవచ్చు…
ఇవే కాకుండా ఫామ్ హౌస్ లో షూటింగ్స్.. ఫంక్షన్స్.. లాంటి ఇతర కార్యక్రమాలు నిర్వహించుకోవడం ద్వారా అదనపు ఆదాయం వస్తుంది. అందువల్ల ఎక్కువ శాతం ఫామ్ హౌస్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కొందరు నగరాల్లో ఉద్యోగాలు చేసేవారు సైతం వీకెండ్ లో ఇక్కడికి వెళ్లి గడిపేందుకు ఫామ్ హౌస్ ను కొనుగోలు చేస్తున్నారు. ఇలా ఏరకంగా చూసినా ఫామ్ హౌస్ ప్రయోజనాలు ఎక్కువగా ఉండడంతో డబ్బును ఎక్కువగా దీనిపై ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.
[