Site icon Desha Disha

ఛీ ఏం టేస్ట్ రా బై.. పురుగుల మందు ఈఎంఐలో దొరుకుతుందా బ్రో

ఛీ ఏం టేస్ట్ రా బై.. పురుగుల మందు ఈఎంఐలో దొరుకుతుందా బ్రో

Viral Video: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత రకరకాల వీడియోలు కనిపిస్తున్నాయి. అందులో కొన్ని వీడియోలు ఆశ్చర్యకరంగా ఉంటే.. మరికొన్ని వీడియోలు నవ్వు తెప్పిస్తున్నాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. ఇప్పటికే ఈ వీడియో లక్షలలో వీక్షణలు సొంతం చేసుకుంది. ఈ వీడియో చూసినవారు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. చాలామంది నెగిటివ్ కామెంట్స్ చేయడం తో ఈ వీడియో ఒకసారిగా చర్చనీయాంశంగా మారింది.

ఆ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాల ప్రకారం
దేవుడికి దండం పెట్టుకోవడానికి అందమైన అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయిని అనుకరిస్తూ ఓ వ్యక్తి వస్తుంటాడు. ఆ అమ్మాయి చూసేందుకు చాలా అందంగా ఉంది. పైగా ఆమె నవ్వు అంతకంటే అందంగా ఉంది. అలాంటి అమ్మాయి ఓ వ్యక్తిని ప్రేమించినట్టు తెలుస్తోంది. ఆ వ్యక్తి ఆమెకు తగ్గట్టుగా అందంగా లేడు. అలాగని సరైన జోడు కాదు.. ఆమె ఎర్రటి దొండ పండు లాగా ఉంటాయి.. అతడేమో గనిలో బొగ్గు లాగా ఉన్నాడు. పైగా ఆమె దేవుడికి దండం పెడుతుంటే అక్కడే కాపలా కాస్తున్నాడు. ఆమెను అనుసరిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ నటించిన ఓ సినిమాలో పాట పాడుతూ.. తను ఓ గబ్బర్ సింగ్ లా ఫీల్ అయిపోతున్నాడు.

ఇది చూసేందుకు రీల్ లాగా ఉన్నప్పటికీ..
చాలామంది ఈ వీడియోను జీర్ణించుకోలేకపోతున్నారు.. అంత మంచి అమ్మాయి.. ఇలాంటి వ్యక్తి లవ్ లో పడటం ఏంటని ప్రశ్నించుకుంటున్నారు. ఇక కొంతమంది అయితే.. అంత అందమైన అమ్మాయి ఇతడితో రీల్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. రీల్ చేయాలంటే సరైన వ్యక్తి ఉండాలని.. ఈ విషయాన్ని ఆ అమ్మాయి మర్చిపోయినట్టు ఉందని చెబుతున్నారు. ఇంకా కొంతమంది అయితే.” ఈ ఘోరాన్ని చూడలేకపోతున్నాం. ఈ దారుణాన్ని భరించలేకపోతున్నాం. ఈఎంఐ లో పురుగుల మందు దొరుకుతుందా బ్రో” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఎలా ఉన్నప్పటికీ ఈ వీడియోలో వారిద్దరు ప్రదర్శించిన హవా భావాలు ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా నలుపు రంగులో ఉన్న వ్యక్తి తనదైన డ్యాన్సింగ్ స్టైల్ తో ఆకట్టుకున్నాడు.

[

Exit mobile version