Kingdom Actress Bhgyasree: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే విజయ్ దేవరకొండ లాంటి నటుడు సైతం ఈ సినిమాతో రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమాకి డివైడ్ టాక్ వచ్చినప్పటికి కలెక్షన్స్ పరంగా బాగానే వస్తున్నాయి.అయిన కూడా ప్రేక్షకులను మాత్రం కొంత వరకు ఈ సినిమా ఇబ్బందికి గురి చేస్తుందని చాలామంది చెబుతున్నారు… ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఎంతసేపు యాక్షన్ ఓరియెంటెడ్ గా తెరకెక్కించే ప్రయత్నం చేశారు గాని, కామెడీ సీన్స్ ను గాని, రొమాంటిక్ సీన్స్ గాని ఏమీ లేవు. ఇందులో భాగ్యశ్రీ బోరు సే హీరోయిన్ గా నటించిన విషయం మనకు తెలిసిందే…విజయ్ దేవరకొండ కి ఆమెకి మధ్య ఒక సాంగ్ ఉందని ఆ సాంగ్ ని కూడా రిలీజ్ చేశారు. కానీ సినిమా థియేటర్లో చూస్తే సెకండ్ హాఫ్ లో రావాల్సిన ఆ సాంగ్ ను సినిమా లెంత్ ఎక్కువ అవ్వడం వల్ల తీసేసినట్టుగా మేకర్స్ సమాధానం ఇచ్చారు. ఇక భాగ్యశ్రీ బోరుసే క్యారెక్టర్ కూడా పెద్దగా ఏమీ లేదు. ఒకటి రెండు చిన్న సన్నివేశాల్లో కనిపించింది తప్ప ఆమె గ్లామర్ షో చేసిన సన్నివేశాలు కూడా ఏమీ లేవు… కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్స్ గ్లామర్ షోస్ చేస్తే బీ,సీ సెంటర్లో ఉన్న అభిమానులు ఆ సినిమాను ఎక్కువగా చూడడానికి ఆస్కారమైతే ఉంటుంది. కానీ ఈ సినిమాలో అది కూడా లేదు.
కేవలం కంటెంట్ మీద యాక్షన్ ఎపిసోడ్స్ మీద మాత్రమే దర్శకుడు భాగ్యశ్రీ బోర్ సే సన్నివేశాలను కట్ చేయడం అనేది నిజంగా చాలా దురదృష్టకరమైన విషయం అనే చెప్పాలి…ఇప్పటికే రవితేజ హీరోగా వచ్చిన ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన భాగ్యశ్రీ ఆ సినిమా ఫ్లాప్ అయినప్పటికి ఆమెకి వరసగా ఆఫర్లు అయితే వస్తున్నాయి.
ఇక తన రెండో సినిమాగా వచ్చిన కింగ్డమ్ సినిమా లో కూడా ఆమె పాత్ర పెద్దగా లేకపోవడంతో ఆమె కెరీర్ ఇప్పుడు ఎటు పోతుంది అంటూ సినిమా మేధావులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ రెండు సినిమాలు మినహాయిస్తే అఖిల్ తో చేస్తున్న లెనిన్ సినిమాలో కూడా ఆమె హీరోయిన్గా నటిస్తోంది. మరి ఈ సినిమాతో ఆమెకు మంచి సక్సెస్ దక్కుతుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
నిజానికి భాగ్యశ్రీ బోర్ సే పెద్ద బ్యానర్లలో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతూ ఉండటం వల్ల ఆ సినిమాల్లో ఆమె క్యారెక్టర్ ని తగ్గించిన కూడా ఆమె ఏమీ అభ్యంతరం చెప్పలేక పోతుంది. అలాకాకుండా కంటెంట్ బేస్డ్ సినిమాలను నమ్ముకొని ముందుకెళ్తే ఆమె కెరీర్ కూడా పది కాలాల పాటు ఇండస్ట్రీలో కొనసాగుతుందంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉండడం విశేషం…
[