కవిత ‘లిల్లీపుట్ వ్యాఖ్యలపై’ జగదీష్ రెడ్డి షాకింగ్ స్పందన

Kavitha Jagadishwar Clash: లిల్లీ పూట్ .. చావు తప్పి కన్నులు లొట్టబోయి గెలిచాడు అంటూ.. మాజీ మంత్రి, సూర్యాపేట భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి పై ఆ పార్టీ శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత చేసిన విమర్శలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సంచలనం సృష్టించాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కల్వకుంట్ల కవిత పై సూర్యాపేట ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా ఆమె పై విమర్శలు చేసినట్టు తెలుస్తోంది. కల్వకుంట్ల కవిత ఇన్నాళ్లుగా తమ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న వ్యవహారాలను నర్మ గర్భంగా వ్యాఖ్యానించారు. అయితే తొలిసారిగా లిల్లీపుట్, పిల్లాడు అంటూ వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా సంచలనం నెలకొంది. పేరు ప్రస్తావించకుండానే కవిత విమర్శలు చేసిన నేపథ్యంలో.. భారత రాష్ట్ర సమితి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి స్పందించారు.

Also Read:  ప్రియుడితో ఏకాంతంగా.. భార్య చాటుబంధాన్ని భర్త రట్టు చేశాడిలా..

నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి ఆమెకు ఉన్న జ్ఞానానికి జోహార్లు. నేను చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు గెలిచాను. కానీ కొందరు అసలు గెలవలేదు కదా. ఈమధ్య చాలాసార్లు నేను కేసీఆర్ గారిని కలిశాను. అసలు కవిత గురించి చర్చ జరగలేదు. అదే విషయాన్ని ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పాను. గత పాతిక సంవత్సరాలుగా పార్టీలో క్రమశిక్షణ ఉన్న సైనికుడిగా పనిచేస్తున్నాను. 2001 నుంచి ఇప్పటివరకు కుమ్మడి నల్గొండ జిల్లాలో గెలుపులకు, ఓటములకు నేనే బాధ్యత తీసుకున్నాను. గెలిచినప్పుడు క్రెడిట్ తీసుకోలేదు. ఓడిపోయినప్పుడు పారిపోలేదు. కెసిఆర్ ను, భారత రాష్ట్ర సమితిని బదనాం చేసే విధంగా కవిత మాటలు ఉన్నాయి. రేవంత్, రాధాకృష్ణ మాట్లాడినట్టుగానే ఆ వ్యాఖ్యలు ఉన్నాయని” జగదీశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.

Also Read: నటనకు శాశ్వతంగా గుడ్ బై చెప్పనున్న సమంత..? కారణం ఏమిటంటే!

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జగదీశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీలో జరుగుతున్న అంతర్గత వ్యవహారాలు.. కవిత వ్యవహార శైలిపై అడిగిన ప్రశ్నకు జగదీశ్వర్ రెడ్డి చాలా సులువుగా సమాధానం చెప్పారు. పార్టీలో అసలు కల్వకుంట్ల కవితపై చర్చ జరగలేదని.. అదంతా సింపుల్ వ్యవహారమని జగదీశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. జగదీశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కవిత చాలా సీరియస్గా తీసుకున్నారు. అందువల్లే ఆమె విలేకరుల సమావేశంలో ఫైర్ బ్రాండ్ లాగా మాట్లాడారు. జగదీశ్వర్ రెడ్డి పేరు పెట్టకుండానే.. అతని విషయం గురించి ప్రస్తావించకుండానే.. లిల్లీ పూట్ అని సంబోధించారు. ఇటీవల ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ జగదీశ్వర్ రెడ్డిని మరుగుజ్జునాయకుడు అని పేర్కొన్నారు. అది అర్థం వచ్చే విధంగా కవిత కూడా విమర్శలు చేయడంతో సూర్యాపేట ఎమ్మెల్యే.. రాధాకృష్ణ పేరును, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ పేరును ప్రస్తావించారు. కవిత విమర్శలు చేయడం.. జగదీశ్వర్ రెడ్డి ప్రతి విమర్శలు చేయడంతో ప్రస్తుతానికి రాజకీయ వాతావరణం వేడెక్కింది. అయితే ఇది ఎక్కడదాకా వెళ్తుంది.. గులాబీ బాస్ మధ్యలో ఎంట్రీ ఇస్తారా.. స్థానిక ఎన్నికలు, వాటికంటే ముందు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. జరుగుతాయని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో.. ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

[

Leave a Comment