India vs England: మన డిఎస్పి సాబ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత ఒత్తిడిలో ఉన్నా సరే బీభత్సంగా బౌలింగ్ చేస్తాడు. ఓవర్లకు ఓవర్లు బౌలింగ్ వేసి.. అలసట అనేది తన శరీరానికి లేదని నిరూపిస్తాడు. పైగా అగ్రెసివ్ క్రికెట్ ఆడటంలో సిరాజ్ తర్వాతే ఎవరైనా. ఎంత పదునుగా బంతులు వేస్తాడో.. అంతేపదులుగా ప్రత్యర్థి ఆటగాళ్లపై మాటల తూటాలు వదులుతాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ లేని లోటును అతడు తీర్చుతున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లాండ్ సిరీస్లో సిరాజ్ ఏకంగా 19 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అటువంటి బౌలర్ లండన్ ఓవల్ మైదానంలో జరుగుతున్న ఐదవ టెస్టులో.. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో చేసిన ఒక తప్పు తీవ్ర విమర్శలకు కారణమవుతోంది.
Also Read: శాకాహారులుగా ఉండాల్సిన ఈ ఉడతలు మాంసాహారులుగా మారిపోయాయి.. తలలు పట్టుకుంటున్న శాస్త్రవేత్తలు
ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్ సమయంలో 35 ఓవర్ ప్రసిద్ధి కృష్ణ వేశాడు. స్ట్రైకర్ గా బ్రూక్ ఉన్నాడు.. ప్రసిద్ధి కృష్ణ వేసిన బంతిని అతడు షాట్ ఆడాడు. అది కాస్త గాలిలో లేచింది. ఆ బంతిని అత్యంత సౌకర్యవంతంగా అందుకున్నప్పటికీ.. సిరాజ్ బంతిని పట్టుకున్న ఉత్సాహంలో.. తన బరువును బ్యాలెన్స్ చేసుకోలేకపోయాడు. దీంతో వెనకాలే ఉన్న బౌండరీ రోప్ తొక్కాడు. ఫలితంగా బ్రూక్ బతికిపోయాడు. సిరాజ్ చేసిన తప్పు వల్ల ఇంగ్లాండ్ జట్టుకు అదనంగా ఆరు పరుగులు వచ్చాయి.
Also Read: ప్రియుడితో ఏకాంతంగా.. భార్య చాటుబంధాన్ని భర్త రట్టు చేశాడిలా..
వాస్తవానికి ఆ బంతి నేరుగా వచ్చి సిరాజ్ చేతుల్లోనే పడింది. సిరాజ్ ఎప్పుడైతే బంతిని అందుకున్నాడో.. ప్రసిద్ధి కృష్ణ అప్పటికే విజయ సంకేతం చూపించాడు. కానీ అంతలోనే సిరాజ్ బౌండరీ రోప్ తొక్కాడు అని తెలియగానే కృష్ణ ఒక్కసారిగా డీలా పడిపోయాడు. వాస్తవానికి ఈ క్యాచ్ గనుక సిరాజ్ పట్టి ఉంటే మ్యాచ్ పరిస్థితి మరో విధంగా ఉండేది.. ఎందుకంటే అప్పటికే బ్రూక్ దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నాడు. మరో ఎండ్ లో రూట్ కూడా ఉన్నాడు. వీరిద్దరూ మోస్ట్ డేంజరస్ ప్లేయర్స్. డకెట్, క్రావ్ లీ, పోప్ వంటి వారు అవుట్ అయినప్పటికీ.. ఇంగ్లాండ్ జట్టు ఈ టెస్ట్ మ్యాచ్ పై ఆశలు పెంచుకుంది అంటే దానికి ప్రధాన కారణం బ్రూక్, రూట్ కారణం. ఎందుకంటే వీరిద్దరూ ఈ సిరీస్లో భీకరమైన ఫామ్ లో ఉన్నారు. ముఖ్యంగా బజ్ బాల్ క్రికెట్ ఆడటంలో బ్రూక్ సిద్ధహస్తుడు. ఎంతటి భారీ లక్ష్యాన్నైనా సరే అతడు సులువుగానే చేదించగలుగుతాడు. సిరాజ్ సులువైన క్యాచ్ పట్టినప్పటికీ.. బౌండరీ రోప్ తగలడం ఇంగ్లాండ్ జట్టుకు కలిసి వచ్చింది. భారత జట్టుకు దురదృష్టంగా మారింది.
[