Site icon Desha Disha

Tirumala Darshan Guide: ఆన్లైన్లో తిరుపతి దర్శనం టికెట్లు దొరకలేదా..? ఏం పర్వాలేదు.. ఇలా కూడా వెళ్లొచ్చు..

Tirumala Darshan Guide: ఆన్లైన్లో తిరుపతి దర్శనం టికెట్లు దొరకలేదా..? ఏం పర్వాలేదు.. ఇలా కూడా వెళ్లొచ్చు..

Tirumala Darshan Guide: కలియుగ దైవముగా భావించే శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని చాలామంది అనుకుంటారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో తిరుమల కొండపై ఉన్న శ్రీవారి దర్శనానికి తరలివస్తూ ఉంటారు. శ్రీనివాసుడి దర్శనం ఒక్కసారైనా చేసుకోవాలని దేశంలోని వారు మాత్రమే కాకుండా విదేశాల్లోని వారు సైతం పరితపిస్తూ ఉంటారు. ఇందుకోసం కొన్ని నెలల ముందే ప్లాన్ చేసుకుంటారు. కేవలం శ్రీవారి దర్శనం కోసం విదేశాల నుంచే వచ్చేవారు ఎందరో ఉన్నారు. దీంతో ప్రతిరోజు ఆలయానికి లక్షల మంది దర్శనానికి వస్తూ ఉంటారు. ఒక్కోసారి శ్రీవారి దర్శనం కావాలంటే రెండు నుంచి మూడు రోజులైనా సమయం పడుతుంది. అయితే ఎంతమంది భక్తులు వచ్చినా.. వారందరికీ స్వామి వారి దర్శనం అయ్యేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అనేక రకాలుగా సౌకర్యాలను, సదుపాయాలను కల్పిస్తూ ఉంటుంది. చాలామందికి సెల్లార్ దర్శనం, రూ.300 దర్శనం గురించే తెలుసు. కానీ ఇవే కాకుండా స్వామివారి దర్శనానికి అనేక మార్గాలు ఉన్నాయి. అవేంటంటే?

Also Read: భారత్‌ వ్యూహాత్మక దౌత్యం.. యూకే ట్రేడ్‌ డీల్‌.. అమెరికాకు షాక్‌!

హోమం:
స్వామివారి దర్శనం తొందరగా చేసుకోవాలని అనుకునేవారు.. కాస్త ఖర్చు పెట్టాలని భావించేవారు.. హోమం చేసి దర్శనం చేసుకోవచ్చు. తిరుపతిలోని అలిపిరి దగ్గర సప్త గో ప్రదక్షిణ అనే మందిరం ఉంటుంది. ఇక్కడ శ్రీనివాసుడికి దివ్య అనుగ్రహ హోమం నిర్వహిస్తూ ఉంటారు. ఈ హోమంలో పాల్గొనేందుకు దంపతులు రూ.1600 చెల్లించాలి. ఇలా చెల్లించిన తర్వాత మీరు హోమంలో పాల్గొంటారు. ఆ తర్వాత ఇద్దరికీ రూ.300 టికెట్ మంజూరు చేస్తారు. దీంతో వేరు అదే రోజు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు.

రక్తదానం:
చాలా సమయాల్లో స్వచ్ఛంద సంస్థలకు రక్తదానం ఇస్తూ ఉంటారు. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే అశ్విని ఆసుపత్రిలో రక్తదానం చేసిన వారికి కూడా టికెట్లు మంజూరు చేస్తారు. ఇక్కడ రక్తదానం చేసిన వారికి సుపతం అనే మార్గంలో దర్శనం చేసుకోవచ్చు. అయితే ప్రతిరోజు ఐదుగురికి మాత్రమే ఈ మార్గంలో దర్శనం ఉంటుంది. ఒకవేళ దర్శనం చేసిన ఆరోజు కాకపోయినా మరో రోజు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో ప్రీ ప్లాన్ చేసుకొని ఉండాలి.

వధూవరులు:
తిరుపతిలో పెళ్లి చేసుకున్న జంటతో పాటు వారి కుటుంబ సభ్యులకు కళ్యాణ టికెట్లను మంజూరు చేస్తారు. అయితే వారి వివాహ ధ్రువీకరణ పత్రంతో పాటు ఫోటోలను చూపించాలి. తిరుపతిలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ కొత్తగా పెళ్లయిన వారు దంపతులకు ప్రత్యేక మార్గం ద్వారా దర్శనం చేయిస్తారు. మీరు కూడా వివాహ ధ్రువీకరణ పత్రంతోపాటు ఫోటోలను చూపించాల్సి ఉంటుంది.

విరాళం:
తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రతిరోజు ఎంతోమంది విరాళం చేస్తూ ఉంటారు. అయితే ఆలయ నిర్మాణ ట్రస్టుకు రూ. 10000 విరాళం ఇచ్చినవారు టికెట్లను పొందవచ్చు. అయితే వీరికి ఇచ్చే టికెట్ రూ. 500 ఉంటుంది. ఈ టికెట్ను ఆన్లైన్లో పొందవచ్చు. అలాగే విమానాశ్రయంలో, శ్రీవాణి టిక్కెట్ల జారీ కేంద్రంలో పొందవచ్చు.

Also Read:అడవిలోకి వెళ్లి దారి తప్పిన ముగ్గురు అమ్మాయిలు.. నలుగురు అబ్బాయిలు.. ఆ తరువాత..

యువతకు:
గోవింద నామం రాయాలని చాలామందికి ఉత్సాహం ఉంటుంది. అయితే యువత ఈ పని చేపడితే వారికి శ్రీవారికి టికెట్లను జారీ చేస్తారు. కోటి గోవింద నామాలు రాశి టీటీడీకి సమర్పిస్తే వీఐపీ దర్శనం చేసుకోవచ్చు. అయితే 25 సంవత్సరాల లోపు వారికి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది.

ఇవే కాకుండా కళ్యాణ టికెట్లు ఉంటాయి. వీటికి ప్రత్యేకంగా చార్జ్ చేస్తారు. కళ్యాణ టికెట్లు కొనుగోలు చేసిన దంపతులకు నేరుగా శ్రీవారి దగ్గరికి వెళ్లే అవకాశం ఉంటుంది. విదేశీయులకు కూడా ప్రత్యేకంగా టికెట్లను జారీ చేస్తారు. మీరు తమ పాస్పోర్టును చూపించి రూ. 300 టికెట్ను పొందవచ్చు. అలాగే విదేశాల్లో ఉన్న తెలుగు వారికి విఐపి బ్రేక్ దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే వీరు ఏపీ ఎన్ ఆర్ టి సి ఎస్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలి. మీరే కాకుండా వృద్ధులకు, చిన్న పిల్లలకు ప్రత్యేక దర్శనం ఉంటుంది. ఇలా మనం అనుకున్న సమయానికి ఆన్లైన్లో టికెట్లు దొరకకపోతే వివిధ మార్గాల ద్వారా శ్రీవారిని దర్శనం చేసుకోవచ్చును. అయితే ఏదీ సాధ్యం కానప్పుడు కాస్త టైం ఉంటే సెల్లార్ దర్శనంలో కూడా అవకాశం ఉంటుంది. అంతేకాకుండా రూ.300 టికెట్లను కూడా ప్రతిరోజు ఇస్తారు. అయితే వీటికి ముందే స్లాట్ బుక్ చేసుకొని ఉండాలి.

Exit mobile version