Mallu Ravi Vs Jupally Krishna Rao: కాంగ్రెసోళ్లు… అంతే బై! మల్లు రవి vs జూపల్లి వివాదం హైలైట్

Mallu Ravi Vs Jupally Krishna Rao

Mallu Ravi Vs Jupally Krishna Rao: కాంగ్రెస్ లో ఉన్నంత స్వాతంత్య్రం మరే పార్టీలో ఉండదు.. వాళ్లు తిట్టుకోవచ్చు.. కొట్టుకోవచ్చు. అధిష్టానంపై బండ బూతులు తిట్టొచ్చు. మళ్లీ సోదాహరణంగా నవ్వుతూ మాట్లాడుకోవచ్చు. అదో సముద్రం అంతే.. తిట్టుకుంటారు.. కొట్టుకుంటారు. కలిసి ఉంటారు. తాజాగా మంత్రి జూపల్లి కృష్ణారావుపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి పబ్లిక్ గా ఆగ్రహం వ్యక్తం చేయడం వైరల్ అవుతోంది.

Also Read: ఉన్నట్టుండి రోహిత్ లండన్ ఎందుకు వెళ్లినట్టు.. టీమిండియాలో ఏం జరుగుతోంది?

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత విభేదాలు వెలుగులోకి వచ్చాయి. కొల్లాపూర్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి చేసిన వ్యాఖ్యలు, ఆ పార్టీ మంత్రి జూపల్లి కృష్ణారావుపై ఆయన చేసిన విమర్శలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి.

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బహిరంగ సభలో మల్లు రవి ప్రసంగిస్తున్న సమయంలో “స్పీచ్ తొందరగా ముగించండి” అనే సందేశం ఒక నాయకుడు తెచ్చి ఇవ్వడంతో మల్లు రవి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ఆయన,

“నేను ఇక్కడకి జూపల్లి కృష్ణారావు పెట్టే చికెన్ కూర, చేపల ఫ్రై తినడానికి రాలేదు. నేను ఢిల్లీలో జరిగే కార్యక్రమానికి వెళ్లకుండా ప్రజల కోసం, మంచి చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. మీరు నన్ను ఆపమంటారా?” అంటూ గట్టిగా చెప్పారు. “సొల్లు చెప్పడానికి రాలేదు… ప్రజల కోసం మాట్లాడడానికి వచ్చాను” అని ఆయన వ్యాఖ్యానించారు.

వివాదానికి నేపథ్యం

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలోకి దిగిన జూపల్లి కృష్ణారావు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. అయితే, పార్టీకి నిబద్ధులైన సీనియర్ నేతలు, పార్టీలో కొత్తగా వచ్చిన వారికి అవకాశం కూడా లభించకపోతుండటంతో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ సంఘటనను చూసి చాలామంది రాజకీయ విశ్లేషకులు “ఇది కాంగ్రెస్ ప్రత్యేకతే” అని అంటున్నారు.

ఈ ఘట్టం వల్ల పార్టీ లోపలున్న అసంతృప్తి బహిరంగం అయిందనే చెప్పాలి. మల్లు రవి స్థాయి నాయకుడు ఇలా బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేయడం గమనించదగిన విషయం. తదుపరి ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీలో అనేక విభేదాలు బయటపడే అవకాశముంది.

మల్లు రవి వ్యాఖ్యలు పార్టీ శ్రేణుల్లో కలకలం రేపుతున్నా, ఇది కాంగ్రెస్ శైలీ రాజకీయాల్లో అటు చూసే ప్రసంగం. తిట్టుకుంటూ, నొచ్చుకుంటూ, అయినా కలిసే ముందుకు సాగే పార్టీగా కాంగ్రెస్ నిరూపించుకుంటుందా? లేక ఇలాంటి సంఘటనలే చీలికలకు దారితీస్తాయా? అన్నది వేచిచూడాల్సిందే.

Leave a Comment