Site icon Desha Disha

love revenge story Dacoit

love revenge story Dacoit

– Advertisement –

అడివి శేష్ హీరోగా ప్రేమ, -ప్రతీకార కథనం నేపథ్యంలో రూపొందుతున్న ‘డకాయిట్’ (Dacoit) చిత్రానికి నూతన దర్శకుడు షానియల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు. గురువారం మేకర్స్ మృణాల్ ఠాకూర్ బర్త్‌డే సందర్భంగా ఆమెను పవర్‌ఫుల్ అవతార్‌లో చూపిస్తూ ఓ ఇంటెన్స్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. పోస్టర్‌లో మృణాల్ చేతిలో గన్ పట్టుకొని ముఖంపై చిన్న చిన్న గాయాలు, కన్నీళ్లతో కనిపిస్తోంది. మృణాల్ పోషించిన జూలియట్ (Juliet played Mrunal) పాత్ర తెలుగులో ఇప్పటివరకు చూసిన హీరోయిన్ల కంటే వేరే లెవెల్లో ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమాకి సంబంధించి ప్రధాన నటీనటులతో కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో వస్తున్న ఈ భారీ చిత్రాన్ని సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తుండగా, సునీల్ నారంగ్ సహ నిర్మాత. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. డకాయిట్ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

– Advertisement –

Exit mobile version