పెళ్లైంది.. కుమారుడు కూడా ఉన్నాడు.. ఇంతలో.. అతని కన్ను మరో యువతిపై పడింది.. ఒకరినొకరు ఇద్దరూ మనసుపడ్డారు.. దీంతో కట్టుకున్న భార్య ఉండగానే.. ప్రియురాలితో గుట్టుగా సంసారం నడిపిస్తున్నాడు.. కట్ చేస్తే ఇద్దరూ ఇంట్లో ఉండగా.. భార్య సడెన్ ఎంట్రీ ఇచ్చింది.. ఇంకేముంది.. సీన్ సితారైంది.. భార్యకు తెలియకుండా మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిని.. అతని భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. భర్తతోపాటు.. అతని ప్రియురాలిని ఇంట్లో బంధించి కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో భార్య దేహశుద్ధి చేసింది.. అనంతరం ఇద్దరినీ వివాహిత, ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని గంధంగూడలో సంచలనం సృష్టిచింది.
వివరాల ప్రకారం..
వేణు కుమార్, శిరీషలకు 13 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి 7 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. వేణు కుమార్ ఓ ఎలక్ట్రానిక్స్ సంస్థలో తెలంగాణ హెడ్ గా పనిచేస్తున్నాడు. రెండేళ్ల క్రితం వేణు కుమార్ ప్రవర్తనలో మార్పు వచ్చింది. భార్య శిరీషతో తరచూ గొడవ పడుతున్నాడు.. దీనిపై అనుమానం వచ్చిన శిరీష, వేణు కుమార్ కదలికలపై నిఘా పెట్టింది. ఈ క్రమంలోనే వేణు కుమార్, బెక్కం మౌనిక అనే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, ఆమెతో కలిసి ఒక గదిలో ఉంటున్నాడని శిరీష తెలుసుకుంది.
శనివారం తన కుటుంబ సభ్యులతో కలిసి అక్కడికి వెళ్లింది. ఫ్లాట్ కి వెళ్లి చూడగా.. వేణు కుమార్, మౌనిక ఇద్దరూ ఇంట్లో ఉన్నారు.. దీంతో ఆగ్రహం వ్యక్తంచేసిన శిరీష.. వేణు కుమార్, మౌనికలను దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించింది. ప్రస్తుతం వేణు కుమార్, మౌనిక నార్సింగి పోలీసుల అదుపులో ఉన్నారు.. తన భర్త తనకు కావాలని.. ఆమె దగ్గరకు వెళ్లకుండా చూడాలని శిరీష పోలీసులను కోరింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..