Site icon Desha Disha

Devineni Uma Audio Leaked: ఆ ఎమ్మెల్యే ఏడాది సంపాదన రూ.100 కోట్లు.. మాజీమంత్రి ఆడియో లీక్

Devineni Uma Audio Leaked: ఆ ఎమ్మెల్యే ఏడాది సంపాదన రూ.100 కోట్లు.. మాజీమంత్రి ఆడియో లీక్

Devineni Uma Audio Leaked: ఏపీలో( Andhra Pradesh) రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రతిరోజు ఏదో ఒక వార్త హైలెట్ అవుతోంది. తాజాగా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఫోన్ ఆడియో కాల్ లీక్ కలకలం సృష్టించింది. జనసేన నేతతో ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఇద్దరి ఫోన్ సంభాషణ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఎమ్మెల్యేల అవినీతి పై వారు మాట్లాడుకోవడం సంచలనం గా మారింది. చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ప్రస్తావన కూడా వారి మధ్య వచ్చింది. విపరీతంగా వైరల్ కావడానికి అదే కారణమని తెలుస్తోంది. ముఖ్యంగా పోలవరం జనసేన ఎమ్మెల్యే అవినీతి ప్రస్తావన వారిద్దరి మధ్య వచ్చింది.

Also Read: బాలకృష్ణ సినిమాకు నేషనల్ అవార్డు..నందమూరి ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే సమయం!

* ఎమ్మెల్యే పై అవినీతి ఆరోపణలు..
పోలవరం నుంచి జనసేన ఎమ్మెల్యేగా చిర్రి బాలరాజు( chirri balaraju ) గెలిచారు. అయితే ఆయన పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ యూట్యూబ్ ఛానల్ లో ఆయన అవినీతి కథనం వచ్చింది. దానిని చూశారట మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు( Uma Maheshwar Rao ). తనకు సన్నిహితుడైన జనసేన కీలక నేత కరాటం రాంబాబు కు ఫోన్ చేసి అదే విషయంపై ఆరా తీశారు దేవినేని ఉమ.’ పోలవరం ఎమ్మెల్యే ఏడాది కాలంలోనే 100 కోట్లు రూపాయలు సంపాదించాడంట.. ఆయన గొప్పతనం యూట్యూబ్లో ఇప్పుడే కనిపించింది.. యాడాదిలో ఇంత చెడ్డ పేరు తెచ్చుకుంటే ఎట్లా? పవన్ కళ్యాణ్ ఏమి పట్టించుకోరా ‘ అంటూ దేవినేని ఉమ రాంబాబును ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

* అంతటా హాట్ టాపిక్
అయితే ఇది ఎవరు లీక్ చేశారు అన్నది తెలియడం లేదు. ఇదేమి దోపిడీ అన్నట్టు టిడిపి నేత దేవినేని ఉమ ప్రశ్నించగా.. పవన్ కళ్యాణ్ పట్టించుకోకపోవడంతో తమకు ఇబ్బందిగా ఉందని జనసేన నేత చెప్పడం.. ఏడాదిగా ఏ ఒక్కరు తనతో మాట్లాడలేదని బదులు ఇవ్వడం.. ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. అంతటితో ఆగని కరాటం రాంబాబు చంద్రబాబు తనతో మాట్లాడిన విషయాన్ని ప్రస్తావించారు. పార్టీలోకి ఆహ్వానించారని గుర్తు చేశారు. అయితే అన్ని పార్టీల ఎమ్మెల్యేల్లో ఇదే పరిస్థితి ఉందని.. మునుపటిలా లేదని దేవినేని ఉమా వ్యాఖ్యానించడం మాత్రం హాట్ టాపిక్ గా నిలుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో దేవినేని ఉమా కు టికెట్ లభించలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవి కూడా దక్కలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన తీవ్ర మనస్తాపంతో ఉన్నట్లు కూడా ప్రచారం నడుస్తోంది. అయితే ఓ యూట్యూబ్ ఛానల్ లో ఎమ్మెల్యే పై వచ్చిన అవినీతి ఆరోపణలపై మరో జనసేన నేత వద్ద ఆరా తీయడం మాత్రం చర్చనీయాంశం అవుతుంది. రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. దీనిపై దేవినేని ఉమ ఎలా స్పందిస్తారో చూడాలి.

Exit mobile version