AP GST Collection: ఏపీలో ( Andhra Pradesh) కూటమి ప్రభుత్వం మరో రికార్డ్ సృష్టించింది. రాష్ట్రంలో ఆదాయం పడిపోయిందని వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఆరోపించిన కొద్ది రోజుల్లోనే ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరగడం విశేషం. జూలై నెలకు సంబంధించి జిఎస్టి వసూళ్లలో రికార్డ్ సృష్టించింది ఏపీ ప్రభుత్వం. గతంలో ఎన్నడూ లేనంతగా జీఎస్టీ వసూలు చేసింది. స్థూలంగా, నికరంగా లెక్కించినా ఇదే అత్యధికం అని అధికారులు తెలిపారు. ఏపీ నికర జీఎస్టీ వసూళ్లు జూలై నెలలో రూ. 2,930 కోట్లు దాటగా..రూ. 3,803 కోట్లు స్థూల వసూళ్లు నమోదయ్యాయి. గత ఏడాదితో పోల్చుకుంటే 12.12% ఎక్కువ. 2017 లో జీఎస్టీ అమల్లోకి వచ్చింది. అయితే ఇప్పటివరకు ఇదే రికార్డ్ స్థాయి వసూళ్లు.
Also Read: బాలకృష్ణ సినిమాకు నేషనల్ అవార్డు..నందమూరి ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే సమయం!
* దక్షిణాది రాష్ట్రాల్లో ప్రథమ స్థానం..
జీఎస్టీ( GST) వసూళ్లలో ఏపీ దక్షిణాది రాష్ట్రాల్లో ప్రథమ స్థానంలో నిలిచింది. జాతీయస్థాయిలో మాత్రం మూడో స్థానంతో మెరుగైన పరిస్థితుల్లో ఉంది. ఎస్జీఎస్టీ వసూళ్లు కూడా 14.47% వృద్ధి సాధించాయి. గత ఏడాది జూలై కంటే 10.69% ఎక్కువ. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జిఎస్టి వసూళ్లు తగ్గాయి. ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది. ఇది విమర్శలకు గురిచేసింది. సీఎం చంద్రబాబు సమీక్షలు కూడా చేశారు. దీంతో గత రెండు నెలలుగా జీఎస్టీ వసూళ్లు పెరిగాయి. సీఎం చంద్రబాబు అనుకున్నది సాధించారు. ఇటీవల రాష్ట్ర ఆదాయంపై జగన్మోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఆదాయం సమకూర్చుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. అయితే కొద్ది రోజులకే జీఎస్టీలో ఏపీ గణనీయమైన వృద్ధి సాధించిందని తెలియడం విశేషం.
* పెరిగిన పన్నుల ఆదాయం..
2024 జూలై తో పోలిస్తే 12.12% జీఎస్టీ వసూళ్లు ఎక్కువ. మొత్తం వసూళ్లలో 14% వృద్ధి కనిపించింది. వస్తు సేవలు ఎక్కువగా కొనడం వల్ల ఇది సాధ్యమైందని అధికారులు చెబుతున్నారు. గత ఏడాది జూలై తో పోలిస్తే ఈ ఏడాది ఎస్ జిఎస్టి వసూలు రూ.1226 కోట్లు ఎక్కువగా వచ్చాయి. 14.47 శాతానికి ఇది పెరుగుదలగా కనిపిస్తోంది. అంటే పన్నుల ద్వారా రాష్ట్రానికి ఆదాయం బాగా పెరిగింది అన్నమాట. పన్నుల ఎగవేతలను నియంత్రించడం, ఐ జి ఎస్ టి సర్దుబాట్లు మెరుగుపరచడం, పెట్రోలియం ఉత్పత్తులపై రాబడి పెరగడం వల్ల ఇది సాధ్యమైందని వాణిజ్య పన్నుల శాఖ చెబుతోంది. ఇదే స్ఫూర్తితో కొనసాగితే ఏపీ ఆదాయం రికార్డు స్థాయిలో పెరిగే అవకాశం ఉంది.