Site icon Desha Disha

మెంతులను ఇలా వాడితే పొడవాటి జుట్టు మీ సొంతం..

మెంతులను ఇలా వాడితే పొడవాటి జుట్టు మీ సొంతం..

– Advertisement –

నేటి జీవనశైలి, పెరిగిన కాలుష్యం, తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల జుట్టు సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. జుట్టు రాలడం, చుండ్రు, పొడిబారడం వంటి సమస్యలు సాధారణమైపోయాయి. ఈ సమస్యల కోసం చాలామంది మార్కెట్‌లో లభించే కెమికల్ ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. అయితే, అవి తాత్కాలిక ఉపశమనం కలిగించగలిగినా, దీర్ఘకాల ఫలితాలు మాత్రం ఇవ్వడం లేదు. ఇలాంటి సమయంలో జుట్టు సమస్యలకు సహజ పదార్థాలను ఉపయోగించడం ఉత్తమం.

వంట గదిలో ఉండే మెంతి గింజలు ఆహార రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. అందిస్తుంది. ఇందులో ఉండే ప్రోటీన్, ఐరన్, నికోటినిక్ ఆమ్లం, లెసిథిన్ వంటి పోషకాలు జుట్టుకు బలాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తాయి. అయితే ఇప్పుడు జుట్టుకు ప్రయోజనం చేకూర్చడానికి మెంతిని ఎలా ఉపయోగించాలో చూద్దాం.

మెంతి గింజల పేస్ట్
2 టీస్పూన్ల మెంతిని రాత్రి నానబెట్టుకోవాలి. ఉదయాన్నే నానబెట్టిన మెంతి గింజలను పేస్ట్ లాగా తయారు చేసి తలకి అప్లై చేయాలి. 30 నిమిషాల తర్వాత తేలికపాటి షాంపూతో కడగాలి. ఇది జుట్టు బలాన్ని పెంచుతుంది.

మెంతి, పెరుగు
మెంతులను నానబెట్టి పేస్ట్ లా తయారు చేసి 2 టీస్పూన్ల పెరుగు కలిపి, తలకు అప్లై చేయాలి. దాదాపు 40 నిమిషాల తరువాత తలను కడగాలి. ఇది జుట్టు మెరిసేలా చేస్తుంది.

మెంతి నీరు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో మెంతి నీరు తాగడం వల్ల జుట్టుకు లోపలి నుండి పోషణ లభిస్తుంది.

– Advertisement –

[

Exit mobile version