Best Actor 2025:ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని సంపాదించుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. నటులు కూడా వైవిద్య భరితమైన కథాంశాలను ఎంచుకొని మంచి క్యారెక్టర్లలో నటిస్తూ జీవించే ప్రయత్నం చేస్తున్నారు… ఇక దానికి తగ్గట్టుగానే మలయాళం నటుడు అయిన పృధ్వీరాజ్ సుకుమారన్ సైతం మంచి సినిమాలను ఎంచుకొని తనకంటూ ఒక గొప్ప గుర్తింపును సంపాదించుకునే ప్రయత్నంలో ఉన్నాడు. అందులో భాగంగానే గత సంవత్సరం అయిన ది గోట్ లైఫ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ద్వారా గల్ఫ్ కంట్రీలో ఇరుక్కుపోయిన వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే పాయింట్ ను చెప్పే ప్రయత్నం చేశాడు. ఆ పాత్రలో పృధ్వీరాజ్ సుకుమారన్ జీవించేశాడనే చెప్పాలి…ఆయన నటన ముందు ఏ ఒక్క నటుడు కూడా పనికిరాడు అనేంతల నటించి మెప్పించాడు. చాలా రియాలెస్టిక్ గా నటించి ఆ పాత్రకి ప్రాణం పోశాడు. ఇక నిన్న 71వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ది గోట్ లైఫ్ సినిమా లో నటించినందుకు గాను పృధ్విరాజ్ సుకుమారన్ కి ఎలాంటి అవార్డును ప్రకటించలేదు.
Also Read: ‘చెప్పు తెగుద్ది’ అంటూ వార్నింగ్ ఇచ్చిన అనసూయ..వీడియో వైరల్!
బెస్ట్ యాక్టర్స్ గా జవాన్ సినిమాలో నటించిన షారుక్ ఖాన్ ను అలాగే 12 త్ ఫెయిల్ లో నటించిన విక్రాంత్ ను ఎంపిక చేయడం పట్ల పలువురి నుంచి విమర్శలైతే వస్తున్నాయి. పృథ్విరాజ్ సుకుమారన్ లాంటి నటుడుని వదిలిపెట్టి ఇలాంటి వారికి ఎలా అవార్డులను కట్టబెడతారు.
ఆయన పోషించిన పాత్ర ముందు వీళ్ళు చేసింది చాలా తక్కువ అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తూ ఉండడం విశేషం…ది గోట్ లైఫ్ సినిమా అనేది గల్ఫ్ కంట్రీ లో ఇరుక్కుపోయిన వాళ్ళ జీవితాన్ని అద్దం పట్టేలా తీశారు… రియల్ ఇన్సిడెంట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి దక్కే గౌరవం ఇదా అంటూ మరికొంతమంది కామెంట్స్ చేస్తుండటం విశేషం…
Also Read: కాసర్ల శ్యామ్ వల్ల తెలుగు పాటకి గౌరవం దక్కిందా..?
నేషనల్ అవార్డ్స్ అనేవి కూడా చాలా కమర్షియల్ అయిపోయాయి. వాటిని ఎవరికి ఇస్తున్నారో ఆ జ్యూరీ మెంబర్స్ కి కూడా అర్థం అవ్వడం లేదు. ఇష్టం వచ్చినట్టుగా అవార్డులను ఇచ్చేస్తున్నారు అంటూ సినిమా అభిమానులు సైతం వాళ్ల మీద కొన్ని కామెంట్లైతే చేస్తున్నారు. మరి వాళ్లు ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారు అనేది ఎవ్వరికి అర్థం కావడం లేదు…
THIS IS CALLED ACTING
he deserved a NATIONAL AWARD man #NationalFilmAwardspic.twitter.com/O2fLT2bhXK
— Karthik (@heykarthiik) August 1, 2025
[