Video: అంతా మోసం ట్రంప్ మామ.. మరీ ఇలా చేస్తావనుకోలేదు..! – Telugu News | Viral Video: Trump Accused of Cheating at Golf – Social Media Reacts

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గోల్ఫ్‌ ఆడుతూ చీటింగ్‌ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ట్రంప్ తన క్యాడీలలో ఒకరు తెలివిగా ఫెయిర్‌వేపై బంతిని ఉంచడం చూసిన తర్వాత చాలా మంది ట్రంప్ చీటింగ్‌ చేసినట్లు ఆరోపిస్తున్నారు. ట్రంప్ గోల్ఫ్ కార్ట్‌లో ఫెయిర్‌వే ఎడమ వైపునకు వెళుతున్నట్లు వీడియోలో చూడొచ్చు. ఆయన ముందు ఇసుక బంకర్, సమీపంలో ఫెస్క్యూ గడ్డి పాచెస్ ఉన్నాయి. రెండు క్యాడీలు ఆయన బండి ముందు నడుస్తున్నారు. ట్రంప్ షాట్ పడిన ప్రాంతాన్ని వారు దాటుతుండగా, క్యాడీలలో ఒకరు ఆగి క్రిందికి వంగి, ఫెయిర్‌వేపై గోల్ఫ్ బంతిని పడేసి దానిని అనుకూలమైన ప్రదేశంలో ఉంచారు.

కొన్ని సెకన్ల తర్వాత, ట్రంప్ తన గోల్ఫ్ కార్ట్ నుండి దిగి, ఒక క్లబ్ పట్టుకుని ఆ బంతి వైపు నడిచారు. అయితే అక్కడ బంతి వేసినట్లు తనకు తెలియదన్నట్లు అటు వైపు వెళ్లి.. దాన్ని కొట్టబోతున్న సమయంలో వీడియో ఎండ్‌ అవుతుంది. ఈ వీడియో వైరల్‌ కావడంతో అంతా ట్రంప్‌ మోసం చేశారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. కమాండర్-ఇన్-చీట్‌ అంటూ కూడా నెటిజన్లు ట్రంప్‌ను ట్రోల్‌ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Leave a Comment