Site icon Desha Disha

Trump Pakistan Deal: ట్రంపూ.. నికిదేం పోయేకాలంరా అయ్యా..

Trump Pakistan Deal: ట్రంపూ.. నికిదేం పోయేకాలంరా అయ్యా..

Trump Pakistan Deal: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు చేపట్టి ఆరునెలలు దాటింది. ట్రంప్‌ 2.0 పాలన అటు అమెరికన్లతోపాటు ఇటు ప్రపంచ దేశాలకు కూడా కోపం తెప్పిస్తోంది. అమెరికా ఫస్ట్‌ నినాదంతో అధికారంలోకి వచ్చిన ట్రంప్‌ తన అనాలోచిత నిర్ణయాలతో నవ్వులపాలవుతున్నారు. అమెరికా చరిత్రలోనే ఇంత తక్కువ కాలంలో ప్రజా వ్యతిరేకత ఎదుర్కొన్న నేత ట్రంపే. నిన్నటి వరకు నరేంద్రమోదీ నా స్నేహితుడు… ఇండియా మాకు మంచి మిత్రదేశం అంటూ స్నేహం చేసిన కన్నింగ్‌ ట్రంప్‌.. ఇప్పుడు తన వక్రబుద్ధిని బయటపెట్టాడు. అమెరికా ఫస్ట్‌ నినాదం కోసం ఉగ్రవాద దేశం, భారత శత్రు దేశం అయిన పాకిస్తాన్‌తో చేయి కలిపాడు. ప్రపంచ వ్యాప్తంగా కూడా యుద్ధాలకు ఉసిగొల్పి.. తానే మళ్లీ యుద్ధం ఆపినట్లు డ్రామాలు చేస్తున్నారు. ఇక తాజాగా భారత్‌తో కటీఫ్‌ చేసిన ట్రంప్‌.. 25 శాతం ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇదే సమయంలో పాకిస్తాన్‌లో చమరు నిల్వల అభివృద్ధికి ఒప్పందం కుదుర్చుకోవడం కీలక పరిణామంగా మారింది.

Also Read: రిక్టర్ స్కేల్ పై 8 తీవ్రతతో ప్రపంచాన్ని షేక్ చేసిన భూకంపాలు ఎన్ని?

యుద్ధం ఆపలేదంటే సుంఖాలు..
ప్రధాని నరేంద్రమోదీ.. లోక్‌సభలో ఆపరేషన్‌ సిందూర్‌పై చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా యుద్ధం ఆపమని ఏ దేశాధినేత కోరలేదని స్పష్టం చేశారు. పాకిస్తాన్‌ అభ్యర్థన మేరకే ఆపరేషన్‌ సిందూర్‌ ఆపినట్లు వెల్లడించారు. ఈ ప్రకటన ట్రంప్‌కు కోపం తెప్పించింది. మరుసటిరోజే 25 శాతం టారిఫ్‌లు విధిస్తున్నట్లు ప్రకటించారు. రష్యా, ఇరాన్‌ నుంచి చమురు కొనుగోళ్లపై ఆంక్షలు ప్రకటించడం ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపనుంది. ఈ నిర్ణయం భారత్‌–అమెరికా వాణిజ్య చర్చల సందర్భంగా వచ్చింది, ఇది రష్యాతో భారత్‌ సన్నిహిత సంబంధాలను ట్రంప్‌ దృష్టిలో ఉంచుకుని తీసుకున్న చర్యగా కనిపిస్తోంది. ఈ సుంకాలు భారత ఎగుమతులను, ముఖ్యంగా సాంకేతికత, ఔషధాలు, వస్త్ర రంగాలను ప్రభావితం చేయవచ్చు. నిపుణులు ఈ చర్యను అమెరికా యొక్క ‘అమెరికా ఫస్ట్‌‘ విధానంలో భాగంగా భావిస్తున్నారు. ఇది వాణిజ్య లోటును తగ్గించే లక్ష్యంతో ఉంది.

పాకిస్తాన్‌తో చమురు ఒప్పందం
పాకిస్తాన్‌తో కుదిరిన చమురు నిల్వల అభివృద్ధి ఒప్పందం అమెరికా–పాకిస్తాన్‌ సంబంధాలలో కొత్త అధ్యాయాన్ని సూచిస్తుంది. ఈ ఒప్పందం పాకిస్తాన్‌ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే అవకాశం ఉంది, అదే సమయంలో అమెరికాకు వ్యూహాత్మక ప్రయోజనాలను అందిస్తుంది. ట్రంప్‌ ఈ ఒప్పందాన్ని ‘చారిత్రాత్మకం‘గా పేర్కొనడం, పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ అసిమ్‌ మునీర్‌తో వైట్‌ హౌస్‌ సమావేశం ఈ ఒప్పందం యొక్క రాజకీయ ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాయి. అదనంగా, పాకిస్తాన్‌ క్రిప్టో కౌన్సిల్‌ ట్రంప్‌ కుటుంబంతో అనుబంధం ఉన్న సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం వాణిజ్య సంబంధాల విస్తరణను సూచిస్తుంది.

నిపుణుల ఆందోళన..
విదేశాంగ విధాన నిపుణులు ఈ చర్యలను విభిన్న కోణాల నుంచి విశ్లేషిస్తున్నారు. భారత్‌పై సుంకాలు, పాకిస్తాన్‌తో సహకారం అమెరికా విదేశాంగ విధానంలో ‘సెల్ఫ్‌ గోల్‌‘గా అభివర్ణిస్తున్నారు. భారత్‌తో ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలహీనపరిచే అవకాశం ఉందని, ఇది దీర్ఘకాలంలో అమెరికాకు నష్టం కలిగించవచ్చని ఆయన హెచ్చరిస్తున్నారు. ట్రంప్‌ యొక్క ప్రాధాన్యత వాణిజ్య లాభాలపై ఉందని, సంప్రదాయ భద్రతా సహకారం కంటే వ్యాపార ఒప్పందాలకు ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. పాకిస్తాన్‌తో ఒప్పందం ఉగ్రవాద నిరోధక చర్యలతో పాటు, చమురు, ఖనిజ వనరుల అభివృద్ధిలో అమెరికా ఆసక్తిని ప్రతిబింబిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఇజ్రాయెల్‌–ఇరాన్‌ ఉద్రిక్తతల నేపథ్యంలోనే కాక, ఖనిజ వనరులు, క్రిప్టో ఆర్థిక రంగాల్లో ట్రంప్‌ యొక్క వ్యక్తిగత ఆసక్తుల కోణంలో కూడా చూడాలని సూచిస్తున్నారు.

Also Read: ఇండియాతో కటీఫ్.. పాకిస్తాన్ తో దోస్తీ.. దెబ్బకొట్టిన ట్రంప్.. కారణం ఇదే

దక్షిణాసియా సమతుల్యతపై ప్రభావం..
ఈ చర్యలు దక్షిణాసియాలో శక్తుల సమతుల్యతను మార్చే అవకాశం ఉంది. భారత్‌–పాకిస్తాన్‌ సంబంధాలు ఇప్పటికే సున్నితంగా ఉన్న నేపథ్యంలో, పాకిస్తాన్‌తో అమెరికా సన్నిహిత సంబంధాలు భారత్‌లో ఆందోళన కలిగించవచ్చు. అయితే, ట్రంప్‌ భారత్‌–పాకిస్తాన్‌ మధ్య సంఘర్షణ నివారణలో మధ్యవర్తిగా వ్యవహరించినట్లు పేర్కొనడం గమనార్హం. ఈ వాదనను భారత్‌ ఖండించినప్పటికీ, అమెరికా రెండు దేశాలతో వాణిజ్య సంబంధాలను సమతుల్యం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.

Exit mobile version