Samantha Secret Engagement: రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్న హీరోయిన్ సమంత..సంచలనం రేపుతున్న ఫోటో!

Samantha Secret Engagement: నాగ చైతన్య(Akkineni Naga Chaitanya) తో విడిపోయిన తర్వాత సమంత ఎదురుకున్న కష్టాలేంటో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఆయన సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ గా ఉంటే, సమంత(Samantha Ruth Prabhu) తీవ్రమైన అనారోగ్య సమస్యలతో చాలా కాలం వరకు సినిమాలకు దూరమైంది. మళ్ళీ రీసెంట్ గానే రీ ఎంట్రీ ఇచ్చి ఈసారి హీరోయిన్ గా కాకుండా, నిర్మాతగా మారి శుభమ్ అనే చిత్రం తో భారీ కమర్షియల్ సక్సెస్ ని అందుకుంది. ఇది కాసేపు పక్కన పెడితే ఈమె చాలా కాలం నుండి బాలీవుడ్ దర్శక నిర్మాత రాజ్ నిడిమోరు(Raj Nidimoru) తో ప్రేమాయణం నడుపుతుంది అంటూ సోషల్ మీడియా లో ఒక ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. బహిరంగంగానే ఇప్పుడు ఆమె రాజ్ తో కలిసున్న ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో అప్లోడ్ చేస్తూ ఉంది. దాదాపుగా ఓపెన్ అయిపోయినట్టే, ఈ ఏడాదిలోనే వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ అంతా అనుకున్నారు.

Also Read: రేపు ఓజీ, కూలీ చిత్రాల మధ్య పోటీ..గెలిచేది ఎవరు?

కానీ సమంత లేటెస్ట్ ఫోటో చూసిన తర్వాత అనేక అనుమానాలు మొదలయ్యాయి. ఆమె చేతికి ఉన్న అందమైన ఉంగరాన్ని చూసి ఈమె నిశ్చితార్థం కూడా చేసేసుకుంది అంటూ సోషల్ మీడియా లో అభిమానులు కామెంట్ చేస్తున్నారు. అంతే కాకుండా కేవలం ఆమె ఉంగరాన్ని హైలైట్ చేస్తూ ఎందుకు ఫోటో తీయించుకుంది?, దీని అర్థం ఆమె అభిమానులకు పరోక్షంగా నాకు నిశ్చితార్థం జరిగిపోయింది అని చెప్పాలని అనుకుంటుందా? లేదా సహజంగానే అలాంటి స్టిల్ పెట్టి ఫోటో తీయించుకుందా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే సమంత విడాకులు తీసుకున్నందుకు ఆమెపై సోషల్ మీడియా లో ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. ఆమెనే తప్పుబడుతూ ఎన్నో వందల ఆర్టికల్స్ వెలువడేవి. ఇవన్నీ చూసి సమంత బాగా విసిగిపోయింది. అందుకే తన రెండవ పెళ్లి కానీ, నిశ్చితార్థం కానీ, మీడియా కి తెలియకుండా సైలెంట్ గా చేసుకుందామని అనుకుందని, అందులో భాగంగానే ఆమె రశస్యంగా నిశ్చితార్థం చేసుకుందేమో అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.

Samantha-Secret-Engagement
Samantha-Secret-Engagement

ఇది కేవలం రూమర్స్ మాత్రమే, ఆమెకు నిజంగానే నిశ్చితార్థం జరిగిందా లేదా అనేది సమంత క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. రాజ్ నిడిమోరు గతం లో సమంత తో ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ అనే వెబ్ సిరీస్ తీసాడు. ఇందులో సమంత విలన్ రోల్ లో కనిపించిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సిరీస్ సమయంలోనే వీళ్లిద్దరు మంచి స్నేహితులు అయ్యారు. సమంత మానసికంగా కృంగిపోయిన రోజుల్లో రాజ్ నిడిమోరు ఆమెకు మరింత దగ్గరయ్యాడు. అలా వీళ్లిద్దరి మధ్య రిలేషన్ ఏర్పడింది. ఇక సినిమాల విషయానికి వస్తే సమంత ప్రస్తుతం ‘మా ఇంటి బంగారం’ అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రం లో నటిస్తుంది. ఈ సినిమాకు ఆమెనే నిర్మాత కూడా. దీంతో పాటు నెట్ ఫ్లిక్స్ లో ఒక భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ లో కూడా ఆమె నటిస్తుంది.

Leave a Comment