Site icon Desha Disha

Revanth Reddy on Journalist : ‘జర్నలిస్టు’కు డెఫినేషన్ ఇచ్చిన సీఎం రేవంత్

Revanth Reddy on Journalist : ‘జర్నలిస్టు’కు డెఫినేషన్ ఇచ్చిన సీఎం రేవంత్

Revanth Reddy on Journalist: ఆవారాగా రోడ్ల మీద తిరుగుతూ, తిట్లు తిడుతూ, అసభ్యకరంగా మాట్లాడేవాడు జర్నలిస్ట్ అని సీఎం రేవంత్ రెడ్డి కొత్త డిఫినేషన్ ఇచ్చారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి తన వ్యాఖ్యలతో వివాదానికి తెరలేపారు. యూట్యూబ్ జర్నలిస్టులపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేస్తూ, వారిని అవమానించేలా మాట్లాడారు. “ఆవారాగా రోడ్ల మీద తిరుగుతూ, తిట్లు తిడుతూ, అసభ్యంగా మాట్లాడేవాడు ‘జర్నలిస్ట్’ అనే ముసుగుతో సోషల్ మీడియాలో అందరిపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు” అని రేవంత్ వ్యాఖ్యానించారు.

Also Read: రంగుల రాజకీయంలో ఆర్ఎస్ ప్రవీణ్ కూడా అంతేనా?

రాజకీయ వేదికపై విరుచుకుపడ్డ సీఎం

ఒక సమావేశంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి, “ఈరోజు రాజకీయ నాయకులను ఎవరైనా ఇలా మాట్లాడితే ఏంటి? అని అడుగుతున్నారు. అవతలివారు ఎలా మాట్లాడితే వారికి ఎలా సమాధానం చెప్పాలో కూడా నాకు తెలియడం లేదు” అని చెప్పారు. ఇది ప్రత్యర్థులపై మీడియాపై తాను ఎందుకు తక్కువ మాటలు వాడుతున్నానో వివరిస్తూ ఇచ్చిన వివరణగా భావించవచ్చు.

యూట్యూబ్ జర్నలిస్టులపై తీవ్ర విమర్శలు

ఈ సందర్భంగా యూట్యూబ్ జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని, “వాళ్లను చూస్తే చెంప పగలగొట్టాలని అనిపిస్తుంది” అని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ వ్యాఖ్యతో మీడియా వర్గాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. స్వేచ్ఛా ప్రస్తుతితిని దెబ్బతీసేలా ఉన్న ఈ వ్యాఖ్యలపై పలువురు జర్నలిస్టులు, హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

స్వేచ్ఛా మీడియాపై దెబ్బ?

ప్రస్తుత డిజిటల్ యుగంలో యూట్యూబ్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల వలన పలు స్వతంత్ర వాయిస్‌లు వెలుగులోకి వస్తున్నాయి. ఇటువంటి సమయంలో, ప్రభుత్వ అధినేతల నుంచి ఇటువంటి వ్యాఖ్యలు రావడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. ప్రజాస్వామ్యంలో విలువైన పాత్ర పోషించే మీడియాపై ఇటువంటి మాటలు రాజకీయ నాయకుల ప్రతిష్టను దిగజార్చుతాయి..

సమాజంలో ప్రతిస్పందన

సీఎం వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది రేవంత్‌ వ్యాఖ్యలను సమర్థిస్తున్నా, చాలా మంది మాత్రం ఆయన వ్యవహారశైలిని తప్పుపడుతున్నారు. “సీఎంగా ఉన్న వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడడమేంటో అర్థం కావడం లేదు” అని కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: పెళ్లి కాకుండానే ఆడ – మగ కలిసే ఉండవచ్చు.. ఇదేం కల్చర్ రా నాయనా!

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇటువంటి వ్యక్తిగత విమర్శలు చేయడం రాజకీయ సంస్కృతికి విరుద్ధంగా భావించవచ్చు. వాఖ్యలు ఎంత ధైర్యంగా ఉన్నా, అది బాధ్యతతో కూడినదిగా ఉండాలి అనే ఆవశ్యకత రాజకీయ నాయకులకు మరింత అవసరం. ప్రజాస్వామ్యంలో పాత్రికేయులు ఎదురుదెబ్బలు తిన్నా, వారి స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత కూడా అధికారులదే.

Exit mobile version