Site icon Desha Disha

Power Star Favorite Ram Charan Movie: రామ్ చరణ్ సినిమాల్లో పవన్ కళ్యాణ్ కి బాగా నచ్చిన సినిమా ఏంటో తెలుసా..?

Power Star Favorite Ram Charan Movie: రామ్ చరణ్ సినిమాల్లో పవన్ కళ్యాణ్ కి బాగా నచ్చిన సినిమా ఏంటో తెలుసా..?

Power Star Favorite Ram Charan Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతిని పెంచిన వాళ్లలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు… ఒకప్పుడు వరుసగా మంచి సినిమాలు చేస్తూ వచ్చిన ఆయన ఆ తర్వాత మాస్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాడు… వరుసగా ఆరు సంవత్సరాల పాటు ఆరు ఇండస్ట్రీ హిట్లను దక్కించుకున్న ఘనత కూడా తనకే దక్కుతోంది… అలాంటి చిరంజీవి కొడుకు అయిన రామ్ చరణ్ హీరోగా మారి చిరుత సినిమాతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశాడు. మొదటి సినిమాతోనే సక్సెస్ ఫుల్ హీరోగా గుర్తింపును సంపాదించుకున్న ఆయన ఆ తర్వాత చేసిన వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించడమే కాకుండా సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తున్నాడు. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా అవతరించిన ఆయన ఇకమీదట చేయబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం…ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసినప్పటికి రామ్ చరణ్ చేసిన సినిమాలు నెక్స్ట్ లెవల్లో నిలిచాయనే చెప్పాలి. ఇండస్ట్రీకి వచ్చిన రెండో సినిమాతోనే ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసిన ఘనత కూడా తనకే దక్కింది… చేసినవి తక్కువ సినిమాలే అయినప్పటికి ఆయన సినిమాల్లో వైవిధ్యభరితమైన పాత్రలైతే ఉంటాయి.

Also Read:  స్పిరిట్ మూవీకి సందీప్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..?

ఇక మెగాస్టార్ చిరంజీవి వాళ్ళ తమ్ముడు అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం స్టార్ హీరోగా వెలుగొందడమే కాకుండా చిరంజీవిని మించిన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకొని ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ కి రామ్ చరణ్ సినిమాల్లో నచ్చిన సినిమా ఏంటి అనే గతంలో ఒక ఇంటర్వ్యూలో అడగగా ఆయన రంగస్థలం సినిమా అంటే తనకి చాలా ఇష్టమని అందులో రామ్ చరణ్ యాక్టింగ్ చాలా బాగుందని చెప్పాడు.

నిజానికి రంగస్థలం సినిమాలో చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ నటించి మెప్పించిన విధానం నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో రామ్ చరణ్ నటన పరంగా కూడా చాలా గొప్ప స్థాయికి వెళ్ళిపోయాడనే చెప్పాలి… మరి ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాల్లో ఈ సినిమా చాలా ప్రత్యేకంగా నిలుస్తోంది. అలాగే చిట్టిబాబు పాత్రకూడా ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయింది…

Also Read: శ్రీకాంత్ ఓదెల ను లైట్ తీసుకున్న చిరంజీవి..?

అతని అభిమానులకు సైతం ఈ సినిమా చాలా కన్నుల పండుగగా అనిపిస్తోందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా రామ్ చరణ్ కెరియర్ లో చిరస్మరణీయంగా నిలిచిపోయే సినిమా మాత్రం ‘రంగస్థలం ‘ అనే చెప్పాలి. ఇక ప్రస్తుతం ఆయన బుచ్చిబాబు డైరెక్షన్లో ‘ పెద్ది’ అనే సినిమా చేస్తున్నాడు ఈ సినిమాతో తనను తాను మరోసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది…

Exit mobile version