Papa Movie Review: ప్రస్తుతం ఇండియన్ సినిమా మొత్తం ఒకటైపోయింది. ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో వస్తున్న ప్రతి ఒక్క సినిమాని చూసి తన అభిప్రాయాన్ని తెలియజేసే స్థాయికి ఎదిగాడు. ముఖ్యంగా థియేటర్లోనే కాకుండా ఓటిటి లో వచ్చే సినిమాలను కూడా ప్రేక్షకులు మిస్ అవ్వకుండా చూస్తూ వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు… ఇక మలయాళంలో కవిన్ హీరోగా అపర్ణ దాస్ హీరోయిన్ గా వచ్చిన ‘పాప’ సినిమా ప్రస్తుతం ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సినిమా ఎలా ఉంది సగటు ప్రేక్షకులను మెప్పించిందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
Also Read: స్పిరిట్ మూవీకి సందీప్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..?
కథ
ఈ సినిమా కథ విషయానికి వస్తే మణికంఠ (కవిన్) సింధు(అపర్ణ దాస్) ఇద్దరు కాలేజీలో మంచి ఫ్రెండ్స్ అవుతారు. ఇక వాళ్ళ ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారుతోంది. అయితే వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంటారు. కానీ పెళ్లికి ముందే అపర్ణ ప్రెగ్నెంట్ అవ్వడంతో తన కుటుంబ సభ్యులు వీళ్ళిద్దరిని దూరం పెడుతారు. దాంతో వీళ్లు ప్రత్యేకంగా ఒక రూమ్ తీసుకొని అందులో నుంచే చదువుకుంటూ జాబ్ చేసుకుంటూ ఉంటారు పెళ్లి కూడా చేసుకుంటారు. ఇక పాప పుట్టిన తర్వాత సింధు కవిన్ ను వదిలేసి వెళ్ళిపోతోంది. ఆ తర్వాత ఏం జరిగింది సింధు పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి గల కారణాలు ఏంటి అనేవి తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే సినిమాని దర్శకుడు మొదటి నుంచి చాలా ఎంగేజింగ్ గా తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. మొదట్లో కొంతవరకు కాలేజీ సన్నివేశాలు మనకు ఇంతకుముందు కొన్ని సినిమాల్లో చూసినట్టుగా అనిపించినప్పటికీ వీళ్లిద్దరి మధ్య ప్రేమ వ్యవహారానికి సంబంధించిన సన్నివేశాలను చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లాడు. నిజానికి పెళ్లికి ముందే హీరోయిన్ ప్రెగ్నెంట్ అవ్వడం అనేది తెలుగులో 2000 సంవత్సరంలో వచ్చిన ‘చిత్రం’ సినిమాలో మనం చూశాం…
‘చిత్రం’ సినిమాకి ఈ మూవీ కి మధ్య తేడా ఏంటి అంటే పిల్లోడు పుట్టిన తర్వాత హీరోయిన్ పిల్లోడిని వదిలేసి వెళ్ళిపోవడం అనేది ఒక భారీ ఎమోషన్… ఆ ఎమోషన్ ని తట్టుకొని కవీన్ తన పిల్లాడిని చూసుకుంటూ పెంచుకుంటూ ఉంటారు. అన్ని పనులు తనే చేసుకుంటూ పిల్లోడిని చదివిస్తూ జీవితాన్ని ముందుకు సాగిస్తూ ఉంటాడు. మరి ఇలాంటి క్రమంలోనే ఆయన తన పిల్లోడిని పోషించడానికి తన ఉద్యోగంలో హయ్యర్ పొజిషన్ కి వెళ్లడానికి ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాడు.
ఆ సన్నివేశాలను ఎదుర్కొంటున్న సందర్భంలో సంతోషం కలాగిన కొద్ది క్షణాల్లోనే బాధ పడటం అన్ని కలగలిపిన సన్నివేశాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ప్రతి ఒక్క ప్రేక్షకుడికి ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. ఈ సినిమాను ఎమోషనల్ గా కనెక్ట్ చేయడంలో దర్శకుడు చాలా వరకు సక్సెస్ అయ్యాడు… ఇక కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి బాగా ప్లస్ అయింది. ముఖ్యంగా తండ్రి ఒక్కడే ఉండి తల్లి ప్రేమను, తండ్రి ప్రేమను బ్యాలెన్స్ చేస్తూ పిల్లాడిని ఎలా చూసుకుంటాడు అనే సన్నివేశాలకు సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరు కంట తడి పెట్టుకుంటారు…ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో ఇది ఒక మంచి మూవీ అనే చెప్పాలి…
ఆర్టిస్టుల పెర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే కవిన్ చాలా సెటిల్డ్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. తన భార్య లేకపోయినా పిల్లాడిని చాలా హ్యాపీగా చూసుకుంటూ తన లైఫ్ లో ఎన్ని బాధలు వచ్చినా వాటిని తట్టుకొని నిలబడగలిగే కెపాసిటీ ఉన్న ఒక క్యారెక్టర్ లో తను చాలా మంచి పర్ఫామెన్స్ అయితే ఇచ్చాడు… ఇక అపర్ణ సైతం తన క్యారెక్టర్ కి తగ్గట్టుగా చాలా బాగా నటించి మెప్పించే ప్రయత్నం అయితే చేసింది…వీటివి గణేష్ కొద్దిపాటి కామెడీని పండించే ప్రయత్నం చేశాడు…
టెక్నికల్ అంశాలు
ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమాలో మ్యూజిక్ చాలా ఎమోషనల్ గా ఉంది. ప్రతి ప్రేక్షకుడిని ఆ సన్నివేశాలు కట్టిపడేసే విధంగా ఉండడం సినిమాకి ప్లస్ అయింది. విజువల సైతం బాగున్నాయి. సినిమా మూడ్ ని చెడగొట్టకుండా చాలా బాగా డిజైన్ చేసుకున్నారు… ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది. కొన్ని సీన్స్ షార్ప్ గా కట్ చేసి ఉంటే సినిమా ఇంకాస్త ఎంగేజ్ గా వచ్చి ఉండేది…
Also Read: రామ్ చరణ్ సినిమాల్లో పవన్ కళ్యాణ్ కి బాగా నచ్చిన సినిమా ఏంటో తెలుసా..?
ప్లస్ పాయింట్స్
కథ
డైరెక్షన్
ఎమోషనల్ సీన్స్
మైనస్ పాయింట్స్
కొన్ని బోరింగ్ సీన్స్
ప్రొడక్షన్ వాల్యూస్…
రేటింగ్
ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2.5/5