Site icon Desha Disha

OG vs Coolie: రేపు ఓజీ, కూలీ చిత్రాల మధ్య పోటీ..గెలిచేది ఎవరు?

OG vs Coolie: రేపు ఓజీ, కూలీ చిత్రాల మధ్య పోటీ..గెలిచేది ఎవరు?

OG vs Coolie Movie Clash: రేపు సోషల్ మీడియా లో ఆసక్తికరమైన పోటీ జరగనుంది. సౌత్ ఇండియా లో అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న రెండు క్రేజీ చిత్రాలకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ రాబోతుంది. ఒకటి సూపర్ స్టార్ రజనీకాంత్(Superstar Rajinikanth) నటించిన కూలీ(Coolie Movie) చిత్రం ట్రైలర్ కాగా, మరొకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నటించిన ‘ఓజీ'(They Call Him OG) చిత్రం లోని మొదటి సాంగ్. ఈ రెండు క్రేజీ చిత్రాలకు సంబంధించిన ఈ రెండు ప్రమోషనల్ కంటెంట్స్ రేపే విడుదల అవ్వబోతున్నాయి. రెండు కూడా సాయంత్రం సమయం లోనే విడుదలయ్యే అవకాశాలు ఎక్కువ. రెండిటి మీద అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. మరి ఈ రెండిట్లో ఎవరు ఎవరిని డామినేట్ చేస్తారు?, సోషల్ మీడియా లో ఎవరి ఆధిపత్యం రేపు కనిపించబోతుంది?, ఎవరి మేనియా ఉండబోతుంది అనేది ఇప్పుడు ఎంతో ఆసక్తికరంగా మారిన ప్రశ్న.

Also Read: రాజమౌళిని ఫాలో అవుతూ చేతులు కాల్చుకుంటున్న దర్శకులు…

నిన్న ఓజీ చిత్రం నుండి ఒక క్రేజీ ఎడిట్ పోస్టర్ ని అప్లోడ్ చేస్తూ, ఆగష్టు 2న ఫైర్ స్ట్రోమ్ పాట విడుదల అవ్వబోతుంది అని మేకర్స్ అధికారిక ప్రకటన చేసినప్పుడు సోషల్ మీడియా మొత్తం ఊగిపోయింది. నిన్న సాయంత్రం మొత్తం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఇతర హీరోల అభిమానులు కూడా ఆగష్టు 2న విడుదల అవ్వబోయే ఓజీ ఫైర్ స్ట్రోమ్ పాట గురించే మాట్లాడుకున్నారు. మరోపక్క రజనీకాంత్ కూలీ చిత్రం గురించి తమిళ ఆడియన్స్ మాత్రమే కాదు, తెలుగు ఆడియన్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దానికి తోడు ఈ చిత్రం విడుదల అవ్వడానికి రెండు వారాల సమయం కూడా లేదు, కాబట్టి రేపు ఓజీ కంటే ఎక్కువగా కూలీ మేనియా నే కనిపిస్తుందని కొందరు అంటున్నారు. సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ అభిమానులు ఎక్కువ ఉంటారు కాబట్టి, ఓజీ మేనియా నే ఎక్కువగా ఉంటుందని పవన్ అభిమానులు అంటున్నారు.

Also Read:  మహేష్ బాబు – పూరి జగన్నాథ్ మధ్య వైరానికి కారణం వాళ్లేనా..?

మరి ఈ రెండిట్లో ఏది పై చెయ్యి సాదించబోతుంది అనేది చూడాలి. ఇక కూలీ విషయానికి వస్తే ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన మూడు పాటల్లో రెండు పాటలకు యూత్ ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ పాటలే వినిపిస్తున్నాయి. అలా కేవలం పాటలతోనే తారాస్థాయి క్రేజ్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం, రేపు ట్రైలర్ విడుదల తర్వాత ఏ రేంజ్ కి వెళ్తుందో అని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఓజీ పాట విషయానికి వస్తే థమన్ స్వరపరిచిన ఈ పాటకు తమిళ హీరో శింబు తన గాత్రాన్ని అందించాడు. రేపు విడుదల చేయబోయే వీడియో సాంగ్ లో థమన్ మరియు శింబు నే కనిపిస్తారట. మధ్యలో ఓజీ చిత్రానికి సంబంధించి కొన్ని చిన్న షాట్స్ ని కూడా ఈ లిరికల్ వీడియో సాంగ్ లో పెడతారని సమాచారం.

Exit mobile version