వృషభం: ధన స్థానంలో గురు, శుక్రుల స్థితి వల్ల వీరు ఈ ఏడాదంతా ఆదాయ వృద్ది మీద దృష్టి పెట్టడం వల్ల ఉపయోగం ఉంటుంది. కొద్ది ప్రయత్నంతో వీరి ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, వడ్డీ వ్యాపారాల మీద పెట్టుబడులు పెట్టడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది. ఆర్థిక విషయాల్లో ఎవరికీ వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం చేయకపోవడం మంచిది. జీతభత్యాలు, హోదాల పెరుగుదలకు అవకాశం ఉన్న ఉద్యోగంలోకి మారడం మంచిది.
మిథునం: ఈ రాశిలో గురు, శుక్రులు కలిసి ఉండడం, ధన స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల ఈ రాశివారు ఉద్యోగంలో పదోన్నతులకు ప్రయత్నించడానికి సమయం అనుకూలంగా ఉంది. పదోన్నతులకు అవకాశం ఉన్న సంస్థలోకి మారడం చాలా మంచిది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఆదాయ వృద్ధికి అవకాశం ఉన్న మార్గాలను అనుసరించడం వల్ల లబ్ధి పొందుతారు. ఉచిత సహాయాలకు, నష్టదాయక వ్యవహారాలకు దూరంగా ఉండడం ఉత్తమం.
కన్య: ఈ రాశికి దశమ, లాభ స్థానాలకు బలం పెరిగినందువల్ల ఉద్యోగంలో పదోన్నతులకు కృషి చేయడం మంచిది. భారీ లక్ష్యాలను సైతం సమర్థవంతంగా పూర్తి చేసే అవకాశం ఉంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి కూడా సమయం బాగా అనుకూలంగా ఉంది. ఉద్యోగులు, నిరుద్యోగులు విదేశాల్లో ఉద్యోగాలకు ప్రయత్నించడం వల్ల ఉపయోగం ఉంటుంది. ఆదాయ వృద్ధికి సంబంధించి ఏ అవకాశాన్నీ జారవిడుచుకోకపోవడం మంచిది. ఆరోగ్యం మీద దృష్టి పెట్టాల్సి ఉంది.
తుల: ఈ రాశివారికి భాగ్య, దశమ స్థానాలకు బలం కలిగినందువల్ల మనసులోని కోరికలు, ఆశలను నెరవేర్చుకునే ప్రయత్నం చేయడం మంచిది. కొద్ది ప్రయత్నంతో కలలు సాకారం అవుతాయి. ముఖ్యంగా విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న కల నెరవేరుతుంది. సొంత ఇంటి కల నెరవేరే అవకాశం కూడా ఉంది. ఆస్తి వివాదం పరిష్కారం కావడానికి తండ్రి సహాయం లభిస్తుంది. పేరు ప్రతిష్ఠలు కలిగే పనులు చేస్తారు. రాజకీయాల్లో ప్రవేశించాలనుకునే వారికి సమయం అనుకూలంగా ఉంది.
ధనుస్సు: ఈ రాశివారు అదనపు ఆదాయ ప్రయత్నాల మీద దృష్టి పెట్టడం వల్ల అత్యధికంగా లభ్ధి పొందడం జరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఆశించిన లాభాలు కలుగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో సొంత ఆలోచనలు, నిర్ణయాల వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇతరుల మీద ఆధారపడకపోవడం మంచిది. కొద్ది ప్రయత్నంతో ఉన్నతస్థాయి కుటుంబంతో పెళ్లి కుదురుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు ఆశించిన విదేశీ ఆఫర్లు అందుతాయి.
మీనం: ఈ రాశివారికి కొద్ది ప్రయత్నంతో ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఆస్తిపాస్తులు సమకూర్చుకోవడం మీద, సొంత ఇంటిని అమర్చుకోవడం మీద దృష్టి పెట్టడం వల్ల ఉపయోగం ఉంటుంది. చతుర్థ స్థానంలో ఉన్న గురు, శుక్రుల వల్ల గృహ, వాహన యోగాలు పట్టడం జరుగుతుంది. ఈ దిశగా ప్రయత్నాలు చేయడం వల్ల లబ్ధి పొందుతారు. ఉద్యోగంలో పదోన్నతికి ప్రయత్నించడం మంచిది. నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో విదేశీ ఉద్యోగం లభిస్తుంది.