Kingdom Movie : కింగ్డమ్ మూవీ ఎక్కడ తేడా కొట్టిందంటే..?

Kingdom Movie Drawbacks: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటి క్రియేట్ చేసుకున్నారు. ఇక అర్జున్ రెడ్డి (Arjun Reddy) సినిమాతో విజయ్ దేవరకొండ లాంటి నటుడు సైతం తనదైన రీతిలో సత్తా చాటుకునే ప్రయత్నం చేశాడు. యూత్ ను ఆకట్టుకుంటూ ఆయన చేసిన ఈ సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రేక్షకులందరిని మెప్పించింది. ఇక ప్రస్తుతం ఆయన వరుస ప్లాపుల్లో ఉన్నాడు. దానికి తగ్గట్టుగానే రీసెంట్ గా ‘ కింగ్డమ్ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేకపోయింది అంటూ సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తూ ఉండడం విశేషం…నిజానికి విజయ్ దేవరకొండ చేసిన ఈ సినిమాలో తన పాత్రకి పెద్దగా ప్రాముఖ్యత అయితే లేకుండా పోయింది. దర్శకుడు ఈ సినిమాని హ్యాండిల్ చేసిన విధానం కూడా ప్రేక్షకుడిని సాటిస్ఫై చేయలేదనే చెప్పాలి… విజయ్ ఇంతకుముందు చేసిన పాత్రలతో పోలిస్తే ఇది చాలా డిఫరెంట్ పాత్ర అయినప్పటికి ఆయన అందులో ఏమాత్రం ఇంటెన్సిటీ చూపించలేకపోయాడు…ఇక ఫైనల్ గా ఈ సినిమాకి ఓపెనింగ్స్ అయితే భారీగా వచ్చినప్పటికి లాంగ్ రన్ లో ఈ సినిమా నిలబడలేదు అంటూ మరికొంతమంది కామెంట్స్ చేస్తూ ఉండటం విశేషం…

Also Read: రామ్ చరణ్ పెద్ది మూవీ.. 2000 మంది తో.. ఏంటీ అరాచకం..?

విజయ్ దేవరకొండ కాకుండా ఈ సినిమాలో వేరే హీరో అయితే బాగుండేదా అని ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నిజానికి ఈ సినిమాలో ఒక్క హై మూమెంట్ కూడా లేకపోవడం సినిమా ప్లాట్ గా వెళ్లడం స్లో నరేషన్ లో ఉండడం వల్లే ఈ సినిమాకి కొంతవరకు నెగెటివ్ టాక్ అయితే వచ్చింది. మరి ఏది ఏమైనా కూడా విజయ్ చేసిన ఈ ప్రయత్నం కొంతవరకు బెడిసి కొట్టిందనే చెప్పాలి…

గౌతమ్ తిన్ననూరి అనగానే మళ్ళీ రావా, జెర్సీ లాంటి ఫీల్ గుడ్ మూవీస్ గుర్తుకొస్తూ ఉంటాయి. అలాంటి దర్శకుడు మొదటిసారి మాస్ డైరెక్టర్ గా మారి కొత్తగా ట్రై చేయాలనే ప్రయత్నం చేసినప్పటికి అది బెడిసి కొట్టిందనే చెప్పాలి. మరి ఏది ఏమైన కూడా విజయ్ కి ఈ సినిమాలో ప్రాపర్ ఇంట్రడక్షన్ ని కూడా రాయలేకపోయారు.

Also Read: ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ లో మార్పులు చేశారా..?

అంటే హీరో మీద చిన్నచూపా లేదంటే అలా కావాలనే చేశారా అనేది అర్థం కాని విషయం…ఇక హీరో అన్నయ్యగా చేసిన సత్యదేవ్ పాత్రకి ఒక ప్రాపర్ ఇంట్రాడక్షన్ అయితే పడింది. ఆయనే ఈ సినిమాకి హీరోలా అనిపించాడు. మరి విజయ్ దేవరకొండ ఎందుకు తన మ్యాజిక్ ని రిపీట్ చేయలేకపోయాడు… ఇది చూస్తుంటే ఇది పూర్తిగా డైరెక్టర్ మిస్టేక్ అని తెలుస్తోంది…

Leave a Comment