Kalpika Ganesh Mental Health: కల్పిక గణేష్(Kalpika Ganesh)..ఈమె తెలుగు సినిమాల్లో ఒకప్పుడు మంచి బిజీ ఆర్టిస్ట్. పేరు చెప్తే ఎవ్వరూ గుర్తుపట్టలేరేమో కానీ, ముఖాన్ని చూస్తే మాత్రం కచ్చితంగా గుర్తు పడుతారు. అయితే ఈమధ్య కాలం లో ఆమెకు అసలు అవకాశాలే రావడం లేదు. 2023 వ సంవత్సరం నుండి ఆమె ఖాళీగానే ఉంటుంది. ఈ క్రమం లో ఆమె సోషల్ మీడియా ని ఉపయోగించుకొని బాగా ఫేమస్ అయ్యి మళ్ళీ సినిమాల్లోకి రావడమో, లేకపోతే బిగ్ బాస్ షో లోకి వెళ్లడమో చేయాలని అనుకున్నట్టుగా ఆమె రీసెంట్ గా వ్యవహరించిన తీరు చూస్తే తెలుస్తుంది. నెల రోజుల క్రితమే ఒక పబ్ లోకి వెళ్లి బిల్ చెల్లించకుండా ఈమె సృష్టించిన వీరంగం ఎలాంటిదో అందరూ చూసారు. ‘అవును..నా ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ కి ఫాలోవర్లు కావాలి, కాబట్టి నాకు కాంట్రవర్సి కావాలి, అందుకే ఇలా చేస్తున్నాను’ అంటూ మొహమాటం లేకుండా ఒప్పుకుంది.
Read Also: సగం రాజస్థాన్.. ఇంకో సగం మధ్యప్రదేశ్.. ఈ రైల్వే స్టేషన్ ప్రత్యేకం.. ఎందుకంటే
ఈమెపై ఆ పబ్ యాజమాన్యం అప్పట్లో పోలీస్ కంప్లైంట్ కూడా పెట్టారు. ఈ ఘటన తర్వాత రీసెంట్ గానే రెండు మూడు రోజుల క్రితం ఒక రిసార్ట్ కి వెళ్లి, అక్కడి యాజమాన్యం తో కూడా ఇదే తరహా లో గొడవ పెట్టుకుంది. మళ్ళీ పక్క రోజు ఆమె దానికి వివరణ ఇస్తూ సిగరెట్లు అడిగితే లేవని హోటల్ స్టాఫ్ నాతో చాలా దురుసుగా ప్రవర్తించింది , అందుకే నేను అలా తిట్టాల్సి వచ్చింది అంటూ చెప్పుకొచ్చింది. ఇవన్నీ చూసిన తర్వాత ఈ అమ్మాయి ఎదో కాస్త తేడా గానే ఉంది. కచ్చితంగా అటెన్షన్ కోసమే ఇలాంటి పనులు చేస్తుందని కొందరు, ఈమె మానసిక స్థితి బాగలేదు, పిచ్చి అనుకుంటా అని మరికొందరు సోషల్ మీడియా లో కామెంట్ చేశారు. అయితే నేడు ఆమె తండ్రి పోలీసులకు రాసిన ఒక లేఖ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
Read Also: ఉద్యోగానికి పనికిరావని కేఎఫ్ సీ గెంటేసింది.. సీన్ కట్ చేస్తే..500 బిలియన్ డాలర్లకు ఎంపైరర్ అతడు!
ఆమె తండ్రి మాట్లాడుతూ ‘నా కూతురు కి మెంటల్ డిజార్డర్ ఉంది. ఆమె కారణంగా మా కుటుంబ సభ్యులకు, జనాలకు కూడా ప్రమాదం ఉంది. ఇప్పటికే ఆమె రెండు సార్లు అఘాయిత్యం చేసుకోవడానికి ప్రయత్నం చేసింది. అప్పుడు ఆమెని మేము రిహాబిలిటేషన్ సెంటర్కు పంపించాము. రెండేళ్ల నుండి మెడికేషన్ ఆపేయడం తో ఆమె డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. దీనివల్లనే తరచూ ఆమె గొడవలు చేయడం, పబ్లిక్ లో న్యూసెన్స్ చేయడం వంటివి చేస్తుంది. ఆమె తప్పనిసరిగా మరోసారి రిహాబిలిటేషన్ సెంటర్ కి తరలించాల్సిన అవసరం ఉంది. అది మా వల్ల కావడం లేదు, దయచేసి ఆమెని రిహాబిలిటేషన్ సెంటర్ కి పంపేందుకు పోలీసులు చర్యలు తీసుకుకోవాలి’ అంటూ తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు లేఖ రాశాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.