Site icon Desha Disha

AP Political Strategy 2025: అసెంబ్లీకి జగన్.. తెర వెనుక భారీ వ్యూహం!

AP Political Strategy 2025: అసెంబ్లీకి జగన్.. తెర వెనుక భారీ వ్యూహం!

AP Political Strategy 2025: జగన్ అసెంబ్లీకి హాజరవుతారా? అసెంబ్లీ సమావేశాలకు వస్తారా? వచ్చే సమావేశాలకు ఆయన రానున్నారా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో దీనిపైనే చర్చ నడుస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది. కానీ జగన్మోహన్ రెడ్డి రెండుసార్లు మాత్రమే అసెంబ్లీకి వచ్చారు. శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఒకసారి.. బడ్జెట్ సెషన్స్ కు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు ఏపీలో రాజకీయ పరిస్థితులు మారుతున్నాయి. అందుకే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారని తెలుస్తోంది. పక్కా వ్యూహంతోనే ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన నిజంగా అసెంబ్లీ సమావేశాలకు హాజరైతే మాత్రం సంచలన అంశమే.

Also Read:  రేపే అన్నదాత సుఖీభవ.. ఈరోజు సాయంత్రం వరకు వారికి ఛాన్స్!

 అనేక రకాలుగా విమర్శలు..
జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడంపై చాలా రకాల విమర్శలు వచ్చాయి. అధికారపక్షం కూటమిగా ఉండడం.. 164 మంది ఎమ్మెల్యేలు ఉండడంతో ఎదురు దాడి ఉంటుందని భయపడి జగన్ వెనుకడుగు వేసినట్లు అనుమానాలు ఉన్నాయి. అందుకే ఆయన ప్రతిపక్ష హోదా పేరుతో అసెంబ్లీ సమావేశాలను బాయ్ కట్ చేశారని సగటు రాజకీయాలపై అవగాహన ఉన్నవారికి తెలుసు. జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కోరుతున్నాయి. అయితే 2019 నుంచి 2024 మధ్య అసెంబ్లీలో జరిగిన పరిస్థితులు గురించి జగన్మోహన్ రెడ్డికి తెలుసు. అందుకే ఆయన భయపడ్డారు.. భయపడతారు కూడా.

Also Read: విశాఖలో టిసిఎస్ కు భూ కేటాయింపు.. తట్టుకోలేకపోతున్న వైసిపి!

 తటస్థుల అభిప్రాయం అదే
అయితే జగన్ ఈ మధ్యన జనాల్లోకి వస్తున్నారు. జనం నీరాజనాలు పలుకుతున్నారు. అయితే ఆది నుంచి జగన్ విషయంలో జరిగింది అదే. అయితే కేవలం జనం మధ్య ఉంటే కాదు.. అసెంబ్లీకి వెళ్లి సమస్యలపై మాట్లాడాలని ఎక్కువ మంది కోరుతున్నారు. ముఖ్యంగా తటస్తులు ఈ విషయంలో అదే అభిప్రాయంతో ఉన్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారని తెలుస్తోంది. సమావేశాలకు హాజరైతే అధికార పార్టీ అటాచ్ చేస్తుంది. ఒకరిద్దరూ దూకుడుగా వ్యవహరిస్తారు కూడా. అయితే అలా దూకుడు ప్రదర్శించిన సమయంలో జగన్మోహన్ రెడ్డి తనపై విపరీతమైన సానుభూతి వస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ విషయంలో చంద్రబాబు చాలా వ్యూహంతో ఉంటారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాదిరిగా తమ పార్టీ ఎమ్మెల్యేలను పురమాయించే అవకాశం లేదు. అయితే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తే మాత్రం.. ఆయనను ఆత్మరక్షణలో పడేసే వ్యూహాత్మక విమర్శలు ఉంటాయే కానీ.. వ్యక్తిగత విమర్శలు ఉండవు. అది జగన్మోహన్ రెడ్డికి సైతం తెలుసు. అందుకే ఈ విషయంలో ఒకటికి రెండుసార్లు ఆయన ఆలోచన చేసే అవకాశం ఉంది.

Exit mobile version