Site icon Desha Disha

Anil Kumar Yadav Hiding: అజ్ఞాతంలోకి అనిల్ కుమార్ యాదవ్!

Anil Kumar Yadav Hiding: అజ్ఞాతంలోకి అనిల్ కుమార్ యాదవ్!

Anil Kumar Yadav Hiding: అధికారంలో ఉన్నప్పుడు ఎన్నైనా మాట్లాడవచ్చు. ఏవేవో మాట్లాడవచ్చు. ఎంతటి మాటలనైనా అనేయవచ్చు. కానీ అధికారం కోల్పోతే ఉంటుంది సామి రంగా. . అచ్చం అనిల్ కుమార్ యాదవ్ లా( Anil Kumar Yadav) ఉంటుంది. ఓ చిన్నపాటి కేసులో విచారణకు ఆయనను పిలిచారు పోలీసులు. కానీ డుమ్మా కొట్టి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు అనిల్ కుమార్ యాదవ్. తనపై పోలీసులు పెట్టిన కేసు కొట్టి వేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. అయితే అనిల్ కుమార్ యాదవ్ లో భయాన్ని చూసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముక్కున వేలేసుకుంటున్నాయి. ఏంటి మన అనిల్ యేనా? అని ఆశ్చర్యపోతున్నాయి. అనిల్ కుమార్ యాదవ్ తీరును చూసి నవ్వుకుంటున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు తొడలు కొడుతూ.. మీసం మేలేస్తూ అనిల్ కుమార్ యాదవ్ చేసిన హంగామా అంతా అంతా కాదు. ఇప్పటికీ ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.

Also Read: ‘కింగ్డమ్’ ట్రైలర్ వచ్చేసింది..ఒకపక్క యాక్షన్..మరోపక్క ఎమోషన్!

* దూషణ కేసులో ఏ 2గా
మొన్న ఆ మధ్యన నెల్లూరు జిల్లాలో ఒక వివాదం నడిచిన సంగతి తెలిసిందే. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పై ( Prashanti Reddy )మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో వ్యక్తిగత విమర్శలు చేశారు. అదే సమయంలో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి పై దాడి కూడా జరిగింది. అయితే ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించే క్రమంలో ప్రశాంతి రెడ్డి పై అనిల్ కుమార్ యాదవ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిని ఖండిస్తూ ప్రశాంతి రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను అకారణంగా దూషించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ కేసులో ఏ1 గా ప్రసన్న కుమార్ రెడ్డి, ఏ 2 గా అనిల్ కుమార్ యాదవ్ గా పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు విచారణకు హాజరుకావాలని అనిల్ కుమార్ యాదవ్ కు నోటీసులు అందించారు. కానీ ఏ 1 గా ఉన్న ప్రసన్న కుమార్ రెడ్డి హాజరయ్యారు, ఏ 2 గా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ మాత్రం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అలా వెళ్తూనే హైకోర్టులో తనపై కేసు కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేశారు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన విస్మయం వ్యక్తం అవుతుంది. చిన్నపాటి కేసుకే అనిల్ భయపడిపోతున్న తీరును వారు తప్పు పడుతున్నారు.

* అప్పట్లో వీరవిహారం
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) అధికారంలో ఉన్నప్పుడు అనిల్ కుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా రెచ్చిపోయేవారు. మీసం మేలేసేవారు.. తొడగొట్టేవారు. పవన్ కళ్యాణ్ తో పాటు లోకేష్ ను తక్కువ చేసి మాట్లాడేవారు. చంద్రబాబు వయసును చూసి కూడా గౌరవించిన దాఖలాలు లేవు. అయితే ఇప్పుడు అధికారం తారుమారు కావడంతో అసలు తత్వం బోధపడింది. ఎన్నికల ఫలితాల తర్వాత అనిల్ కుమార్ యాదవ్ రాష్ట్రంలోనే ఉండడం లేదు. పక్క రాష్ట్రాల్లో వ్యాపారాలు చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు అనవసరంగా వచ్చి చిన్నచిన్న కేసుల్లో ఇరుక్కుంటున్నారు. అసలు పెద్ద కేసులు ఆయన కోసం ఎదురుచూస్తున్నాయి. మున్ముందు చుక్కలు కనిపించే పరిస్థితులు ఉన్నాయి. కానీ చిన్నపాటి దూషణ కేసును కూడా ఆయన ఎదుర్కొనలేకపోతున్నారు. మున్ముందు పెద్ద కేసులు ఎదురైతే పరిస్థితి ఏమిటి అన్న ప్రశ్న వైసీపీ శ్రేణుల నుంచి వినిపిస్తోంది.

* మైనింగ్ కుంభకోణంలో పేరు..
అయితే ప్రశాంతి రెడ్డి పై దూషణ కేసుకు సంబంధించి అనిల్ కుమార్ యాదవ్ భయపడడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. ఈ కేసులో ఏ 1 ఉన్న ప్రసన్న కుమార్ రెడ్డి ని పోలీసులు అరెస్టు చేయలేదు. కానీ తన విషయంలో మాత్రం అరెస్టు ఉంటుందని అనిల్ కుమార్ యాదవ్ కు తెలుసు. ఎందుకంటే క్వార్జ్ కుంభకోణం కేసులో ఆయన పిఏ ఇప్పటికే అరెస్టయ్యారు. ఆయన ఇచ్చిన సమాచారంతో అనిల్ కుమార్ కు కూడా ఈ కుంభకోణంతో సంబంధాలు ఉన్నాయని ఆధారాలు సేకరించారు పోలీసులు. అందుకే హైకోర్టు కలుపుతారు అనిల్ కుమార్ యాదవ్. పేరు దూషణ కేసు అయిన.. మైనింగ్ కుంభకోణం కేసులో బయటపడేందుకే నన్న టాక్ వినిపిస్తోంది. మొత్తానికైతే అనిల్ కుమార్ యాదవ్ భయంతో అజ్ఞాతంలోకి వెళ్లడం మాత్రం హాట్ టాపిక్ అవుతోంది.

Exit mobile version