3 days holidays in Andhra and Telangana: సెలవు రోజు అంటే అందరికీ చాలా ఇష్టం. మిగతా రోజుల్లో ఎంతో శ్రమపడి సెలవు రోజు హాయిగా ఉందామని అనుకుంటారు. అందుకే ఉద్యోగులైనా.. వ్యాపారులైనా.. కొందరు సెలవు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ముఖ్యంగా విద్యార్థులు అయితే సెలవు ఎప్పుడు వస్తుందా అని చూస్తూ ఉంటారు. అయితే తెలంగాణలో స్కూల్ పాఠశాలలకు సెలవులు ఎలా ఉండాలో ప్రభుత్వం నిర్ణయిస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఆదివారంతో పాటు కొన్ని ఐచ్చిక సెలవులు కూడా రావడంతో వరుస సెలవులు వస్తూ ఉంటాయి. వరుస సెలవులు రావడంతో చాలామంది రకరకాల ప్లాన్లు వేసుకుంటారు. విహారయాత్రలకు లేదా ఏదైనా అందమైన ప్రదేశాన్ని చూడడానికి వెళ్లేందుకు ఆసక్తి చూపుతారు. అయితే ఆగస్టు రెండో వారంలో వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. ఈ సెలవుల్లో ఏదైనా ప్లాన్ వేసుకొని ట్రిప్ చేయవచ్చు. మరి ఏ ఏ రోజు సెలవులు వస్తున్నాయో ఇప్పుడు చూద్దాం..
Read Also: ఏపీలో వారికి పింఛన్లు కట్
వరుస సెలవుల కారణంగా కొందరికి ఉపయోగకరమే. ఎందుకంటే ఏదైనా ముఖ్యమైన పనిని నిర్వహించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా దూర ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంటుంది. కొందరు విహారయాత్రలకు వెళ్లడానికి కూడా ఇదే సమయాల్లో ప్లాన్ చేసుకుంటారు. వరుస సెలవులు వస్తున్నాయంటే విద్యార్థులకు కూడా సంతోషంగానే ఉంటుంది. కానీ బ్యాంకు వ్యవహారాలు జరిపేవారు మాత్రం ఈ విషయాలను గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఏదైనా అత్యవసర ఆర్థిక వ్యవహారాలను నడిపించేందుకు ఈ సెలవులను దృష్టిలో పెట్టుకొని ప్లాన్ చేసుకోవాలి. అందువల్ల వరుస సెలవులు ఎప్పుడూ ఉంటాయనే విషయాన్ని అందరూ దృష్టిలో ఉంచుకోవాలి.
ఆగస్టు నెలలో వరుసగా మూడు రోజుల పాటు సెలవులు రానున్నాయి. వీటిలో ఆగస్టు 8న వరలక్ష్మీ వ్రతం జరుపుకొనున్నారు. ఈ రోజున పాఠశాలలకు సెలవు ఇవ్వనున్నారు. వరలక్ష్మి వ్రతంలో ఎక్కువ శాతం మహిళలు పాల్గొంటారు. అందువల్ల పాఠశాలలు, కార్యాలయాల్లో పనిచేసే మహిళలకు సెలవులను ప్రకటించారు. శ్రావణమాసంలో వచ్చే మొదటి పండుగ వరలక్ష్మి వ్రతం కావడంతో చాలామంది ఈ కార్యక్రమాన్ని వైభవంగా జరుపుకోవాలని చూస్తారు. అందువల్ల ఈరోజు సెలవు ప్రకటించారు.
Read Also: వదిలేదేలే.. టీచర్లకు చుక్కలు చూపిస్తున్న రేవంత్ సర్కార్
ఆగస్టు 9వ తేదీన రాఖీ పండుగ రాబోతుంది. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రత్యేకగా నిలిచే ఈ రాఖీ పౌర్ణమి రోజు చాలామంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు. కొందరు దూర ప్రాంతాల్లో ఉన్న చెల్లెళ్లు సైతం తమ సోదరులకు రాఖీ కట్టేందుకు వస్తారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఈరోజు కూడా సెలవు ప్రకటించింది. అంతేకాకుండా ఈరోజు కొన్ని ఆలయాల్లో నూలు పౌర్ణమి వేడుకలు నిర్వహించనున్నారు.
పై రెండు రోజులు సెలవు దినాలు పండుగ సందర్భంగా ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆ తర్వాత రోజు ఆదివారం రాబోతుంది. ఆదివారం రోజు ఎలాగూ హాలిడే. ఇలా ఆగస్టు 8, 9, పదవ తేదీల్లో సెలవులు రానున్నాయి. అయితే కొందరు ఈ సెలవులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించుకోనున్నారు. ఈ మూడు రోజుల్లో విహారయాత్రలకు లేదా ప్రత్యేకమైన ప్రదేశాలకు వెళ్లేందుకు కూడా ప్లాన్ వేయనున్నారు.