విలేఖరి కుటుబానికి అప్పన్న హస్తం

– ముఖ్యమంత్రి సహాయనిధి 4 లక్షలు ఆర్ధిక సాయం 
విశాలాంధ్ర – సీతానగరం : అక్షర సేద్యం చేస్తూ ఇటీవలే అకాల మరణం చెందిన పాత్రికేయ కుటుంబాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంది. మండలంలోని రాపాక గ్రామంలో నివసిస్తూ వార్త దినపత్రిక విలేఖరిగా చేస్తూ ప్రజల పక్షాన తన కలంతో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ జీవనం సాగించిన గోలకోటి శివ ప్రసాద్ గత ఏప్రియల్ నెలలో 

అనారోగ్యం పాలై రాజమహేంద్రవరంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన సంగతి పాఠకులకు విదితమే.ఆరోగ్యశ్రీ లోకి చికిత్స రాకపోవడంతో దాదాపు పది లక్షల వరకు ఆసుపత్రికి చెల్లించిన కుటుంబ సభ్యులు అప్పులపాలైపోయారు. దీంతో స్పందించిన నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామ కృష్ణ సిఫార్సు మేరకు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి రు :4,37,925/- ఆర్థిక సాయం మంజూరు అయ్యింది.దీంతో జనసేన నా సేన కోసం నా వంతు కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి చేతులు మీదుగా  చెక్కును విలేకరి కుటుంబ సభ్యులకు శుక్రవారం అందజేశారు.

ఏపీడబ్ల్యూజే చొరవ అభినందనీయం ———————

ఆరోగ్యశ్రీ పరిధిలోకి రానీ అతి క్లిష్టమైన అనారోగ్య సమస్యతో ఆసుపత్రిలో చేరిన సీతానగరం వార్త విలేకరి గోలకోటి శివ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి దయనీయంగా మారడంతో అప్పట్లో విశాలాంధ్ర విలేకరి సతీష్ ద్వారా విషయం తెలుసుకున్న ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు, జిల్లా కన్వీనర్ మండెల శ్రీరామమూర్తి, రాష్ట్ర అధ్యక్షులు ఐవి.సుబ్బారావు స్పందించి విలేకరి కుటుంబాన్ని ఆడుకోవాలని రాష్ట్ర స్థాయిలో చొరవ చూపించడం అభినందనీయమని పలువురు విలేకర్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.దీనిలో భాగంగా పలువురు ఏపీయూడబ్ల్యూజే కి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Comment