Gautham Tinnanuri Kingdom: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయిననటుడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలన్నీ అతనికి చేదు అనుభవాలను మిగులుస్తున్నాయి. అయితే ఈరోజు రిలీజ్ అయిన కింగ్ డమ్ సినిమా అతనికి మంచి గుర్తింపును తీసుకొస్తుంది అంటూ అతను భారీ కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నాడు. అయితే ఈ సినిమాని చూసిన జనాలు ఈ మూవీ మీద పాజిటివ్ గా స్పందిస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా విజయ్ దేవరకొండ లాంటి నటుడు చేసిన ప్రతి సినిమాకు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ అయితే దక్కుతోంది. అయితే కింగ్డమ్ సినిమా విషయంలో ఆయన ఇంకాస్త జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఫస్టాఫ్ లో యాక్టింగ్ బాగా చేసినప్పటికి సెకండ్ హాఫ్ లో వచ్చిన ఎమోషన్ సీన్స్ విషయంలో ఆయన పెద్దగా ఇంట్రెస్ట్ చూపించనట్టుగా తెలుస్తోంది… ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఆయనను టాప్ లెవెల్లో నిలబెట్టాయి. మరి కింగ్డమ్ సినిమా కూడా మంచి సక్సెస్ ని సాధించిపెట్టిందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… కింగ్డమ్ సినిమా విషయంలో దర్శకుడు గౌతమ్ తిన్న నూరి చేసిన తప్పేంటి అంటే సినిమాకు సంబంధించిన పూర్తి కథను అతను ముందే లీక్ చేశాడు.
Also Read: ఆ ప్రశ్నకు సమాధానం ఏది?.. మోడీ విపక్షాలకు దొరికిపోయారా?
దానివల్ల సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకుడిలో కొంతవరకు ఆసక్తి అయితే కలిగలేదనే చెప్పాలి… సత్యదేవ్ – విజయ్ దేవరకొండ ఇద్దరు ఇందులో బ్రదర్స్ గా నటిస్తున్నారు అనే విషయాన్ని ఈ సినిమా ట్రైలర్ లోనే రివిల్ చేశాడు. దీనివల్ల సగటు ప్రేక్షకులు కొంతవరకు త్రిల్ ఫీల్ అవ్వకుండా అయింది.
అలా కాకుండా దీన్ని ఒక ట్విస్ట్ గా మార్చి ఉంటే మరింత హైప్ ఇచ్చేది… ఇలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది…ఈ ట్విస్ట్ ముందే రివీల్ చేయడం వల్ల సెకండాఫ్ మొత్తం చాలా ప్లాట్ గా వెళ్ళిపోయింది అంతే తప్ప ఎక్కడా కూడా ఒక హై ఫీల్ ఇచ్చే మూమెంట్ అయితే పడలేదు.
ఇంకా రెండు మూడు ట్విస్ట్ లను సెకండాఫ్ లో ఇచ్చి ఉంటే సినిమా రేంజ్ అనేది మారిపోయేది… మొత్తానికైతే తను చేసిన మిస్టేక్స్ వల్లే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లలేకపోయింది అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఓవరాల్ గా అటు విజయ్ కి, ఇటు గౌతమ్ కి ఈ సినిమా ఒక మంచి సక్సెస్ గా మిగులుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
Also Read: కింగ్డమ్’ మూవీ ట్విట్టర్ రివ్యూస్ వచ్చేశాయి..సినిమా ఎలా ఉందంటే!