Site icon Desha Disha

‘పవర్ స్టార్’ ట్యాగ్ కోసం విజయ్ దేవరకొండ విశ్వప్రయత్నాలు?

‘పవర్ స్టార్’ ట్యాగ్ కోసం విజయ్ దేవరకొండ విశ్వప్రయత్నాలు?

Vijay Deverakonda Power Star tag: కొన్నేళ్ల క్రితం నాని, దగ్గుబాటి రానా కలిసి ఒక ఈవెంట్ ని హోస్ట్ చేశారు. అవి విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) కొత్తగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రోజులు. ఆయన నుండి అప్పటికి ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘పెళ్లి చూపులు’ వంటి సినిమాలు మాత్రమే వచ్చాయి. అయితే ఆ ఈవెంట్ వేదిక మీద ఉన్న నాని, రానా లు కలిసి విజయ్ దేవరకొండ ని స్టేజి మీదకు పిలిచి కాసేపు అతన్ని ఆటపట్టిస్తారు. సినిమాల్లోకి వచ్చి అప్పుడే ఒక హిట్ కొట్టేసావు కదా, ఏ ట్యాగ్ తీసుకోవాలని అనుకుంటున్నావు అని అడిగితే ‘పవర్ స్టార్’ ట్యాగ్ ని తీసుకుంటా అంటూ విజయ్ దేవరకొండ సరదాగా సమాధానం చెప్తాడు. అప్పుడంటే సరదాగా చెప్పాడు, ఇప్పుడు ఆయన పవర్ స్టార్ ట్యాగ్ పై కన్నేసినట్టు సోషల్ మీడియా లో అతని టీం చేస్తున్న హంగామా చూస్తుంటే అనుమానం కలుగుతుంది.

Also Read: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం తేదీ వచ్చేసింది..!

ఎందుకంటే విజయ్ దేవరకొండ ని మాటికొస్తే పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) తో పోల్చి చూసే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కి ఎలా అయితే కెరీర్ ప్రారంభం లో కేవలం రెండు మూడు సినిమాలతోనే విపరీతమైన క్రేజ్ వచ్చిందో, విజయ్ దేవరకొండ కి కూడా అలాగే వచ్చిందని, పవన్ కళ్యాణ్ కి ఎలా అయితే హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా తిరుగులేని మార్కెట్, క్రేజ్ ఉండేదో, విజయ్ దేవరకొండ కి కూడా అలాంటి క్రేజ్, మార్కెట్ మీడియం రేంజ్ హీరోలలో ఉందని, కాబట్టి రాబోయే కాలం లో కాబోయే పవర్ స్టార్ అంటూ సోషల్ మీడియా లో ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. ఎలాగో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ‘పవర్ స్టార్'(Power Star) ట్యాగ్ ని వాడొద్దు అంటూ తన దర్శక నిర్మాతలకు చాలా బలంగా చెప్పాడు. రీసెంట్ గా విడుదలైన ‘హరి హర వీరమల్లు’ చిత్రంలో కూడా పవర్ స్టార్ ట్యాగ్ కనిపించదు.

Also Read: డైరెక్టర్ సుజిత్ కి ప్రాంక్ కాల్ చేసి హడలు కొట్టిన థమన్..వీడియో వైరల్!

ఎలాగో పవన్ కళ్యాణ్ ఆ ట్యాగ్ ని ఉపయోగించుకోవడం లేదని, మెల్లగా ఆ ట్యాగ్ ని తనకు తగిలించుకునే ప్రయత్నం విజయ్ దేవరకొండ చేస్తున్నాడా?, అలా చేస్తే పవన్ కళ్యాణ్ అభిమానులు ఊరుకుంటారా?, ఇల్లు పీకి పందిరి వేసేయరూ..?. అంత సాహసం చెయ్యరు కానీ, ఎందుకో పవన్ కళ్యాణ్ తో విజయ్ దేవరకొండకు పోలికలు ఈమధ్య కాలం లో ఎక్కువ అయిపోయాయి. నిన్న సాయంత్రం జరిగిన ‘కింగ్డమ్'(Kingdom Movie) ప్రెస్ మీట్ లో సక్సెస్ మీట్ కి పవన్ కళ్యాణ్ గారిని పిలుస్తున్నారా అని నిర్మాత నాగవంశీ ని అడిగితే, అలాంటిదేమి లేదండి, ఈయనే (విజయ్ దేవరకొండ) ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ అంటూ సమాధానం ఇచ్చాడు. దీనికి సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ అభిమానుల నుండి తీవ్రమైన వ్యతిరేకత ఎదురు అవుతుంది. రాబోయే రోజుల్లో ఇంకెన్ని చూడాలో ఏంటో.

Exit mobile version