Site icon Desha Disha

తెలుగులో ఉన్న స్టార్ డైరెక్టర్స్ కి అడ్వాన్సులు ఇచ్చిన కొత్త ప్రొడక్షన్

తెలుగులో ఉన్న స్టార్ డైరెక్టర్స్ కి అడ్వాన్సులు ఇచ్చిన కొత్త ప్రొడక్షన్

Star Directors Signed: సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు…ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది ప్రొడ్యూసర్స్ చాలా సినిమాలు చేస్తూ పాన్ ఇండియాలో వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా శాండిల్ వుడ్ లో కెవిఎన్ అనే ప్రొడక్షన్ హౌస్ భారీ సినిమాలు చేస్తూ పాన్ ఇండియాలో వాళ్ళ సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తుంది…ఇక దానికి తోడుగా ఇప్పుడు తమిళ స్టార్ హీరో అయిన విజయ్ హీరోగా వస్తున్న ‘జన నాయగన్’ సినిమాతో తమిళ్ లో ప్రొడ్యూసర్ గా ఎంట్రీ ఇస్తున్నారు…ఇక ఇప్పటి వరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా ఈ బ్యానర్ నుంచి వచ్చే ప్రతి పెద్ద సినిమా మంచి కంటెంట్ తో వచ్చి భారీ విజయాలను సాధించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్ళు చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు…ఇక ఇప్పటికే చాలా మంది డైరెక్టర్లకు అడ్వాన్సులు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది.

Also Read: ‘కూలీ’ మూవీ స్టోరీ ఇదే.. పాత కాలం కథ..వర్కౌట్ అవుతుందా?

అందులో తెలుగు స్టార్ డైరెక్టర్ అయిన బాబీ కూడా ఉన్నాడు. ఇక ఈయనతో పాటు గా మరి కొంతమంది తమిళ్, కన్నడ డైరెక్టర్లు ఉన్నారు. మరి వాళ్ళు కూడా హోంబాలే ప్రొడక్షన్ హౌస్ లా టాప్ పొజిషన్ కి వెళ్తారా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

ఇక ప్రస్తుతం పాన్ ఇండియాలో భారీ సినిమాలను తీసే ప్రొడక్షన్ హౌస్ లు చాలా తక్కువ ఉన్నాయి…వాటితో పాటు కెవిఎన్ సంస్థ కూడా ఇక భారీ నిర్మాణ సంస్థలలో ఒకటిగా నిలుస్తోందా? లేదా అనేది తెలియాల్సి ఉంది…ప్రస్తుతం వీళ్ళు ప్రభాస్ తో కూడా ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నారట…

Also Read: ‘పవర్ స్టార్’ ట్యాగ్ కోసం విజయ్ దేవరకొండ విశ్వప్రయత్నాలు?

ఇప్పటికే ప్రభాస్ ను కలిసి ఆయన డేట్స్ ను కూడా లాక్ చేసినట్టుగా తెలుస్తోంది…మరి ఇలాంటి సందర్భంలోనే ప్రభాస్ ఇప్పటికే 2 సంవత్సరాల పాటు ఆయన డేట్స్ మొత్తం లాక్ అయి ఉన్నాయి…ఆ రెండు సంవత్సరాల తర్వాత ఆయన ఈ ప్రొడక్షన్ హౌస్ కి డేట్స్ కేటాయించినట్టుగా తెలుస్తోంది…చూడాలి మరి ఈ బ్యానర్ లో టాప్ డైరెక్టర్స్ సినిమాలు చేస్తారా లేదా అనేది…

Exit mobile version