Site icon Desha Disha

కింగ్డమ్' మూవీ ట్విట్టర్ రివ్యూస్ వచ్చేశాయి..సినిమా ఎలా ఉందంటే!

కింగ్డమ్' మూవీ ట్విట్టర్ రివ్యూస్ వచ్చేశాయి..సినిమా ఎలా ఉందంటే!

Kingdom Movie Twitter Review

Kingdom Movie Twitter Review: వరుస ఫ్లాప్స్ తో తీవ్రమైన ఇబ్బంది పడుతున్న హీరోలలో ఒకరు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda). ఒకదాని తర్వాత ఒకటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ ని అందుకుంటూ కెరీర్ పరంగా ఆయన చాలా ఇబ్బంది పడ్డాడు. కానీ ‘కింగ్డమ్'(Kingdom Movie) మూవీ తో ఆయన మొదటి నుండి ఆడియన్స్ లో ఒక ప్రత్యేకమైన ఆసక్తి ని కలిగించేలా చేశాడు. టీజర్ బాగా ఆకట్టుకుంది, పాటలు కూడా బాగున్నాయి, థియేట్రికల్ ట్రైలర్ అయితే అదుర్స్. రీసెంట్ గా రిలీజ్ చేసిన ‘రగిలే..రగిలే’ పాట అయితే యూత్ ని ఒక ఊపు ఊపేసింది. ఇలా ఇన్ని రకాల పాజిటివ్ వేవ్స్ నడుమ ఈ చిత్రం విడుదలైంది. రెస్పాన్స్ ఊహించిన విధంగానే అద్భుతంగా ఉంది. ఓవర్సీస్ ఆడియన్స్ నుండి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా అందరూ సినిమా క్వాలిటీ ని తెగ మెచ్చుకుంటున్నారు. ట్విట్టర్ నుండి వచ్చిన ఓవరాల్ ఓవర్సీస్ టాక్ ఎలా ఉందో వివరంగా చూద్దాం.

ఫస్ట్ హాఫ్ ని డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి(Gowtham Tinnanuri) తనదైన మార్క్ తో చాలా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో తెరకెక్కించాడు అనే ఫీలింగ్ ని రప్పించాడు. విజయ్ దేవరకొండ నటన కూడా ఈ సినిమాలో అద్భుతంగా ఉంది. అంటే ఇన్ని రోజులు చూసిన విజయ్ దేవరకొండ వేరు, ఈ సినిమాలో కనిపించిన విజయ్ దేవరకొండ వేరు. కాస్త ఆ డైలాగ్ డెలివరీ ని మార్చుకుంటే చాలు అనిపించింది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ప్రారంభం లో 15 నిమిషాలు అదిరిపోయింది. ఆ తర్వాత హీరో విజయ్ దేవరకొండ మరియు సత్య దేవ్ తమ ఎమోషనల్ పెర్ఫార్మన్స్ తో సినిమాని క్లైమాక్స్ వరకు వేరే లెవెల్ కి తీసుకెళ్లారు. ఇక చివర్లో పార్ట్ 2 కి ఇచ్చే లీడింగ్ కూడా చాలా ఆసక్తికరంగా ఉందని ట్విట్టర్ లో ఈ చిత్రాన్ని చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్ చేశారు.

ట్విట్టర్ ఓపెన్ చేసి కింగ్డమ్ అనే హ్యాష్ ట్యాగ్ మీద క్లిక్ చేస్తే చాలు మీకు పాజిటివ్ రివ్యూస్ తప్ప , నెగిటివ్ రివ్యూస్ ఎక్కడా కనిపించవు. అలా ట్విట్టర్ లో వచ్చిన కొన్ని మంచి సెలెక్టెడ్ రివ్యూస్ ని మీ కోసం క్రింద ఒక 5 అందిస్తున్నాము చూడండి. ట్విట్టర్ లో వచ్చిన పాజిటివ్ టాక్ ప్రకారం అయితే విజయ్ దేవరకొండ చాలా గట్టిగా కొట్టేసినట్టు లెక్క. కానీ ఆ చిత్ర నిర్మాత నాగవంశీ తన ప్రతీ సినిమాకు రివ్యూస్ ని పాజిటివ్ గా వచ్చేలా మ్యానేజ్ చేస్తాడు అనే టాక్ ఉంది. మరి ఈ చిత్రానికి కూడా ఆయన అలాగే మ్యానేజ్ చేశాడా?, లేకపోతే నిజంగానే సినిమా బాగుందా అనేది తెలియాలంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో షోస్ మొదలయ్యే వరకు ఆగాల్సిందే.

 

Exit mobile version