ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు రిమాండ్ పొడిగింపు

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్‌ను పొడిగించింది.
తాజాగా,రిమాండ్‌ను ఈ నెల 13వ తేదీ వరకు పొడగించినట్లు కోర్టు ప్రకటించింది.
ఇప్పటి వరకు ఈ కుంభకోణానికి సంబంధించి మొత్తం 12మంది నిందితులను అధికారులు అరెస్టు చేశారు. నిందితులకు విధించిన రిమాండ్ గడువు నేటితో ముగియడంతో,విజయవాడ జిల్లా జైలులో ఉన్న తొమ్మిది మంది నిందితులను ప్రత్యేక విచారణ బృందం(సిట్)అధికారులు కోర్టుకు హాజరుపరిచారు.
వీరిలో ధనుంజయ రెడ్డి,కృష్ణమోహన్ రెడ్డి,రాజ్ కెసిరెడ్డి,పైలా దిలీప్,వెంకటేష్ నాయుడు,బూనేటి చాణక్య,బాలాజీ గోవిందప్ప,చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి,సజ్జల శ్రీధర్ రెడ్డి ఉన్నారు.అదే విధంగా, గుంటూరు జిల్లా జైలు నుంచి ఇద్దరిని, రాజమండ్రి జైలు నుంచి వైకాపా ఎంపీ మిథున్ రెడ్డిని కోర్టు ముందు హాజరుపరచేందుకు అధికారులు తీసుకువచ్చారు.

The post ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు రిమాండ్ పొడిగింపు appeared first on Visalaandhra.

Leave a Comment