Site icon Desha Disha

YSR Congress: వైఎస్సార్ కాంగ్రెస్ కు బిగ్ షాక్.. ఒకేసారి 16 మంది..!

YSR Congress: వైఎస్సార్ కాంగ్రెస్ కు బిగ్ షాక్.. ఒకేసారి 16 మంది..!

YSR Congress: రాజకీయాల్లో ( politics)కాలానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి. అలా తీసుకుంటేనే పదికాలాలపాటు రాజకీయం చేయగలం. లేకుంటే చాలా కష్టం. అయితే అధికారంలో ఉన్నప్పుడు చాలా బ్యాలెన్స్ గా వెళ్లాలి. లేకుంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు పట్టిన గతే పడుతుంది. అధికారం ఉన్నప్పుడు కన్ను మిన్ను కానరాకుండా.. ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంటారు. తీరా అధికారం కోల్పోయాక రాజకీయ ప్రత్యర్థులకు టార్గెట్ అవుతారు. ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతోంది అదే. అధినేత జగన్మోహన్ రెడ్డి మనమే అధికారంలోకి వస్తాం.. అందరి పని తేల్చుదాం అంటూ చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. గ్రౌండ్ రియాలిటీ షోలో తాజా మాజీలు ఉన్నారు. తాము చేసిన తప్పులు వారికి తెలుసు. అందుకే చట్టం తమ ఇంటి వరకు వస్తుందని ఎక్కువమంది భయపడుతున్నారు. సేఫ్ జోన్ లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Also Read: ఇక ‘పులివెందుల’ రాజకీయం

* వెంటాడుతున్న రెడ్ బుక్
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ నేతలకు రెడ్ బుక్ వెంటాడుతోంది. ఎంతలా అంటే అదే బుక్ పై విమర్శలు చేస్తున్న వారు సైతం భయపడే అంత. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లాంటి వారికే దిక్కులేదు. మన పరిస్థితి ఏంటన్న వారు ఉన్నారు. అనవసరంగా అప్పట్లో దూకుడుగా వ్యవహరించి ఇబ్బందులు తెచ్చుకున్నామన్నవారు ఉన్నారు. వాస్తవానికి లోకేష్ రెడ్డి బుక్ ను చాలా తేలిగ్గా తీసుకున్నారు. కానీ ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరికి సీన్ అర్థం అవుతోంది. అప్పట్లో అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ధీటుగా సమాధానం చెప్పేందుకు.. కార్యకర్తలకు భరోసా ఇచ్చేందుకు లోకేష్ రెడ్ బుక్ రాస్తున్నట్లు ప్రకటించారు. అయితే అప్పట్లో లోకేష్ సైతం బాధితులే. ఒక మాజీ ముఖ్యమంత్రి కుమారుడిగా, మాజీ మంత్రిగా పాదయాత్ర చేస్తుంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అల్లరి మూకలు ఆయననే ఇబ్బంది పెట్టాలంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అప్పుడే రెడ్ బుక్ రాసుకున్నారు లోకేష్. ఆ పుస్తకం పని ప్రారంభం కావడంతో తమ వరకు వస్తుందని ఎక్కువమంది నేతలు భయపడిపోతున్నారు.

* కేసుల భయంతోనే..
ప్రస్తుతం ఈ కేసుల నుంచి తప్పించుకోవాలంటే కూటమి( Alliance ) పార్టీల్లో చేరడం ఉత్తమమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక నిర్ణయానికి వస్తున్నారు. ఇందులో తాజా మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఉన్నారు. అవసరం వరకు జనసేనతో పాటు టిడిపి వైసిపి నేతలను ఆకర్షించింది. ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో మిగిలిపోయిన నేతలంతా ఒకప్పటి దూకుడు నేతలే. వారికి తెలుగుదేశంతో పాటు జనసేనలో ఆప్షన్ లేదు. తమ ముందు కనిపిస్తోంది భారతీయ జనతా పార్టీ. పైగా ఏపీలో బలహీనంగా ఉంది. పార్టీలోకి వస్తామంటే వద్దనడం లేదు. అందుకే మూకుమ్మడిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు బిజెపిలో చేరేందుకు రెడీ అయిపోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కేసులు తప్పవని భావిస్తున్న నేతలంతా బిజెపిలోకి క్యూ కడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే బీజేపీలో ఉన్న తమ పాత స్నేహితుల ద్వారా ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.

* బిజెపిలోకి క్యూ
ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. జగన్ చుట్టూ ఉన్న నేతలతో పాటు అప్పటి అధికారులు, సలహాదారులంతా జైలుకు వెళ్లారు. మరికొందరు వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఓ 16 మంది పెద్ద తలకాయలు బిజెపిలోకి( Bhartiya Janata Party) వెళ్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. ప్రస్తుతం వారంతా సేఫ్ జోన్ వెతుక్కుంటూ బిజెపిలోకి వెళ్తున్నారు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇది పెద్ద ఎదురుదెబ్బ. ఆ పార్టీ శ్రేణులు సైతం ఆత్మస్థైర్యాన్ని కోల్పోయే అవకాశం ఉంది. అందుకే బిజెపిలోకి వైసిపి నేతల చేరికకు చంద్రబాబు సైతం ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే ఏపీలో ఒకేసారి రాజకీయ ప్రకంపన రేగే అవకాశం కనిపిస్తోంది.

Exit mobile version