YS Jagan Nellore Visit Viral video: జగన్ అంటే వైసీపీ నేతలకు ఓ ఏమోషన్.. ఆయన పరిపాలన, పగలు ఎలా ఉన్నా.. ఆ పార్టీ ఫ్యాన్స్ కు మాత్రం ఆయన వస్తుంటే పండుగ. అయితే జగన్ పర్యటనకొస్తే చాలు దాడులు, మరణాలు, అపశృతులు చోటుచేసుకుంటుండడంతో ఈసారి ప్రభుత్వం గట్టి ఆంక్షలు పెట్టి ఎక్కడికక్కడ కట్టడి చేస్తోంది. దీంతో అభిమానులు జగన్ కోసం సాహసాలు చేస్తున్నారు. ప్రధాన రహదారులు దిగ్బంధించడంతో అడవులు, కొండలు, కోనలు దాటి జగన్ కోసం తరలివస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి.
వైయస్ జగన్ గారి నెల్లూరు పర్యటనకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్న కూటమి ప్రభుత్వం
పోలీసులు రోడ్ల మీద ఎక్కడికక్కడ బారికేడ్లు, చెక్ పోస్ట్‌లు పెట్టి జనాలను ఆపుతుండడంతో అడవుల్లో నుండి ప్రయాణిస్తూ జగన్ గారి పర్యటనకు వస్తున్న అభిమానులు, వైయస్ఆర్ సీపీ శ్రేణులు
నీకు… pic.twitter.com/RZsL24qiov
— YSR Congress Party (@YSRCParty) July 31, 2025
నెల్లూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనకు ప్రజల నుంచే కాకుండా ప్రభుత్వ యంత్రాంగం నుంచీ తీవ్ర ప్రతిస్పందన కనిపిస్తోంది. జగన్ పర్యటన పోలీసులు భారీ ఆంక్షలు పెట్టారు.
పోలీసులు రోడ్లపై చెక్‌పోస్టులు, బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను ఆపేస్తున్నారు. జగన్ గారిని చూసే ఆశతో వచ్చిన వందలాది మంది కార్యకర్తలు, అభిమానులు ప్రధాన రహదారుల్లోకి ప్రవేశించలేక అడవులు, కొండలు, కున్నలు దాటి నగరాన్ని చేరుకుంటున్నారు. కూర్మవీధులు, చిన్న గ్రామ మార్గాలు, చెరువుల తీరాలు.. ప్రజల రాకపోకలతో నిండి పోతున్నాయి.
పోలీసుల ఆంక్షలకి తలొగ్గకుండా
నెల్లూరు వైయస్ జగన్ గారి పర్యటనకి భారీగా వస్తున్న కార్యకర్తలు, జనంరోడ్లుపై పోలీసులు వాహనాల్ని ఆపుతుండటంతో అడవుల్లో నుంచి నెల్లూరుకి ప్రజానీకం#SadistChandraBabu pic.twitter.com/xMRhrLOko5
— YSR Congress Party (@YSRCParty) July 31, 2025
నెల్లూరు జిల్లాలో జగన్ పర్యటన అంటే ప్రజల్లో ఉత్సాహం వెల్లివిరుస్తుంది.
ఈ పరిస్థితులు చూస్తే… జగన్ మోహన్ రెడ్డి పట్ల ప్రజల్లో గల గాఢమైన నమ్మకం, ఆశ, ప్రేమ స్పష్టంగా తెలుస్తోంది. ప్రజలు అడవులు దాటి వస్తున్నారు అంటే అది కేవలం నాయకుడి పట్ల విశ్వాసం మాత్రమే కాదు. అంతకుమించిన ప్రేమ కనిపిస్తోంది.