Venkateswara Swami Significance: వేంకటేశ్వరస్వామి స్వామి చేతులకు ఉన్న మహత్య్మం ఇదీ!

Venkateswara Swami Significance: కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి స్వామి ని ఒక్కసారైనా దర్శించుకోవాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. తెలుగువారైతే ఏడాదికి ఒకసారైనా శ్రీవారి దర్శనానికి ప్రయాణం ప్లాన్ చేసుకుంటారు. శ్రీనివాసుడు కొలువైన తిరుపతికి స్వామివారి దర్శనం కోసం మాత్రమే కాకుండా ఇక్కడ ఆహ్లదమైన వాతావరణముంటుంది. ఒకసారి తిరుపతి వెళ్లి వస్తే తమ మనసు ఎంతో హాయిగా ఉంటుందని కొందరు అంటూ ఉంటారు. అలాగే కొన్ని ప్రత్యేక రోజుల్లో ఇక్కడ ఉండేందుకు ప్లాన్ చేసుకుంటారు. అయితే వెంకటేశ్వర స్వామి స్వయంభు గా వెలిశాడని చరిత్ర తెలుపుతుంది. అలాగే మిగతా ఆలయాల కంటే ఇక్కడ భిన్నమైన చరిత్ర ఉంది. వీటిలో విగ్రహం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ విగ్రహంలో ఉండే ఈ రహస్యాలు ఏంటంటే?

వెంకటేశ్వర స్వామి ఇక్కడ నిల్చోని ఉన్నట్టు కనిపిస్తాడు. అయితే మిగతా దేవుళ్ళు ఎడమ చేయి సాధారణంగా ఉంచి.. కుడివైపు అభయ హస్తాన్ని ఉంచుతారు. తిరుపతిలో కొలువైన వెంకటేశ్వర స్వామి అందుకు భిన్నంగా ఉంటారు. వెంకటేశ్వర స్వామి ఎడమ ఎడమచేతు నడుము వైపును సూచిస్తుంది. కుడి చేయి కిందికి ఉంటుంది. మరి ఇలా భిన్నంగా ఉండడానికి కారణమేంటి?

Also Read: శ్రావణ శనివారాల్లో ఇలా చేస్తే ఏళ్లనాటి శని విముక్తి…

తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఎవరు తయారు చేయలేదు. ఈ విగ్రహం స్వయంభుగా వెలిసిందని చెబుతూ ఉంటారు. ఈ విగ్రహానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ విగ్రహం వెనుక వైపు ఎప్పుడు తేమతో కూడుకొని ఉంటుందని అంటారు. అందుకే ఇక్కడ ఎప్పుడూ ఫ్యాన్లను తిప్పుతూ ఉంటారు. వెంకటేశ్వర స్వామికి నిజమైన కురులు ఉన్నాయని చెబుతూ ఉంటారు. అలాగే వెంకటేశ్వర స్వామి చేతులకు ప్రత్యేకమైన అర్థం ఉందని అంటున్నారు.

ఈ విగ్రహంలో ఎడమ చేతు ఉండే ప్రదేశాన్ని కటి స్థానం అని అంటారు. నడుము నుంచి కిందికి తొడల నుంచి పైకి ఉండే భాగాన్ని కటి అంటారు. అలాగే కుడి చేతి నీ వరద హస్తమని అంటారు. అంటే ఈ చేయి కిందికి ఉంటుంది. ఈ వరద హస్తం ద్వారానే భక్తులకు స్వామివారు వరాలు ఇస్తాడని అంటారు. అయితే వరద హస్తం నుంచి వరాలు పొందాలంటే కటిక స్థానం నుంచి బయటపడాలి అని అంటారు. అంటే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే ఎన్నో నియమాలు పాటించి ఆలయానికి రావాలి అని చెబుతోంది.

అంటే స్వామివారిని శరణు కోరితే ఇవ్వనిది అంటూ ఏమీ ఉండదని నీ చేతులు చెబుతాయి. అందువల్ల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే ముందు కాస్త నిష్టతో ఉండాలి. అంతేకాకుండా స్వామివారి దర్శనం పూర్తి అయిన తర్వాత కూడా ఒకరోజు నిష్టతో ఉండడం వల్ల ఆ స్వామివారి అనుగ్రహం పొందే అవకాశం ఉంటుంది. అయితే కొందరు ఇక్కడికి వచ్చి పొరపాట్లు చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇంటి నుంచి ప్రయాణం మొదలుపెట్టి.. తిరిగి ఇంటికి చేరేవరకు ఎలాంటి చెడు పనులు చేయకుండా ఉండాలి. ఇక వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తారు. ఒక్కసారిగా స్వామివారి అనుగ్రహం పొందితే మళ్లీమళ్లీ వచ్చేవారు ఎంతోమంది ఉన్నారు.

Leave a Comment