Unclaimed Bank Money: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 67 వేల కోట్లు.. చాలా సంవత్సరాలుగా అలా మూలిగి పోతున్నాయి. పట్టించుకునే వారు లేరు. వాటిని తీసుకునేవారూ లేరు. ఇంతకీ ఆ నగదు ఎవరిది అనేది బ్యాంకులు బయట పెట్టడం లేదు. వాటిని తీసుకోవడానికి సంబంధిత వ్యక్తులు ముందుకు రావడం లేదు. ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా సంవత్సరాలుగా ఆ నిధులు అలాగే ఉంటున్నాయి. ఈ బ్యాంకు ఆ బ్యాంకు అని తేడా లేదు.. అన్ని బ్యాంకులలో ఆ నగదు ఉంది. కేవలం ప్రభుత్వ రంగబ్యాంకులు మాత్రమే కాదు.. ప్రైవేట్ రంగ బ్యాంకుల్లోనూ దండిగా నగదు నిల్వలు ఉన్నాయి.
Also Read: ఆపరేషన్ సింధూర్ పై చర్చ : కాంగ్రెస్ ఫెయిలా? పాస్ నా?
వాస్తవానికి ఊరు పేరు లేకుండా స్విస్ బ్యాంకులలో నగదు నిల్వలు పోగుపడి ఉండడం మనకు తెలుసు. పైగా అవన్నీ నల్ల దొరలకు సంబంధించిన నగదు నిల్వలు. ఆ నగదు ఎవరికి చెందిందో.. ఎవరు వేశారో స్విస్ బ్యాంకులు చెప్పవు. చెప్పడానికి ఏమాత్రం ఇష్టపడవు. ఎందుకంటే ఆ నగదు వల్ల స్విస్ దేశానికి దండిగా లాభం ఉంటుంది. పైగా ఆ నగదుతో ఆ బ్యాంకులు లావాదేవీలు నిర్వహిస్తుంటాయి. ఇదంతా బయటకు తెలిసిన వ్యవహారమే. అయితే మనదేశంలో మాత్రం అలా కుదరదు. కాకపోతే భారీగా నగదు నిల్వలు నిర్వహిస్తున్న వ్యక్తులకు వివరాలను బయటకు చెప్పడానికి మన దేశ బ్యాంకులో ఒప్పుకోవు. కాకపోతే వేలకోట్ల నగదు నిల్వలు మనదేశంలో కొంతమంది వ్యక్తులకు మాత్రమే ఉంటాయి. ఆ నగదు మీద వారికి సంపూర్ణ అధికారాలు ఉంటాయి. ఆ నగదు ఎలా వచ్చింది? ఏ రూపంలో స్వీకరించారు? దానికి సంబంధించిన ఆధారాలను బ్యాంకుకు ఎప్పుడు ఒకప్పుడు సంబంధిత వ్యక్తులు సమర్పించే ఉంటారు. సమర్పిస్తూనే ఉంటారు.. ఒకవేళ ఆ వ్యక్తులు ఏవైనా అనధికారికంగా.. అసాధారణమైన కార్యకలాపాలకు పాల్పడితే ఆ ఖాతాలను నిలుపుదల చేసే అధికారం అధికారులకు ఉంటుంది.
Also Read: తెలంగాణ మొదటి స్థానం నుంచి నాలుగు కి పడిపోయింది
పైన చెప్పుకున్న 67,000 కోట్లకు సంబంధించి ఇంతవరకు వివరాలు తమకు రాలేదని బ్యాంకులు చెబుతున్నాయి. 67,000 కోట్ల నిధులలో ప్రభుత్వ రంగ బ్యాంకులలో 58,330 కోట్లు ఉన్నాయి. ప్రవేట్ రంగ బ్యాంకులలో 8673 కోట్లు ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 19329 కోట్లు ఉన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకులో 6910 కోట్లు ఉన్నాయి. కెనరా బ్యాంకులో 6278 కోట్లు ఉన్నాయి. ఐసిఐసిఐ బ్యాంకులో 2063 కోట్లు ఉన్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంకులో 1609 కోట్లు ఉన్నాయి. యాక్సిస్ బ్యాంకులో 1360 కోట్ల నిధులు ఉన్నాయి. ఈ నగదుకు సంబంధించి బ్యాంకుల వద్ద కొంతమేర ఆధారాలు ఉన్నప్పటికీ.. ఆధారాల ప్రకారం వెళ్తే సంబంధిత వ్యక్తులు అక్కడ లేనట్టు తెలుస్తోంది. అందువల్ల వీటిని ఆన్ క్లెయిమ్ డ్ నగదు అని కేంద్రం చెబుతోంది. మరి ఈ నగదును వచ్చే రోజుల్లో ఏం చేస్తారు.. ఎవరికి ఇస్తారు.. అనే ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది. ఈ కథనం చదివారు కాబట్టి.. ఆ నగదులో మీకు సంబంధించినవి ఏమైనా ఉంటే.. ఇప్పుడే ఆధారాలు చూపించి తెచ్చుకోండి