Rashmika Mandanna viral tweet: నేడు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటించిన ‘కింగ్డమ్'(Kingdom Movie) చిత్రం భారీ అంచనాల నడుమ గ్రాండ్ గా విడుదలై డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఓవర్సీస్ నుండి ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ అదంతా నిర్మాత నాగవంశీ(Nagavamsi) రివ్యూయర్స్ కి కొనేసి వేయించిన ట్వీట్స్ అని ఇండియా లో ఈ సినిమాని చూసిన ప్రతీ ఒక్కరు చెప్తున్నారు. ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది కానీ, సెకండ్ హాఫ్ చాలా చెత్తగా ఉందని, భారీ హిట్ కోసం విజయ్ దేవరకొండ ఎదురు చూపులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని నెటిజెన్స్ కామెంట్స్ చేశారు. కానీ భారీ హైప్ తో రావడం వల్ల, ఈ సినిమాకు ఓపెనింగ్స్ మాత్రం అన్ని ప్రాంతాల్లో అదిరిపోయాయి. ముఖ్యంగా నైజాం, ఓవర్సీస్ ప్రాంతాల్లో అయితే విజయ్ దేవర కొండ విశ్వరూపం చూపించేశాడు అనొచ్చు. స్టార్ హీరోల రేంజ్ ఓపెనింగ్ దక్కింది.
Also Read: ఇంటర్వ్యూ లో బోరుమని ఏడ్చేసిన పల్లవి ప్రశాంత్..వైరల్ అవుతున్న వీడియో!
ఇకపోతే కాసేపటి క్రితమే విజయ్ దేవరకొండ ప్రేయసి రష్మిక(Rashmika Mandana) ఈ చిత్రం గురించి వేసిన ఒక ట్వీట్ బాగా వైరల్ అయ్యింది. ఆమె మాట్లాడుతూ ‘నాకు తెలుసు..ఈరోజు నీకు..నీ అభిమానులకు ఎంత ప్రత్యేకమైన రోజు అనేది.. మనం కొట్టినాం’ అంటూ ఆమె ఒక ట్వీట్ వేసింది. ఆమె ఈ ట్వీట్ వేసిన వెంటనే నిమిషాల వ్యవధి లో వేలసంఖ్యలో లైక్స్, వందల సంఖ్యలో కామెంట్స్ వచ్చాయి. వీళ్లిద్దరు కలిసి రిలేషన్ లో ఉన్నారనే విషయం ప్రతీ ఒక్కరికి తెలుసు. కానీ ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. ఇంకా ఎంత కాలం ఇలా ఉంటారు అంటూ అభిమానులను వీళ్ళిద్దరిని సోషల్ మీడియా లో ఎప్పటి నుండో ప్రశ్నిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం రష్మిక విజయ్ దేవరకొండ ఇంట్లోనే ఉంటుందని సమాచారం. అక్కడి నుండే ఆమె షూటింగ్స్ కి కూడా వెళ్తుందట. ఇలా వీళ్ళ గురించి ఎన్నో కథలు సోషల్ మీడియా లో రోజూ తిరుగుతూనే ఉన్నాయి.
Also Read: ‘కింగ్డమ్’ సెంటిమెంట్ సీన్స్ కి నవ్వుతున్నారు భయ్యా..ఇలా అయితే కష్టమే!
ఇక కింగ్డమ్ విషయానికి వస్తే ఇది పక్కా A సెంటర్ ఆడియన్స్ సినిమా. డైరెక్టర్ సెకండ్ హాఫ్ విషయం లో పూర్తిగా గాడి తప్పాడు. KGF మరియు ఛత్రపతి సినిమాలను మిక్స్ చేసి ఎదో తీద్దాం అనుకున్నాడు కానీ, కుదర్లేదు. ఫస్ట్ హాఫ్ రేంజ్ లో సెకండ్ హాఫ్ ని కూడా కొనసాగించి ఉండుంటే ఈ సినిమా లెవెల్ వేరే రేంజ్ లో ఉండేది. విజయ్ దేవరకొండ ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్న భారీ హిట్ దక్కేది. రేపటి నుండి వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి. ఒకవేళ రేపు వసూళ్లు పడిపోతే, విజయ్ దేవరకొండ ఖాతాలో మరో భారీ డిజాస్టర్ ఫ్లాప్ ని చూడాల్సి వస్తుంది.