Rajasaab Movie Updates: రాజాసాబ్ సెట్ లో ప్రభాస్ కు ఊపిరి

Rajasaab Movie Updates: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) నటించిన లేటెస్ట్ చిత్రం ‘రాజా సాబ్'(The Rajasaab) కోసం అభిమానులు ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో విడుదల అవ్వాల్సిన ఈ సినిమా, ఇప్పుడు డిసెంబర్ 5 కి వాయిదా పడింది. షూటింగ్ కార్యక్రమాలు టాకీ పార్ట్ కి సమందించి దాదాపుగా మొత్తం పూర్తి అయ్యాయి. కేవలం కొంత ప్యాచ్ వర్క్ మరియు VFX వర్క్ మాత్రమే బ్యాలన్స్. రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని విడుదల చేశారు. రెస్పాన్స్ అదిరిపోయింది. ప్రభాస్ లోని వింటేజ్ కామెడీ టైమింగ్ ని చూసి కేవలం అభిమానులే కాదు, మూవీ లవర్స్ కూడా మురిసిపోయారు. అంతే కాదు ఈ చిత్రం సెట్స్ ని మీడియా కి సందర్శించే అవకాశం కూడా కల్పించారు మేకర్స్. దీంతో కొన్ని మీడియా చానెల్స్ సెట్స్ లో ప్రాపర్టీస్ గురించి ప్రత్యేకమైన వీడియో చేశారు.

Read Also: హీరోయిన్ రీమాసేన్ గుర్తుందా..? ఇప్పుడు ఆమె ఎలా తయారైందో మీరే చూడండి!

సాధారణంగా ఇలాంటి భారీ సెట్స్ ఉన్న బంగ్లా కి AC అందించడం చాలా కష్టం తో కూడుకున్న పని. అందుకే డైరెక్టర్ మారుతీ ఒక అరుదైన ఆలోచన చేశాడు. భారీ పైప్స్ ని అమర్చి, అందులో నుండి AC గాలి వచ్చేలా చేశాడు. ఈ పైప్స్ విలువ ఒక్క రోజుకి 14 వేల రూపాయిలు రెంట్ కట్టాలంటా. దానిని చూపిస్తూ యాంకర్ చేసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఇలాంటి పైప్స్ ని చూడడం ఇదే మొట్టమొదటిసారి అని, చాలా గొప్ప ఆలోచన చేసారని, డైరెక్టర్ బుర్రలో ఇలాంటి ఆలోచనలు ఉన్నాయంటే, సినిమా కూడా ఇదే విధంగా కొత్తగా తీసి ఉంటాడని, తెలుగు లో హారర్ కామెడీ కి తెరలేపింది మారుతి అని, ‘రాజా సాబ్’ తో హారర్ పద్దతిలో సరికొత్త జానర్ ని ఆవిష్కరించి ఉంటాడని అంటున్నారు నెటిజెన్స్. మరి ఇది ఎంత వరకు నిజమో చూడాలి.

Leave a Comment