Site icon Desha Disha

Pawan Kalyan Vs YCP: పవన్ ట్రాప్ లో వైసీపీ క్యాడర్!

Pawan Kalyan Vs YCP: పవన్ ట్రాప్ లో వైసీపీ క్యాడర్!

Pawan Kalyan Vs YCP: గాయం ఒకచోట ఉంటే.. మందు మరోచోట పూసినట్టు ఉంది వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ దుస్థితి. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలంటే.. పవన్ కళ్యాణ్ సినిమాకు ప్రచారం చేస్తోంది వైసీపీ క్యాడర్. అసలు ఆ సినిమాతో వైసిపికి ఉన్న సంబంధం ఏంటి? ఆ సినిమా సక్సెస్ తో ఏంటి పని? సినిమా ప్లాస్ అయితే వైసీపీకి వచ్చిన లాభమేంటి? అసలు హిట్, ప్లాఫ్ లతో సంబంధంలేని హీరో పవన్ కళ్యాణ్. ఆయనకు డై హార్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. సినిమా సక్సెస్ తో సంబంధం లేకుండా చూసే ప్రేక్షకులు ఉన్నారు. అటువంటి పవన్ కళ్యాణ్ ను తక్కువచేసి మాట్లాడడం ఎవరికి నష్టం? అంటే ముమ్మాటికీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Also Read: బీజేపీ గుట్టు బయటపెడుతోన్న రాజాసింగ్

* ప్రభుత్వ వైఫల్యాలపై
ఇటీవల చాలా రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర మంత్రి అచ్చెనాయుడు ఒక కీలక ప్రకటన చేశారు. ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయల చొప్పున ఆడబిడ్డ నిధి అందిస్తామని చంద్రబాబు( CM Chandrababu) ప్రకటించిన సంగతి తెలిసిందే. దానిని సూపర్ సిక్స్ పథకాలలో సైతం చేర్చారు. అయితే ఈ పథకం అమలు చేయాలంటే ఏపీని అమ్మేయాల్సిందేనని మంత్రి అచ్చన్న చేసిన ప్రకటన వైరల్ అయింది. దీనిని రాజకీయంగా వాడుకోవాలన్న సమయంలోనే వైయస్సార్ కాంగ్రెస్ పూర్తి దృష్టి హరిహర వీరమల్లు పై పెట్టింది. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం విలువైన సమయాన్ని వృధా చేసింది. అయితే పవన్ కళ్యాణ్ ట్రాప్ లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పడినట్లు స్పష్టమైంది.

* పవన్ తనకంటూ ఇమేజ్..
ఆది నుంచి పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan)తనకంటూ ఒక ఇమేజ్ను ఏర్పాటు చేసుకున్నారు. ఆయన మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో. తన కెరీర్ను ఒక వ్యూహం ప్రకారం బిల్డప్ చేసుకున్న హీరో పవన్. ప్రత్యేకంగా మాస్ ఇమేజ్తో ముందుకు సాగుతున్నారు. వరుసగా అపజయాలు ఎదురైన క్రేజ్ తగ్గని హీరో కూడా ఆయనే. అటువంటి పవన్ కళ్యాణ్ విషయంలో వైసీపీ శ్రేణులు చాలా తేలిగ్గా తీసుకున్నాయి. హరిహర వీరమల్లు అనే సినిమా ఐదేళ్లపాటు చిత్రీకరణ జరుగుతూ వచ్చింది. కానీ ఒకే ఒక్క రోజు సినీ ప్రమోషన్ చేసి మొత్తం తన వైపు తిప్పుకున్నారు పవన్ కళ్యాణ్. కానీ ప్రజా సమస్యలపై ఫోకస్ చేయకుండా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్ ట్రాప్ లో పడింది. ఆ సినిమాకు ఎనలేని క్రేజ్ ను తెచ్చి పెట్టింది. ప్రజల్లో బలమైన చర్చ జరిగేలా చేసింది. ఈ ప్రచారంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది లేదు. హరిహర వీరమల్లు అనే సినిమాపై అంచనాలు పెంచి.. లాభాల బాటలో తెచ్చి పెట్టింది ముమ్మాటికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. పోనీ రాజకీయంగా నైనా ఏమైనా మైలేజ్ వచ్చింది అంటే అది కూడా లేదు.

* టిడిపి కోసం పవన్ కృషి చేసేలా..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసిపి( YSR Congress party) విషయంలో మరింత అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. టిడిపి తో ఎన్ని ఇబ్బందులు ఉన్నా సర్దుబాటు చేసుకుని.. మరోసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకుండా గట్టిగానే పోరాడుతారు. హరిహర వీరమల్లు సినిమాకు ముందు ఒకలా ఉంటే.. ఆ సినిమా విడుదలయ్యే సమయంలో వైసీపీ వ్యవహరించిన తీరుతో పవన్ మరింత ఆగ్రహంగా ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది తెలుగుదేశం పార్టీకి లాభం చేకూర్చే విషయం. రాష్ట్రంలో వైసీపీకి ప్రధాన ప్రత్యర్థి తెలుగుదేశం. ఇప్పుడు అదే తెలుగుదేశం కోసం పవన్ కృషి చేసేలా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రెచ్చగొట్టిందన్నమాట. సినిమాలపరంగా పవన్ కళ్యాణ్ కు క్రేజ్ పెంచింది. తెలుగుదేశం పార్టీ ఎదుగుదలకు పవన్ దోహదపడేలా చేసింది. పవన్ ట్రాప్ లో పడిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో మాత్రం మూల్యం చెల్లించుకుందన్న టాక్ వినిపిస్తోంది.

Exit mobile version