Italy Chemical Castration Law: పసిపిల్లల నుంచి పండు ముదుసలి వారి వరకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ప్రతి ఏడాది ఈ కేసులు పెరుగుతున్నాయే తప్పా ఏ మాత్రం తగ్గడం లేదు. కోర్టులు ఎన్ని రకాలుగా శిక్షలు విధించినప్పటికీ.. కొన్ని సందర్భాలలో భూమి మీద లేకుండా చేసినప్పటికీ ఈ ఘోరాలు ఆగడం లేదు. కేవలం మనదేశమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఇదే దుస్థితి ఉంది. ఈ దారుణాలకు అడ్డు కట్టడానికి సరికొత్త శిక్ష అమలులోకి రానుంది.
Also Read: సముద్రంలో ఇది కనిపిస్తే బతికి ఉన్నా సచ్చినట్టే!
మనదేశంలో మాదిరిగానే ఇటలీలో కూడా అత్యాచార కేసులు పెరిగిపోతున్నాయి. ఈ కేసులకు అడ్డుకట్టడానికి అక్కడి ప్రభుత్వం అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఈ ప్రయత్నాలు అంతగా సఫలీకృతం కావడం లేదని తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇటలీ ప్రభుత్వం సరికొత్త చట్టాన్ని తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నట్టు గ్లోబల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అత్యాచారానికి పాల్పడిన పురుషులకు కఠిన శిక్షలు విధించాలని ఇటీవల కాలంలో ఇటలీలో డిమాండ్లు వ్యక్తం అవుతున్నాయి. పైగా అక్కడి ప్రభుత్వం ఇటీవల ఒక కొత్త ప్రతిపాదన తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ చట్టాన్ని కొంతమంది సమర్థిస్తుంటే.. మిగతావారు విమర్శిస్తున్నారు.. ఇటలీ దేశంలో అత్యాచారాలకు పాల్పడే దుర్మార్గులకు కఠిన శిక్షలు విధించాలని అక్కడ ప్రభుత్వం కొంతకాలం నుంచి భావిస్తోంది. దీనికోసం కెమికల్ కాస్ట్రేషన్ ప్రయోగించాలని నిర్ణయించింది. వైద్య పరిభాషలో కెమికల్ కాస్ట్రేషన్ అనేది ఒక చికిత్స. దీనిని ప్రయోగిస్తే పురుషులలో లైంగికలు తగ్గుతాయని ఇటలీ వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ శిక్షపై అక్కడి దేశంలో రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నేరస్థులకు ఇటువంటి శిక్ష విధించడం వల్ల భవిష్యత్తులో మళ్లీ దారుణాలకు పాల్పడకుండా ఉంటారని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ఇంకొందరేమో ఇది మానవ హక్కుల ఉల్లంఘనకు కారణమవుతుందని భావిస్తున్నారు. అయితే ఈ చట్టం వల్ల కొంతలో కొంత ప్రయోజనం ఉంటుందని.. నేరస్తులు మళ్లీ దారుణాలకు పాల్పడాలంటే భయపడతారని అక్కడ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ఈ శిక్ష భరించడానికి ముందుకు వచ్చే నేరస్థులకు పనిష్మెంట్ తగ్గించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కెమికల్ కాస్ట్రేషన్ పూర్తి ఉచితంగా లభిస్తుందని.. నేరస్తులు అంగీకరిస్తేనే దీనిని ప్రయోగిస్తారని ప్రచారం జరుగుతోంది.
Also Read: అమెరికాకు సుంకాలు విధించడం కొత్త కాదు.. లక్షల కోట్లతో ఇదిగో ఇలాంటి వ్యవస్థలను నిర్మించింది
“కెమికల్ కాస్ట్రేషన్ అనేది ఒక వైద్య ప్రక్రియ. ఇది లైంగిక కోరికలను పూర్తిగా తగ్గిస్తుంది. ఇలా తగ్గడం వల్ల ఆడవాళ్ళ పైన దారుణాలకు పాల్పడాలనే ఆలోచనను తగ్గిస్తుంది. ద్వారా ఘోరాలు తగ్గిపోతాయి. నేరాలు అంతగా చోటు చేసుకోవు. అంతేకాదు శాంతిభద్రతలకు విఘాతం కలగదని” అక్కడి నిపుణులు చెబుతున్నారు. అయితే దీనిపై ఇటలీ ప్రభుత్వం త్వరలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.