Site icon Desha Disha

India-US trade deal: మోడీకి ట్రంప్ జిగ్రీ దోస్త్.. అయినా ఏం ఫాయిదా?

India-US trade deal: మోడీకి ట్రంప్ జిగ్రీ దోస్త్.. అయినా ఏం ఫాయిదా?

India-US trade deal: పేనుకు పెత్తనమిస్తే తల అంతా కొరికిందట.. అలా ఉంది మన ట్రంప్ పరిస్థితి. అమెరికన్లు తమ తలరాత మారుస్తాడు.. తమకు ఉద్యోగాలిస్తాడు.. భవిష్యత్తును బాగు చేస్తాడని ఊహిస్తే.. ట్రెయిన్ అంతా రివర్స్ అయిపోయింది. ట్రంప్ విదేశాలపై సుంకాలు వేస్తూ వాటిని అమెరికాలోకి రాకుండా చేసి చివరకు అమెరికన్లకే ‘భారాన్ని’ మోపుతున్నాడు. ధరలు పెరిగి అమెరికన్లు తిండికి బట్టకు, జీవించడానికి నానా ఇబ్బందులు పడేలా చేస్తున్నారు. ఇప్పటికే పలు దేశాలపై సుంకాలు వేసిన ట్రంప్ తాజాగా భారత్ పై 25 శాతం సుంకాలతో విరుచుకుపడ్డాడు. మన ఆయిల్ కంపెనీలను నిషేధించాడు. నానా పెంట చేస్తున్నాడు. దీంతో ట్రంప్ వాళ్ల దేశం వారినే కాదు.. మన భారత్ లాంటి దేశాలపై కూడా తన తెంపరితనంతో దెబ్బతీస్తున్నాడు.

Also Read:  పాలంటీర్.. అమెరికాకు ‘మెదడు’గా మారిన శక్తివంతమైన AI సాఫ్ట్‌వేర్ కథేంటి!

మోడీకి ట్రంప్ జిగ్రీ దోస్త్.. అయినా కూడా భారత్ కు లాభం లేకుండా పోయింది. భారతదేశం నుంచి వచ్చే వస్తువులపై 25 శాతం టారిఫ్ విధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకుగాను భారత్‌పై పెనాల్టీ కూడా విధిస్తామని తెలిపారు. ఈ ప్రకటనతో ఇండియా-అమెరికా మధ్య ట్రేడ్ డీల్ ఆశలు గల్లంతవుతున్నాయి.

ఇటీవలి వరకు ట్రేడ్ డీల్‌పై చర్చలు జరిగాయని, అవి సానుకూల దశకు చేరుకున్నాయని వార్తలు వెలువడ్డా, తాజా పరిణామాలతో వాటిపై స్పష్టత లేకపోయింది. ప్రధాని మోదీతో ట్రంప్‌కు వ్యక్తిగత స్నేహం ఉన్నా, దేశాధ్యక్షులుగా ఉన్న అనుబంధం వాణిజ్యానికి ఉపయోగపడలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Also Read: నాన్ వెజ్ అంటే మనకే కాదు..యావత్ ప్రపంచానికి ఇష్టమే..ఇంతకీ వేటిని ఎక్కువ తింటున్నారో తెలుసా?

ట్రంప్ వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం స్పందించింది. “వ్యాపార, వ్యవసాయ రంగాల ప్రయోజనాలను కాపాడేందుకు మేము కట్టుబడి ఉన్నాం. ఏదైనా ఒత్తిడికి రాజీపడబోము,” అని స్పష్టం చేసింది.

వ్యాపార నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ చర్యలతో భారత ఎగుమతులకు కొంత ఇబ్బంది కలగొచ్చని, కేంద్రం ఎలా స్పందిస్తుందన్నదే కీలకం. తన జిగ్రీ ఫ్రెండ్ ట్రంప్ నే ఒప్పించలేకపోయినా.. టారిఫ్ లు తప్పించలేకపోయిన మోడీకి ఓ రకంగా ఇది పెద్ద దెబ్బనే.. కానీ తిక్క ట్రంప్ సీతయ్య లాంటోడు.. ఎవరి మాట వినడు.. కాబట్టి ఆయన నిర్ణయాలు అమెరికాకే పెద్ద దెబ్బగా మారుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

Exit mobile version