Site icon Desha Disha

Gabbar Singh Actor News: గబ్బర్ సింగ్ నటుడికి నడిరోడ్డులో చుక్కలు చూపించిన జగన్ ఫ్యాన్స్!

Gabbar Singh Actor News: గబ్బర్ సింగ్ నటుడికి నడిరోడ్డులో చుక్కలు చూపించిన జగన్ ఫ్యాన్స్!

Gabbar Singh Actor News

Gabbar Singh Actor News: ఒక సెలబ్రిటీ అయ్యుండి మరో సెలబ్రిటీని అభిమానించడం లో ఎలాంటి తప్పు లేదు. కానీ సినీ సెలబ్రిటీ అయ్యుండి, మరొక సెలబ్రిటీపై నోరు పారేసుకోవడం చాలా పెద్ద తప్పు. ఎందుకంటే నువ్వు ద్వేషించే ఆ సెలబ్రిటీ అభిమాని టికెట్ కొని నీ సినిమాకు వచ్చి ఉంటారు. ఎప్పుడైనా నువ్వు ఒంటరిగా బయట కనిపించినప్పుడు ఆ సెలబ్రిటీ కి సంబంధించిన అభిమానులకు దొరికితే అంతే పరిస్థితి..ఒక్కోసారి కొట్టొచ్చు, తిట్టొచ్చు కూడా. సరిగ్గా అలాంటి పరిస్థితి గబ్బర్ సింగ్ గ్యాంగ్ లోని సాయి అనే వ్యక్తికీ జరిగింది. ఈయన పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కి ఎంతటి వీరాభిమాని అనేది మన అందరికీ తెలుసు. పవన్ కోసం ప్రాణాలను కూడా ఇచ్చేంత అభిమానం. ఎందుకంటే ‘గబ్బర్ సింగ్’ చిత్రం ఈయనకు ఊపిరి. ఈ సినిమా తర్వాత ప్రతీ చిత్రం లోనూ ఆయన రౌడీ గ్యాంగ్ లో ఒకరిగా నటించే అవకాశం దక్కింది.

Also Read: బాలయ్య బాబు అఖండ 2 రిలీజ్ పై ఎందుకంత సస్పెన్స్.. ఏం జరిగింది..?

ఒకటి కాదు, రెండు కాదు, గబ్బర్ సింగ్ కారణంగా ఇతనికి వందల సినిమాల్లో నటించే అవకాశం దక్కింది. బాగా డబ్బులు సంపాదించాడు. అందుకే పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి అభిమానం. చాలా మంది మేము పవన్ కళ్యాణ్ అభిమానులం అని చెప్పుకొని తిరుగుతుంటారు కానీ, ఇతను మాత్రం 2019 ఎన్నికల సమయం లో బయటకు వచ్చి ప్రచారం చేసాడు, అదే విధంగా 2024 వ సంవత్సరం లోనే ఎండల్లో తిరిగి జనసేన పార్టీ కోసం ప్రచారం చేసాడు. అంత వరకు ఇతన్ని మెచ్చుకోవచ్చు. అన్నం తిన్న విశ్వాసాన్ని మర్చిపోలేదు. కానీ ఇతనికి జగన్(YS Jagan Mohan Reddy) ని తీవ్రంగా విమర్శించే హక్కు లేదు. స్వేచ్ఛగా మాట్లాడుకోవడం అనేది రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. కానీ సినిమాల్లో ఉన్నప్పుడు ఆచి తూచి మాట్లాడాలి. జబర్దస్త్ లో పని చేసే ప్రతీ ఒక్కరు పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేశారు, కానీ జగన్ ని కానీ, వైసీపీ పార్టీ ని పల్లెత్తి ఒక్క మాట కూడా అనలేదు.

కానీ ఈ సాయి అనే అతను జగన్ పై చాలా విమర్శలే చేసాడు. నిన్న హైదరాబాద్ సిగ్నల్స్ వద్ద ఇతను జగన్ అభిమానులకు దొరికాడు. రీసెంట్ గానే ఆయన వైసీపీ మహిళా నాయకురాలు శ్యామల పై చాలా దారుణమైన కామెంట్స్ చేసాడు. అందుకు ఆయన చేత వైసీపీ అభిమానులు క్షమాపణలు చెప్పించారు. ఆయన మాట్లాడింది ఏమిటంటే ‘రాయలసీమ, కడప, ఆంధ్ర ప్రదేశ్ నుండి కొన్ని లక్షల కాల్స్ వచ్చాయి. నేను మొన్న వైసీపీ కొడుకులు అంటూ ఆవేశం గా మాట్లాడాను. నాకు వైసీపీ లో ఎంతో మంది శ్రేయోభిలాషులు ఉన్నారు, ఎవరో కొంతమంది సోషల్ మీడియా లో దానిని పట్టుకొని బాగా తిప్పారు. వైసీపీ అభిమానులు నా వల్ల బాధపడి ఉండుంటే మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ఆ వీడియో ని మీరు కూడా క్రింద చూడవచ్చు.

Exit mobile version