Coastal Andhra Rain Alert: మరో 48 గంటల పాటు.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు!

Coastal Andhra Rain Alert: ఏపీవ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు అవుతున్నాయి. బంగాళాఖాతంలో( Bay of Bengal ) ఏర్పడిన అల్పపీడన ప్రభావం ఉత్తరాంధ్ర పై స్పష్టంగా కనిపిస్తోంది. ఏపీ దక్షిణ తీర ప్రాంత జిల్లాలు, రాయలసీమలో సైతం వర్షాలు పడుతున్నాయి. కొన్నిచోట్ల పిడుగులతో కూడిన వాన పడుతోంది. ఇదే పరిస్థితి మరో మూడు రోజులపాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా ఉత్తరాంధ్రకు వర్ష సూచన ఉంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు అవుతున్నాయి.

Also Read: లిక్కర్ స్కాంలో భారతీ రెడ్డి పేరు!?.. జగన్ కు షాక్!

 ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన..
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో నేడు, రేపు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెబుతోంది. ప్రధానంగా శ్రీకాకుళం( Srikakulam), విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో సైతం చెదురుమదురుగా వర్షాలు పడతాయని చెబుతోంది.

Also Read: ఏపీ ఎకానమీ మందగించిందా? వాస్తవమిదీ

 కొనసాగుతున్న వరద ఉధృతి..
మరోవైపు రాష్ట్రంలోని ప్రధాన నదుల్లో ( main rivers)వరద ఉధృతి కొనసాగుతోంది. భారీ వర్షాల ప్రభావం తగ్గిన నేపథ్యంలో గోదావరికి వరద స్థిరంగా కొనసాగుతోంది. భద్రాచలం వద్ద ప్రస్తుతం 36.2 అడుగుల నీటిమట్టం నమోదయింది. అలాగే కూనవరం వద్ద గోదావరి నీటిమట్టం 15.9 మీటర్లుగా నమోదు అయ్యింది. పోలవరం వద్ద కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అక్కడ గోదావరి నది నీటిమట్టం 11.39 మీటర్లు. మరోవైపు ధవలేశ్వరానికి ఇన్ ఫ్లో భారీగా పెరిగింది. ఇక్కడ ఇన్ ఫ్లో 5.57 లక్షల క్యూసెక్కులకు చేరింది. దీంతో జల వనరుల మంత్రిత్వ శాఖ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. పైనుంచి వచ్చిన నీటిని యధావిధిగా కిందకు విడుదల చేస్తున్నారు. గోదావరి,తుంగభద్ర, కృష్ణానది వరద ప్రవాహం పూర్తిస్థాయిలో అత్యంత వరకు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచిస్తోంది.

Leave a Comment